స్త్రీ అంటే... - అచ్చంగా తెలుగు

 స్త్రీ అంటే...

భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు 




జనని అంటే జీవం

స్త్రీ అంటే సిరి

వనిత అంటే వరం

మగువ అంటే ముదం

తరుణి అంటే తన్మయం

అంగన అంటే ఐశ్వర్యం

అతివ అంటే అదృష్టం

అలివేణి అంటే పూబోణి

నాతి అంటే నియతి

లేమ అంటే లామి(దీప్యమానము)

వధువు అంటే మృదువు

వనిత అంటే విశేషం

ఇంతి అంటే శాంతి

కన్య అంటే కాంతి

భార్య అంటే బ్రాతి(ప్రేమ),

ఆడది అంటే ఆరతి

కళత్రం అంటే కళ

తన్వి అంటే తలపు

కొమ్మ అంటే కొలుపు

మగువ అంటే మలుపు

సుధతి అంటే సుధ

పడతి అంటే పీయుష(అమృతము)

ఆలి అంటే జాలి

భామ అంటే ప్రేమ

బ్రహ్మి అంటే బలం

భార్య అంటే బాధ్యత

లతాంగి అంటే లయ

కోమ అంటే కౌముది

***

 

No comments:

Post a Comment

Pages