శ్రీథరమాధురి - 93 - అచ్చంగా తెలుగు

శ్రీథరమాధురి - 93

Share This

శ్రీథరమాధురి - 93 

(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు) 


శిష్యుడు: మీ దాసుడిని గురూజీ మీకు నమస్కారాలు. మీరు అనుమతిస్తే దయుంచి ఒక విషయాన్ని వివరించండి. అనుష్టుప్  మూల మంత్రాన్ని లేక ఏ ఇతర మంత్రాన్నైనా విశ్వాసంతో గురూపదేశం లేకుండా పఠిస్తే, అదే అనుగ్రహం మంత్ర ఫలం దక్కుతుందా? కొన్నిసార్లు మనం శ్రద్ధ లేకుండా మంత్రాన్ని చదివినప్పుడు ఏదైనా పాపం తగులుతుందా?

గురూజీ: 'కృష్ణం వందే జగద్గురం'...

ఆరోజుల్లో శిష్యులు గురువుతో పాటు గురుకులాల్లో ఉండేవారు. శిష్యుడికి అర్హత ఉందని గురువు భావించినప్పుడు, ఆయన ఒక మంత్రాన్ని ఉపదేశించేవారు. ఆ మంత్రంతో పాటు కొన్ని పాటించవలసిన నియమాలు, నిషేదించ వలసిన అంశాలను కూడా తెలిపేవారు.

ఈనాడు కొన్ని ప్రాంతాల్లో తప్పితే ఈ వ్యవస్థ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈనాడు గురుకులం అనేది ఎక్కువగా ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో మాత్రమే ఉంది. ఈనాడు మన అత్యంత దయామయుడైన గురువును పొందడం చాలా కష్టంగా ఉంది. మీరు ఒకవేళ అటువంటి వారిని కనుగొన్నా, ఆ గురువు చాలావరకు తన పనులతో వ్యస్తంగా ఉంటారు, ఆయన వద్ద సమయం ఉండదు. అందుకే ఈ రోజుల్లో అనుబంధం ఎక్కువగా హృదయం నుంచి అని నా భావన. ఇదొక ఆత్మబంధం.

మారిన పరిస్థితుల రీత్యా, ఎవరైనా మనందరికీ జగద్గురువైన కృష్ణ భగవానుడిని హృదయంలో నిలుపుకొని, మంత్ర జపాన్ని మొదలుపెట్టాలి.

ఇందులో ఒక చిక్కుంది. చదివే మంత్రాన్ని చదవాల్సిన విధంగా చదువుతున్నామా లేదా అన్నది మనకు తెలియదు. మన బుద్ధిలో చెడు వల్ల మనకు ఏ సందేహం కలగనంతకాలం, మంత్రాన్ని జపించవచ్చు. ఒకసారి మీకు ఒక సందేహం వచ్చిందంటే దాన్ని తీర్చుకోవడానికి ఒక గురువును సంప్రదించడం మంచిది.

మీరు ఒక్కసారి గురువు వద్దకు వెళితే ఆయన కొన్ని నియమాలను చెబుతారు. మీరా నియమాలను పూర్తి చేస్తే తప్ప, ఆయన మీకు దారి చూపించేందుకు ముందుకురారు.

మీరు కర్త కాదు, దైవమే కర్త. ఒకవేళ మీ విశ్వాసం బేషరతైనది అయితే, నిర్దోషమైనది అయితే పఠించడంలో ఎటువంటి పొరపాటు జరిగినా దాన్ని తోసిపుచ్చవచ్చు. మీరే కర్తని మీరు భావించినప్పుడు, ఏ మంత్రాన్ని తప్పుగా చదివినా కొన్ని పరిణామాలు కలగవచ్చు.

అహోబిలానికి రండి. యజ్ఞసమయంలో మేము చేసే దైవ ప్రార్థనలతో మాతో జత కూడండి. మీ లోపాలన్నీ తీసివేయబడతాయి. దైవేచ్ఛ దయతో మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ఇదే 'ప్రయోగం' యొక్క అద్భుతం.

***


No comments:

Post a Comment

Pages