శ్రీధరమాధురి - 94 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి - 94

Share This

శ్రీధరమాధురి - 94 

(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు )


మీరేమి చేసినా మనస్పూర్తిగా చెయ్యండి, అదే ధ్యానంగా మారిపోతుంది.

***

 


ఆశయాలు తీరేందుకు దురాక్రమణ కావాలి. లక్ష్యాలు చేరుకునేందుకు దాడి చెయ్యడం అనే ఇంధనం కావాలి.  దైవానుగ్రహం వలన మేము ప్రశాంతంగా ఉన్నాము, మాకు ఆశయాలు, లక్ష్యాలు లేవు. సాధించాల్సింది ఏమీ లేదు. చాలామంది ప్రశాంతంగా ఎందుకు లేరంటే, వారికి ఆశయాలు, లక్ష్యాలు ఉన్నాయి. దురాక్రమణ, శాంతి వ్యతిరేకాలు. దీనికి తోడుగా, ‘సాధించడం’ అనే పదంతో చాలామంది తిప్పలు పడుతూ ఉండడం నేను చూస్తున్నాను. సాధించడానికి ఎదుర్కునే ఒత్తిడి అందరినీ చంపేస్తోంది. ఏదైనా సాధించడం అంటే, ఎల్లప్పుడూ ఇతరులతో పోల్చుకోవడం, తమ సత్తాను పెంపొందించుకోవడం.

***



నేటి యువత గురించి నేను బాధపడుతున్నాను. ఆమెకు చక్కటి ఉద్యోగం ఉంది. ఆమె ఒకతన్ని ప్రేమించింది, అతను ఈమెను మోసం చేసాడు. ఆమె మరొకరిని పెళ్లి చేసుకుంది. అతని వద్ద ఏమీ దాచకూడదని ఆమె అనుకుంది. పెళ్లి తర్వాత, ఆమె తన గతాన్ని గురించి అతనికి చెప్పింది. తాను మోసపోయానని, అతను ఆమె మీద, ఆమె కుటుంబం మీదా, క్రిమినల్ కేసు పెట్టాడు. ఆమె కుటుంబ సభ్యులూ ఆమెను సమర్ధించే బదులు, నిందించసాగారు. వాస్తవానికి, ఆమె కుటుంబ సభ్యుల్లో ఒకరు, కోర్టు పేరుతో, పోలీసుల పేరుతో ఈమె వద్ద డబ్బులు వసూలుచేస్తున్నాడని, ఇదంతా మోసమని ఆమె తర్వాత గ్రహించింది. అందుకే ఈ రొచ్చు నుంచి బయటపడేందుకు, ఆమె స్వయంగా పోలీసుల వెనుక, అడ్వకేట్ల వెనుక తిరగసాగింది. చివరికి కోర్ట్ ఒప్పుకుంది, ఆమెకు విడాకులు దొరికాయి. ఇప్పుడు ఆమె మాట్రిమోనీ కాలమ్స్ చూస్తూ, భవిష్యత్తులో ఏమి చెయ్యాలో నిర్ణయించుకోలేకపోతోంది. ఖచ్చితంగా ఆమెకు ఇప్పుడు ప్రతి అబ్బాయి, విలన్ లాగా కనిపిస్తాడని నేను అర్ధం చేసుకోగలను. అంతా దైవేచ్చ, దయ. మా ప్రార్ధనలు.

***

 


అతను – ఇతను చాలా తేజస్సు ఉన్నవాడిలా కనిపిస్తున్నాడు.


నేను – అవును, గమనించాను. శబ్దం కన్నా, కాంతి వేగంగా ప్రయాణిస్తుందని అంటారు. అందుకే కొంతమంది మాట్లాడేదాకా, మనకు తేజోవంతులు గానే కనిపిస్తారు.


 ***


అతను – గురూజీ, ఆనందంగా ఎలా ఎలా ఉండాలి?


నేను – చాలా సులభం, కేవలం రెండిటిని ఆచరించాలి.


మొదటిది – గతం యొక్క తప్పుల్ని వదిలెయ్యాలి.


రెండవది – భవిష్యత్తు గురించి బెంగ పడడం మానెయ్యాలి.




***

No comments:

Post a Comment

Pages