శివం - 84 - అచ్చంగా తెలుగు

శివం - 84  

రాజ కార్తీక్ 




(హార సిద్దు..ఆలయం లో రాజ ముద్ర పోవటం.. సిద్దు కోపంగా గా సైనికులు ను కొట్టడం... రాజు అతన్ని ఖైదు చేయమని చెప్పటంతో ఖిన్ను డు అయ్యాడు)


పక్కన వాళ్ళు రెచ్చగొట్టడం తో ఆ రాజు మరింత కోపోద్రిక్తుడై అయ్యాడు.. అసలు ఏం జరుగుతుంది హర సిద్దు ఎలాంటివాడు అని ఆలోచన లేకుండా "మహారాజా! నేను చెప్పేది వినండి. మేము ముందే నేను కూడా ఉన్నాను నేను దాన్ని ఎలా మాయం చేస్తాను. ఆలోచించండి" అని తర్క బధ్ధమైన సమాధానం చెబుతున్నాడు..

కానీ అక్కడ హర సిద్ధుని వ్యతిరేకులు మాత్రం "అవన్నీ విచారణ సభలో రాజ్య పరివారంలో తేల్చుకుందాం రా దొంగ" అని మరొకసారి బలంగా ఉన్నాడు... పుట్టినప్పటి నుంచి నిజాయితీగా బతికిన హార సిద్ధుని కి.. ఆ మాట కి కోపం తారాస్థాయికి చేరి అతని పళ్ళు కదిలాయి..

హర సిద్ధుని పోరాటపటిమ.. దెబ్బ రుచి తెలిసినవారు.. ఆ రాజుతో తెలివిగా "ప్రభు ఇతను క్రూర మృగం వలె ప్రవర్తిస్తున్నాడు.. మన దగ్గర ఉండే గొలుసులతో బంధించి తమరి రాజ్య సైనికుల పరువు నిలబెడతామని" రాజు గారి మనసుని ఉద్దీపన చేస్తున్నారు.. అంతే రాజుగారు ఇతన్ని  గొలుసుతో కట్టి రాజ్యసభకు తోడు కు రండి  అని హుకుం జారీ చేశాడు..

హార సిద్ధుడు ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా రాజముద్ర పోయిందనే కోపం తప్ప ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నాడు ఆ మహారాజు..

హర సిద్ధుడు ఏ తప్పు చేయకుండా మౌనాన్ని అవమానాన్ని భరిస్తూ ఉన్నాడు..

ఈ మొత్తం సంఘటనలో మహారాణి  తన స్పృహను కోల్పోయి అంతే ఉండిపోయింది..

కొంతమంది రాజ పరివారం వచ్చి మహారాజుని మహారాణిని తరలించారు.. రాజ వైద్యుడు మాత్రం "వాతావరణంలో కొన్ని మార్పుల కారణంగా కొంత స్పృహ కోల్పోయారు ఒక రోజు గడిస్తే అంతా సవ్యంగా ఉంటుంది" అని చెప్పి సెలవిచ్చి హారసిద్ధి వైపు  గా చూడటం మొదలుపెట్టాడు.

హర సిద్ధుని ఖైదు చేసి ఆ ఆలయంలో నుంచి బయటికి తీసుకు వచ్చి, ఖైదీలు తప్పించుకోవడానికి వీలులేకుండా ఉన్న గుర్రబ్బండి లో ఎక్కించారు.

హర సిద్ధుని కి మనసులో.. కొన్ని రోజుల ముందే ఘనస్వాగతంతో, రాచ సత్కారాలతో రాజుగారు ఆహ్వానించారు... ఇప్పుడు అదే రాజు గారి చేయని నేరం నింద మోపి.. ఇలా జీవితంలో తాను ఎన్నడూ చూడని నేరస్తుడి లాగా వెళ్ళ వలసిన పరిస్థితి ఏర్పడింది.. పైకి ధైర్యంగా ఉన్నా హర సిద్ధుడు మాత్రం మనసులో బేలగా "కుంభన్న వచ్చి కాపాడు, నువ్వు వచ్చి నన్ను కాపాడతామని నాకు జరిగిన అవమానం నుంచి బయటకు వస్తానని నాకు నమ్మకం ఉంది" అని మనసులో అనుకున్నాడు...

