సగ్గు (సాగో) బియ్యము - అచ్చంగా తెలుగు

సగ్గు (సాగో) బియ్యము

అంబడిపూడి శ్యామసుందర రావు 

 
తెలుగు వారి ఇళ్లలో ఏదైనా శుభకార్యము లేదా పండుగలు వస్తే చేసేది సగ్గుబియ్యము పాయసము. సగ్గు బియ్యం అనగానే అది  ఒక పంట నుండి వచ్చినదని లేదా మొక్కలకు పండుతుందని అనుకుంటారు చాలమంది. కానీ అది కేవలము పరిశ్రమలలో తయారైనది మాత్రమే..సగ్గు బియ్యము ( రాయలసీమలో సబ్బియ్యం,హిందీలో సాబుదానా) తో పాయసం లేదా ఖీర్  చేసుకుని తింటానికి చాలా మంది ఇష్టపడతారు సాధారణముగా ఏ పండగ వచ్చినా ఈ సగ్గు బియ్యము పాయసము ఉంటుంది  అంతే  కాకుండా ఈ సగ్గు బియ్యముతో వడియాలు లాంటి ఇతర వంటకాలు కూడా చేస్తారు  దీని పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకుంటే దీని వెనుక ఇంత చరిత్ర ఉందా అనిపిస్తుంది ,  చోళ రాజు  రామవర్మ ఎంతో ముందు చూపుతో ఈ దుంపరాజాన్ని దక్షిణాదికి పరిచయం చేశారు. తళ తళ లాడే ముత్యాల్లా ఉండే సగ్గు బియ్యం తయారీ కి తొలి కేంద్రం సేలం ( తమిళనాడు ) సగ్గు బియ్యం తయారయ్యెది కేవలం మూడు రాష్ట్రాలలోనె. మొత్తం ఉత్పత్తిలో తమిళనాడు రాష్ట్రంలో 70 శాతం. మిగతా 30 శాతం కేరళ  ఆంధ్రప్రదేశ్ లది. ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోటకు చుట్టు పక్కల సుమారు ఇరవై అయి కిలోమీటర్ల పరిధిలో మొత్తం 40 సగ్గు బియ్యం తయారి మిల్లులున్నాయి. తమిళ నాడులో సుమారు 500 మిల్లులున్నాయి.


సగ్గు బియ్యము ఎలా తయారు అవుతుందో  తెలుసుకుందాము.   సగ్గు బియ్యం తయారికి ముడి సరుకు కర్ర పెండలము కర్ర పెండలము ఇది వేరు,దుంప పంటల తాలుకా కుటుంబానికి చెందినది మొదటిగా దీనిని దక్షిణ అమెరికా సాగుచేయబదినది ఇది ఆహారంగా వాడే ఒక రకము దుంప. మన రాష్ట్రంలో ఇది ఎక్కువగా మెట్ట ప్రాంతాలలో, తీరప్రాంతాలలో పండుతుంది దీన్ని భూమి నుండి త్రవ్వి బయటకు తీసిన 24 గంటల లోపు సగ్గు బియ్యం తయారీ కేంద్రానిచేర్చిఆ దుంపలను నీటిలో బాగా శుభ్రంచేసి దానిపై నున్న తొక్కను యంత్రాలతో తొలిగిస్తారు. తొక్క తీసిన దుంపలను మరొక్కసారి నీళ్ళలో శుభ్ర పరచి  చెరుకు నుండి చెరుకు రసాన్ని తీసినట్లుగా క్రషర్ల ద్వారా పాలను తీస్తారు. ఈ పాలను సర్క్యులేటింగ్ చానల్స్ లోకి పంపి చిక్కని ముద్ద లాంటి పదార్ధాన్ని తయారుచేస్తారు. దీనిని వివిధ రకాల పరిమాణంలో రంద్రాలున్న జల్లెడ లాంటి పాత్రలోకి పంపి అటు ఇటు కదుపుతూ ఉంటె జల్లెడ రంధ్రాల నుండి తెల్లటి చిన్న చిన్న గుల్ల ఆకారము లో సగ్గు బియ్యము జల జల రాలి పడుతుది. వీటిని పెద్ద పెనము మీద వేడి చేసి ఎండలో ఆరుబయట ఎండబెడతారు. ఈ విధముగా 500 కిలోల దుంప నుండి 100 కిలోల సగ్గు బియ్యము తయారు అవుతుంది.


