శ్రీథరమాధురి - 98 - అచ్చంగా తెలుగు

శ్రీథరమాధురి - 98

Share This

 శ్రీథరమాధురి - 98 

(పూజ్యశ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ అమృత వాక్కులు)



ఈ లోకంలో కొందరు చూపే ,స్వార్ధం, వక్ర బుద్ధి, స్వాధీనతా భావం, వెన్నుపోటు వంటివి, ఇతరులు వాటి గురించి అప్రమత్తంగా, జాగురూకతతో ఉండేలా చేసే అద్భుతమైన అవకాశాలు. నిజానికి, ప్రతికూల వ్యక్తుల చర్యలే మిమ్మల్ని మరింత అప్రమత్తంగా, ఎరుక కలిగి ఉండేలా చేస్తాయి.

***

మీరేమి చేసినా మనస్పూర్తిగా చెయ్యండి, అదే ధ్యానంగా మారిపోతుంది. 

***

ఆశయాలు తీరేందుకు దురాక్రమణ కావాలి. లక్ష్యాలు చేరుకునేందుకు దాడి చెయ్యడం అనే ఇంధనం కావాలి.  దైవానుగ్రహం వలన మేము ప్రశాంతంగా ఉన్నాము, మాకు ఆశయాలు, లక్ష్యాలు లేవు. సాధించాల్సింది ఏమీ లేదు. చాలామంది ప్రశాంతంగా ఎందుకు లేరంటే, వారికి ఆశయాలు, లక్ష్యాలు ఉన్నాయి. దురాక్రమణ, శాంతి వ్యతిరేకాలు. దీనికి తోడుగా, ‘సాధించడం’ అనే పదంతో చాలామంది తిప్పలు పడుతూ ఉండడం నేను చూస్తున్నాను. సాధించడానికి ఎదుర్కునే ఒత్తిడి అందరినీ చంపేస్తోంది. ఏదైనా సాధించడం అంటే, ఎల్లప్పుడూ ఇతరులతో పోల్చుకోవడం, తమ సత్తాను పెంపొందించుకోవడం.

***

No comments:

Post a Comment

Pages