భక్తులారా! మీకు ఏది జరిగినా కూడా అది మీ కర్మ తీర్చడం కోసమే తప్ప నేను ఏదీ ప్రత్యేకంగా చేయను.. కానీ  మీకు.. గొడ్డలి అంత అయ్యేది గోరంత చేయడం మాత్రమే నా విధి.. కానీ పర్లేదు నిజాయితీగా ఉండండి ప్రకృతి ధర్మాలు అనుసరించండి.. తప్పక మీకు అంతా మంచే జరుగుతుంది.. గుర్తుంచుకోండి మీరు భయపడాల్సింది నాకు కాదు మీరు చేస్తున్న చర్యలకి మీరు మూటగట్టుకున్న కర్మలకి.. కాబట్టి పరోపకారి గా ఉండండి.. పరోపకారం చేయలేని పక్షంలో ఉదారంగా వ్యవహరించండి.. మంచి చేయలేకపోయినా పర్వాలేదు చెడు మాత్రం చేయకండి..

పౌర్ణమి కల్లా తన జీవితం మారుతుంది అనుకున్నాడు.. ఇప్పుడు అమావాస్య వచ్చేలోపు తన జీవితం ఏమవుతుంది తన పరువు ఏమై పోతుంది తాను ఇంతకాలం సంపాదించుకున్న గాంభీర్యము ఏమౌతుంది.. అన్నది ఒక్కటే తనకి ప్రశ్న.. హర సిద్ధునికి ఏమీ తోచలేదు.. తనకు గుర్తుకు వచ్చింది ఇప్పుడు ధర్మయ్య బాబాయ్ మాత్రమే.. ధర్మయ్య బాబాయ్ కి విషయం తెలియజేస్తే రాచ పరివారంతో కలిసి వచ్చి తన గురించి చెప్పి సాయం చేయగలరు.. కానీ ధర్మయ్య బాబాయ్ కి ఇది చేరవేయడం ఎలా.. కనీసం తనతో ఉండే ముసలి తాత కైనా ఈ విషయం తెలియాలి.. కానీ ఎలా తెలిసేది.. ముసలి తాత కి తెలిసిన కుంభ రాజ్యంలోకి ఎలా వెళ్ళగలడు.. వెళ్లినా ఈ ముసలాయన చెప్పే మాటలు వాళ్ళు ఎందుకు నమ్ముతారు..

హరిసిద్ధ ని చెరసాలలో పడేశారు.. తీవ్రంగా  క్రుంగిపోయాడు.. సాక్షాత్తు దేవుడే కనపడ్డ తన జీవితo దుర్భరమని... ఎప్పుడో దురదృష్టం తోనే గడిచిపోవడాన్ని  తలచుకున్నాడు. మిగతా వారందరికీ సాధ్యమైన చిన్న చిన్న పనులు కూడా తనకు ఎంతో కష్టమైన పని.. తప్పులు చేసే వారు అన్యాయం చేసే వారు అందరూ బానే ఉంటారు. ఏ తప్పు చేయకపోయినా ఏ అన్యాయం చేయకపోయినా తన మానాన తాను న్యాయం మాట్లాడితే, ఏమిటి పరిస్థితి కుమిలిపోయాడు.. రేపు ఏం జరగబోతుంది. "కుంభన్న ఎలాగోలా వచ్చి నన్ను బాధ నుంచి కాపాడు" అని కళ్ళవెంట నీళ్లతో వేడుకున్నాడు..

హర సిద్దు ని బాధ.. నాకు కూడా బాధగా అనిపించింది....

తెల్లవారింది మరుసటి రోజు.. గత 24 గంటలుగా ఏమి చేయలేక పోవడం వల్ల.. ఆహారం తీసుకోకుండా ఉండటం వల్ల.. నీరసించి పోయాడు.. ఎందుకంటే అక్కడున్న భటులు అతనికి కావాలని ఆహారం ఇవ్వలేదు.