ఇక సగ్గు బియ్యము పోషక విలువలు తెలుసుకుందాము.దీనిలో ప్రధానముగా ఉండేది పిండి పదార్థమే ప్రతి 100 గ్రాముల సగ్గు బియ్యము 544 కేలరీల శక్తినిస్తుంది.దీనిలో కొలెస్ట్రాల్, సాచ్యురేటెడ్ క్రొవ్వులు మరియు సోడియమ్ చాలా తక్కువ విటమిన్‌ B9  6.1 మి.గా,ఇనుము 2.4 మి.గ్రా, కాల్సియం 30.4 మి.గ్రా,ఒమేగా 3 ఫాటీయాసిడ్స్ 1.5 మి.గ్రా,ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ 3.0 మి.గ్రా,పీచు పదార్ధము 1000 మి.గ్రా (1 గ్రాము) కాబట్టి ఇది సులభముగా జీర్ణమయే పోషక పదార్ధము పై పెచ్చు పాలు, పంచదార వంటి ఇతర పోషకాలతో కలిపి రుచికరమైన పదార్ధాలను తయారు చేయవచ్చు హిందువుల పండుగ రోజులలో పాయసము తప్పని సరిగాఉంటుంది అంతేకాకుండా ఉపవాసాలు ఉండేటప్పుడు కూడా సగ్గుబియ్యము వంటకాలు  తినవచ్చు అని చెపుతారు ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంకలలో ఈ  సగ్గు బియ్యము వాడకం ఎక్కువగాఉంటుంది. ఇంగ్లాండ్, న్యూజిల్యాండ్ ఆస్ట్రేలియాలలో కూడా సగ్గుబియ్యాన్నిపుడ్డింగ్ తయారీకి వాడతారు. సగ్గు బియ్యాన్ని నీటిలో నానబెట్టి ఉడికించినప్పుడు గింజలు పెద్దవి అయి మెత్తగా స్పంజిలా మారుతాయి  


కేవలము ఆహారపదార్ధముగా  మాత్రమే కాకుండా సగ్గు  బియ్యం వల్ల  ఇతర  ఉపయోగాలు కూడా ఉన్నాయి అవి ఏమిటో తెలుసుకుందాము. గ్లూ, అంటుకునే ఇండస్ట్రీస్, అంటే పోస్టర్లు అతికించటానికి వాడతారు పెట్ (పెంపుడు జంతువుల) ఫుడ్ ఇండస్ట్రీస్ లో ఈ పిండిని  ఉపయోగీస్తారు.అలాగే చేపల ఫీడ్ ఇండస్ట్రీ,లో ఉపయోగిస్తారు  కాగితం, పేపర్ శంఖం పరిశ్రమలలో ఉపయోగిస్తారు ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ కోన్ తయారీదారులు, అల్యూమినియం, కాస్ట్ ఇనుము ఫౌండరీస్  అచ్చులను చేయడానికి ఒక ఇసుక బైండర్నుగా ఈ పిండిని  ఉపయోగీస్తారు , ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ మాత్రలు బైండ్ వరకు పిండి, వాటి ఉత్పన్నాలను  ఉపయోగీస్తారు, ఇంకా సౌందర్య, డిటర్జెంట్స్, సోప్ ఇండస్ట్రీస్, తినదగిన మసాలా పౌడర్ తయారీదారులు,  ఉపయోగీస్తారు ప్లైవుడ్ పరిశ్రమలో కూడా వాడతారు. రబ్బరు, ఫోమ్ పరిశ్రమలు, వస్త్ర పరిశ్రమలు కిణ్వనం ఇండస్ట్రీ (ఎంజైములు, బీర్),లలో కూడా వాడతారు వస్త్రాల ఉత్పత్తిలో దారాలను ట్రీట్ చేసి యంత్రాలకు అనుగుణముగా ఉండటానికి ఈ పిండిని వాడతారు. ఈ పద్దతిని సీజింగ్ అంటారు ఈ పద్దతి వలన దారాలను కలిపి ఉంచటానికి వీలవుతుంది.యంత్రాలలో దారాలు జారిపోకుండా ఉంటాయి ఈ పిండి మొదటిసారి బట్టలను వాష్ చేసినప్పుడు పోతుంది  ఈ విధముగా ఎక్కువగా కర్ర పెండ్లము నుండి తయారు అయిన సగ్గు బియ్యము లేదా పిండి ఆహారము గానే కాకుండా ఇతరత్రా కూడ ఉపయోగపడుతుంది.


***

No comments:

Post a Comment

Pages