జ్యోతిష్య పాఠాలు - 16 - అచ్చంగా తెలుగు

 జ్యోతిష్య పాఠాలు - 16 

PSV రవి కుమార్  యోగాలు

ఇంతవరకు చెప్పుకున్న పాఠాలలో, ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయో చెప్పుకున్నాం. ఇప్పటి నుండి పాఠాలలో, వివిధ రకములమైన యోగాల గురించి చెప్పుకుందాం.


ముందుగా యోగం అంటే ఏమిటో తెలుసుకుందాం. రెండు గ్రహములు ఒకే రాశి లో ఉండుట లేదా ఏవైనా గ్రహములు పరస్పర వీక్షన కలిగి ఊండుట, లేదా కొన్ని గ్రహములు, ప్రత్యేకభావాలలో ఉండుట లేదా స్వక్షేత్రంలో ఉండుట.  ఏఏ గ్రహములు, కలిసి ఉన్న లేదా వీక్షణ కలిగి ఉంటే ఏ యోగాలు కలుగుతాయో తెలుసుకుందాం.


ముందుగా పంచ మహాపురుష యోగాల గురించి తెలుసుకుందాం. హంస యోగం, మాలవ్య యోగం, రుచిక యోగం, భద్ర యోగం మరియు శశ యోగం.


హంస యోగం గురు గ్రహం వలన, మాలవ్య యోగం శుక్ర గ్రహం వలనరుచిక యోగం కుజ గ్రహం వలనభద్ర యోగం బుధ గ్రహం వలనశశ యోగం శని గ్రహం వలన ఏర్పడుతాయి.


హంస యోగం:

గురు గ్రహం స్వక్షేత్రాల లో కానీ ఉచ్చ లో కానీ ఉండి, ఆ జాతకునికి అది కేంద్ర స్థానములు అయితే అనగా 1,4,7,10 లో కనుక గురు గ్రహం ఉంటే, హంస యోగం ఏర్పడుతుంది.


గురు గ్రహానికి ధనస్సు మరియు, మీనం స్వక్షేత్రాలు, కర్కాటకం ఉచ్చ క్షేత్రం. ఏ జాతకునికయినా ఈ క్షేత్రాలలో గురు గ్రహం ఉండి అవి కేంద్ర స్థానాలయితే హంస యోగం ఏర్పడుతుంది.


ఈ యోగం ఏర్పడిన వారు దీర్ఘాయువులు అవుదురు. లగ్నం లో కనుక ఈ యోగం ఏర్పడితే, మంచి శరీర పుష్టి కలిగి ఉందురు. కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు. నాయకత్వ లక్షణాలు కలిగి ఉండును. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండు అవకాశములు కలవు.

 

చతుర్దం లో ఈ యోగం ఉంటే, ధార్మిక చింతన, వేద విద్య, న్యాయ శాస్త్ర విద్య లేదా ఫైనాన్స్ రంగాలకు సంబందించిన విద్య అభ్యసించు అవకాశంకలదు. ప్రజల మన్ననలు పొందును. భూలాభములు, గ్రుహ యోగములు కలుగును, అధిక ధన సంపాదన కలిగి ఉండును.


సప్తమం లో ఈ యోగం ఏర్పడితే, భార్య వలన ధన లాభం. భాగస్వామి తో సత్సంబంధాలు. ఫైనాన్స్ రంగం లో కానీ ఇన్స్యూరెన్స్ రంగం లో కానీ వ్యాపారం చేసి ధన సంపాదన చేయు అవకాశం. 


దశమం లో ఈ యోగం ఏర్పడితే, ఉద్యోగం లో ఉన్నత స్థానం, వ్రుత్తి యందు మరియు సమాజం లో కీర్తి ప్రతిష్టలు సాదించుట.  ఆధ్యాత్మిక ప్రవచనాల ద్వార కూడా ధన సంపాదన చేయు అవకాశం లేదా ఫైనాన్స్ రంగం లో వ్రుత్తి ద్వారా ధన సంపాదన.


మాలవ్య యోగం:

ఈ యోగం శుక్ర గ్రహం వలన ఏర్పడుతుంది. శుక్రుడు స్వక్షేత్రాలలో కానీ, ఉచ్చ స్థానాలలో ఉండి, అవి కేంద్ర స్థానలయితే ఈ యోగం ఏర్పడుతుంది. శుక్ర గ్రహానికి వ్రుషభం, తుల స్వక్షేత్రాలు అవగా, మీన రాశి ఉచ్చ అవుతుంది.