ఇకపై చూడండి మనుషులు ఎలా ప్రవర్తిస్తారు సమయం వచ్చినప్పుడు అని..

రాజ్యసభలో అడుగుపెట్టిన హరసిద్దుకు... గతంలో రాజ గౌరవం జరిగింది కానీ ఇప్పుడు మాత్రం ఒక ముద్దాయి ఎక్కడ ఉంచాలో అక్కడ నుంచోపెట్టి ఇనుప సంకేళ్ళతో బంధించి గోడలకి కట్టారు.. తాను చేసిన తప్పు.."ధర్మం కోసం న్యాయం కోసం దైవం కోసం నిలబడడమే."

ఇప్పుడు రాజ్యసభ అంతా హర సిద్ధుని వ్యతిరేకులతో.. అతని  చేతిలో బడిత పూజ చేయించుకున్న వారితో హరి సిద్ధుని తో వాదన లో గెలవలేక.. అరచేతుల మీద పగ తో రగిలి పోయే వారు ఉన్నారు.. నిరసన చేత హరసిద్ధుడు ఎవరివైపు సరిగ్గా ప్రత్యక్షంగా గమనించలేక పోతున్నాడు..

మహారాజు అయ్యన్నగారు సభకు విచ్చేశారు విచారణ మొదలు పెట్టడానికి ఆదేశించారు....

తరతరాలుగా మన రాజ్యసంపదగా వస్తున్న రాజముద్రను.. దొంగిలించాడు అనేది ఆపాదించబడింది నేరం.. దానికి మంచితనం ముసుగులో.. రాజభక్తి అన ఒక ముసుగుతో మహారాజు దగ్గర మంచివాడిగా నటించి.. ఆ రాజముద్రిక దొంగిలించి ఈ రాజ్య నాశనానికి శత్రువుతో చేయి కలిపి.. గూడచారి గా వ్యవహరిస్తున్నాడని .. దానికనుగుణంగా. తమకు శత్రు రాజ్యమైన దండక రాజ్యానికి మిత్రుడైన కుంభ రాజ్యానికి.. ఈ మధ్యకాలంలో వెళ్లివచ్చిన విధముగా వేగుల సమాచారము.. రాజ ముద్రిక పోవటం నిజమే.. ఈ రాజ్య చట్టాలతో.. రాజముద్రిక అపహరించిన వారు.. పుర రాజ్య విధులు గుండా కొరడా శిక్ష మరియు..ఉరిశిక్షకు అర్హులు.. అయితే ఉరిశిక్షకు ముందు వారు కోరుకున్న ఒక సమంజసమైన కోరిక  నెరవేర్చ వచ్చు .. వారు కోరుకున్న రోజు వారిని ఒక వారం లోపు గా ఉరి తీయవచ్చు...

ఇప్పుడు మొదలు పెట్టండి మీ వాదోపవాదాలు..

కట్టిపడేసిన వ్యాఘ్రము ముందు.. అదును కోసం ఎదురు చూసే జంబుకాలలాగా ఎంతోమంది హర సిద్ధుని పతనం చేయడానికి సిద్ధంగా చూస్తున్నారు.. మంత్రిగారు మాత్రం ఆ వృద్ధ మంత్రి.. ఇతగాడు ఈ నేరం చేసినట్టు నిరూపణ ఏది.. ఇతను అలాంటివాడు అయ్యి ఉండడు అని మానసికంగా అనుకుంటున్నాడు..

విచారణ మొదలయ్యింది.. అసలు హర సిద్ధుడు ఎలాంటివాడని కనుక్కున్నారు. తీర్పు చెప్పవలసిన రాజుగారు.. హర సిద్ధుని ఉరి తప్పదు తమన అవమానించిన అతని చావు కళ్ళారా చూడాలి అని పగ బట్టి మరీ చూస్తున్నారు. అక్కడ బలంగా వాదన వినిపించే అవకాశం ఉన్న కొన్ని నోళ్ళు.. తెరుచుకుని సిద్ధంగా ఉన్నాయి.

ఎన్నడూ ఎదుర్కొని ఈ స్థితిని హార సిద్ద ఎలా ఎదుర్కొంటాడు..

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages