'సర్వతమోపహం!' - అచ్చంగా తెలుగు

 'సర్వతమోపహం!'

-సుజాత.పి.వి.ఎల్
సైనిక్ పురి, సికిందరాబాద్.


సంస్కృతి సంప్రదాయ నీరాజనం..
శారీరక, మానసిక 
వికాస సంకేతం..
తమోగుణ తిమిర సంహారం..
ప్రమిద భూతత్త్వం..
తైలం జల తత్త్వం..
వత్తి ఆకాశ తత్త్వం..
కాంతి వాయుతత్త్వం..
జ్యోతి అగ్నితత్త్వం..
పంచ భూతాత్మక దర్శనం..
జ్ఞానప్రకాశ నిదర్శనం..
పరబ్రహ్మ స్వరూపం..
సర్వతమోపహం 'దీపం!'.
***

No comments:

Post a Comment

Pages