లగ్నం లో ఈ యోగం ఏర్పడితే, అందమయిన శరీరం, అలంకరన పై ప్రత్యేక  శ్రద్ద, స్త్రీలు అయితే, వివిధ  అలంకరణల మీద ఆసక్తి చూపుతారు, పురుషులు అయితే, లేటస్ట్ ట్రండ్స్ ఫాలో అవుతారు ( అనగా శిరోలంకరణ, ఫ్యాషన్ దుస్తులు). స్త్రీలకు, పురుషులు, పురుషులకు, స్త్రీలు స్నేహితులు గా ఉంటారు.


చతుర్దం లో ఈ యోగం ఏర్పడితే, వాహన సౌఖ్యం కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. తల్లి పై అమిత ప్రేమ. డిజైనింగ్ విద్య లేదా సాఫ్ట్ వేర్ విద్య లు అభ్యసించు అవకాశం.


సప్తమం లో ఈ యోగం ఏర్పడితే, అందమయిన భాగస్వామి, వ్యాపారం ద్వార ధన సంపాదన, ట్రాన్స్ పోర్టేషన్ వ్యాపారం, ఇంటిరియర్ వ్యాపారం, బ్యూటీ పార్లర్ వ్యాపారం వంటివి చేయు అవకాశం.


దశమం లో ఈ యోగం ఏర్పడితే, ఉద్యోగం యందు ఉన్నత స్థానం, కీర్తి ప్రతిష్టలు, సాఫ్ట్ వేర్ ఉద్యోగం లేదా ఎలెక్ట్రానిక్స్ సంబందిత ఉద్యోగం, లేదా  డిజైనింగ్ సంబందిత ఉద్యోగం.

 

భద్ర యోగం

ఈ యోగం బుధ గ్రహం వలన ఏర్పడుతుంది. బుధుడు స్వక్షేత్రలలో ఉండి అనగా మిథున రాశి, కన్యా రాశి, లేదా ఉచ్చ లో ఉండి అనగా కన్యా రాశి లో ఉండి అవి కేంద్ర స్థానాలయితే భద్ర యోగం ఏర్పడుతుంది.


లగ్నం లో ఈ యోగం ఏర్పడిన, దీర్గాయువంతులు కాగలరు. వీరికి లెక్కల యందు కానీ, మార్కెటింగ్ యందు కానీ, మంచి పట్టు ఉండును. రీసెర్చ్ పై ఇంటరెస్ట్ ఎక్కువ. వీరు మాటల దార కానీ, వీరి హాస్య చతురత వలన కానీ, అందరిని ఆకర్షింతురు. వ్యాపార మెలుకువలు ఎక్కువ. ఎంబీయే వంటి విద్య అభ్యసించే అవకశాలు కూడా ఎక్కువే.

చతుర్దం లో ఉంటే, ఎంబీయె, లెక్కలు, లేదా ఇంజనీరింగ్ విద్య అభ్యసించును. విద్య లో ముందంజ లో ఉండును. వీరి విద్యభాయసం లో తల్లి పాత్ర ఎక్కువ ఉంటుంది అనగా, తల్లి చదివించుట లేదా తల్లి టీచర్ గా ఉండుత. రచనా సామర్ద్యం కలిగి ఉందురు.


సప్తమం లో ఈ యోగం ఏర్పడితే, అందమయిన, విద్యావంతురాలు, తెలివయిన భార్య లభించును. వ్యాపారం లో రాణించును. భార్య తరపున వ్యాపారం చూసుకునే అవకాశం.


దశమం లో ఈ యోగం ఏర్పడితే, లెక్కల టీచర్ గా కానీ, సాఫ్ట్ వేర్ రంగం లో కానీ, వ్రుత్తి చేపట్టి, ఉన్నత స్థానం కి ఎదుగుతారు. ఈ స్థానం లో యోగం ఏర్పడటంవలన వ్రుత్తి లో కానీ, వ్యాపారం లో కానీ, ఉన్నత స్థానాలకు త్వరగా చేరుకుంటారు.


రుచక యోగం

ఈ యోగం కుజ గ్రహం వలన ఏర్పడుతుంది. కుజుడు స్వక్షేత్రలలో కానీ అనగా మేష రాశి, వ్రుశ్చిక రాశి, ఉచ్చ స్థానం అనగా మకర రాశి లో కానీ ఉండి, కేంద్ర స్థానలయితే ఈ యోగం ఏర్పడుతుంది. ఈ యోగ జాతకులు సాధారణం గా , దేహ ధారుడ్యం కలొగి ఉందురు. సాహస క్రుత్యాలు అనగా ఇష్టపడతారు. నోటి దురుసు ఉంటుంది.


