అదీ సంగతి! - అచ్చంగా తెలుగు

 అదీ సంగతి!

పారనంది శాంతకుమారిఒకే బెర్తుపై ఇద్దరూ సర్ధుకున్నారు,

మరో బెర్తు ఖాళీగానే ఉంది.

ఒకే ప్లేటులో ఇద్దరూ టిఫిన్ తిన్నారు,

మరో ప్లేటు  ఖాళీగానే ఉంది.

మౌనాన్ని ఇద్దరూ పంచుకుంటున్నారు,

మాటలు వెల వెల పోతున్నాయి.

ఒకరి భుజాలపై మరొకరి తలలు,

ఒకరి నడుముపై మరొకరి చేతులు ఉంచు తున్నారు.

ఒకే అరటి పండును ఇద్దరూ సగం సగం చేసుకున్నారు.

మిగిలిన అరటి పళ్ళు ఆశ్యర్య పోతున్నాయి.

ఒకే బోటిల్ లోని కూల్ డ్రింక్ ను ఇద్దరూ 

చెరో గుక్క తాగుతున్నారు,

మరో బోటిల్ ధీనంగా చూస్తోంది.

నాలుగు కళ్ళు ఉండుండి ఒకే చూపులో

కలిసి కరిగి పోతున్నాయి.

ఇద్దరి భావాలూ కలిసి తరుచూ

ఒకటిగా పెనవేసుకు పోతున్నాయి.

ఏమిటిదంతా అనుకుంటున్నారా?

వాళ్ళు కొత్తగా పెళ్లయిన జంటండి!

అదీ సంగతి!

***

No comments:

Post a Comment

Pages