లగ్నం లో ఈ యోగం ఏర్పడితే, కోపిష్టి, క్రీడలపై మక్కువ ఎక్కువ, కరాటే, గుర్రపు స్వారీ, కుస్తీ, ఇటువంటి విద్య ల పై ఆసక్తి అందులో రాణింపు. దేహ దారుఢ్యం కోసం జిం కి వెళ్ళతారు, వ్యాయమ శాల పెట్టూ అవకాశం కలదు.

చతుర్దం లో ఈ యోగం ఏర్పడితే, ఇంజనీరింగ్ విద్య పై అభిలాష అనగా, ఎలెక్ట్రికల్, సివిల్, మెకానికల్ ఇటువంటి రంగాలలో ఇంజనీరింగ్ విద్య నభ్యసించు అవకాశం కలదు. వైద్య రంగం పై కూడా కోరిక ఉండును కానీ, వేరే గ్రహాల కలయిక చూసి కానీ నిర్ణయించరాదు. తల్లి తో తరచూ వాదనలు చేయు అవకాశం. భూలాభాలు కలుగును.


సప్తమం లో ఈ యోగం ఏర్పడిన, వివాహం కాస్త ఆలస్యం అవు అవకాశం ఎక్కువ. అందమైన జీవిత భాగస్వామి వచ్చు అవకాశం. రియల్ ఎస్టేట్ లేదా వాహనాల సంబందిత వ్యాపారం చేయు అవకాశం కలదు.


దశమం లో ఈ యోగం ఏర్పడితే, ఆర్మీ ఆఫీసర్, పోలీస్ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగం. ఇంజనీరింగ్ లేదా సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్నత స్థాయి ఉద్యోగం. ఎలెక్ట్రానిక్స్ రంగం లో వ్యాపారం. రియల్ ఎస్టేట్ వ్యాపారం.


శశ యోగం

ఈ యోగం శని వలన ఏర్పడుతుంది. శని స్వక్షేత్రాలలో ఉండి అనగా మకర, కుంభ రాశి లో ఉండి లేదా  ఉచ్చ లో ఉండి అనగా తులా రాశి లో ఉండి అవి కేంద్ర స్థానలయితే ఈ యోగం ఏర్పడును.ఈ యోగం ఉన్న వారు, 36 - 38 ఏల్ల దాటిన తరువాత జీవితం లో స్థిర పడును.


లగ్నం లో ఈ యోగం ఏర్పడితే, దీర్గాయువు ఉండును. కాస్త నెమ్మది స్వభావం అనగా బద్దకం గా ఉండు అవకాశం కలదు.  నాయకత్వ లక్షణాలు కలిగి ఉండును. కార్మిక నాయకుడి గా లేదా రాజకీయాలలో ఒక నాయకుడి గా ఉండును.


చతుర్దం లో ఈ యోగం ఏర్పడితే, తల్లి కి మంచి ఆరోగ్యం. కష్టపడి జీవితం లో ఎదుగుట. స్కూల్, కళాశాల విద్యలలో అంతరాయాలు కలుగుట లేదా ఉన్న ఊరి నుండి దూరం గా ఉండి చదువుట. కెమిస్ట్రీ, పెట్రోలియం, ఫోరెన్సిక్ వంటి విద్య అభ్యసించు అవకాశం.


సప్తమం లో ఈ యోగం ఏర్పడితే, శని సంబందిత వ్యాపారం చేపట్టూ అవకాశం అనగా, పెట్రోల్ బంకుల వ్యాపారం, ఇనుము , సిమెట్ వ్యాపారం చేయు అవకాశం.  కులాంతర వివాహానికి అవకాశం. భార్య తరపున ఆస్తి లాభం, లేదా మామ గారి వ్యాపారం చూసుకోవటం జరుగును.


దశమం లో ఈ యోగం ఏర్పడితే, వ్రుత్తి వ్యపారాలలో ఆకస్మిక లాభాలు, ఒకోసారి అనుకోకుండా నష్టాలు రావచ్చు. నూనె, పెట్రోల్, గ్యాస్, ఇనుము ఇటువంటి రంగాలలో వ్రుత్తి వ్యాపారం చేయు అవకాశం. వీరికి ఉద్యోగం కంటే, వ్యాపారం రాణించును. వ్రుత్తి లో ఎదగాలి అంటే, అధిక శ్రమ అవసరం. 

 

 

No comments:

Post a Comment

Pages