శివం - 80 - అచ్చంగా తెలుగు

 శివం - 80

రాజ కార్తీక్ 

 



(హర సిద్ధుడు గౌరవ మర్యాదలతో రాజు పిలుపు మీద. అంతఃపురం వైపు ప్రయాణిస్తున్నాడు..)

హర సిద్ధుడు రథం ఎక్కి యుద్దానికి బయలుదేరిన అర్జునుడు లాగా, వెళ్తున్నాడు. రాజు అన్నగారు ఏదో ఒక గొప్ప బాధ్యత అప్పచెప్పు పోతున్నారని ఏదో ఒక గొప్ప ఘనకార్యం చేయబోతున్నాడని మాత్రం తన మనసు తనకు గట్టిగా చెబుతోంది.. ఎందుకంటే తాను ఇదివరకు శిథిలమైన దేవాలయాన్ని బాగు చేయడం చూసిన తర్వాత ఆ రాజు గారి మనసులో ఆనందం మొహంలో ప్రస్పుటంగా కనబడింది...

రథం ఒకచోట ఆప మన్నాడు హార సిద్దు, హర సిద్ధుడు తన తాత ఇంటి ముందు ఆగాడు.. కథ మొదట్లో.. అనుకున్నాం కదా హర సిద్దు తో పాటు ఒక ముసలి తాత.. ఉంటాడు తాత తో వాదన చేసేటప్పుడే కుంభన్నా రూపంలో నేను వెళ్లాను.

హర సిద్ధుని చూసి తాత లేవలేక లేచి.."చాలా కాలం వేరే చోటికి వెళ్ళావు నాయనా వెళ్లిన చోట పని చక్కబెట్టుకు వచ్చావా, కుంభన్న బాగున్నాడా!, ఆ కుటుంబం వచ్చిన దగ్గర్నుంచి నీలో మార్పు గమనించాను నాయనా.. క్షేమంగా వెళ్లావు లాభం గా కూడా వచ్చావా అని" ఆప్యాయంగా అడిగాడు..

హర సిద్దు "తాత ఆ  కుంభన్న ఎవరో కాదు సాక్షాత్తు శివుడే తాత" అని కళ్ళవెంట నీళ్లతో.. తన్మయత్వంతో అన్నాడు..

తాత ఉలిక్కిపడి లేచాడు.."ఏంటి హార సిద్దు నువ్వు అనేది ఆయన శివుడా అని," చేతులెత్తి నమస్కారం పెట్టాడు..

ఇక హర సిద్ధుడు కుంభన్న ను  విడిచి వెళ్లడం ఆ ఊరి వైపు వెళ్లడం, అక్కడ గుడిలో కథ, అక్కడ తాను చేసిన పోరాటం రాజు గారు ఇచ్చిన బహుమానం తన తల్లికి ఇచ్చిన వైనం, దారిలో మరొక గుడి బాగు చేయడం ఇప్పుడు ఈ దేశపు రాజుగారు రమ్మంటము, మొత్తం కథ చెప్పాడు.

తాత "తన్మయత్వంతో "నేను ఎంత పుణ్యాత్ముడిని? నాయనా కేవలం నీతో స్నేహం చేశాను అన్న ఒకే కారణం చేత కుంభన్నని నాకు చూపించవా? తెలియక ఏమి నా దురదృష్టం ,తెలిసి ఏమి నా అదృష్టం.. ఆయనే శివుడు అని తెలిసి ఉంటే ఆయన్ని పట్టుకొని. వదిలే వాణ్ని కాదు.. నువ్వు ఎంత గొప్ప వాడివి హార సిద్దా.. సాక్షాత్తు శివుడినే  తీసుకొచ్చావు.. నువ్వు సామాన్యుడు కాదు నాయనా.. అంటూ హర సిద్ధు ని చేతిలో పట్టుకొని ని నమస్కారం పెట్టుకున్నట్లు కూలబడ్డాడు..

హర సిద్దు "తాత నాదేముంది తాత.. మంచి వాడి మనసు దేవుడు తప్పక గ్రహిస్తాడనీ, నువ్వు చెప్పావు అదే జరిగింది, మళ్లీ కుంభన్నను చూడాలని, మళ్లీ ఆయన నాకోసం రావాలని మనసు తతహతహలాడుతుంది".

తాత "వస్తాడు ఆయన తప్పక వస్తాడు నీకోసం ఇక నీకు తిరుగులేదు.."అని భక్తి  పారవశ్యంతో చెప్పాడు.

రాజభటులు వచ్చి కాస్త రాజ దర్పం ప్రవర్తిస్తూ.."ఆర్య, రాజుగారు  రమ్మని చెప్పు" అని మీ కోసం రథం పంపించారు కానీ మీరు మధ్యలో ఇలా అడగటం సబబు కాదు అన్నట్లు"చిన్నపాటి అజ్ఞ వేశారు..

హర సిద్దు "క్షమించు సోదరా చాలా రోజుల తర్వాత మా తాతగారిని చూడటం వల్ల కొన్ని విషయాలు మాట్లాడు కోవాల్సి వచ్చింది. సమయాన్ని మర్చిపోయాను, నాదే తప్పు. ఆలస్యానికి నేను మన్నించ వలసినది గా రాజుగారిని కోరుకుంటాను. ఇక పదండి బయల్దేరుదాం "అని అన్నాడు.

తాత "పోయిరా సిద్ధ.. కచ్చితంగా ఆ పని కూడా చక్కబెట్టుకుని ఈ రాజ్యం లో కూడా గొప్ప పేరు తెచ్చుకొని అప్పుడు నా దగ్గరికి రా. నా స్నేహితుడు నా మనవడు ఎంతో గొప్ప వాడిని అందరికీ చెప్పు కుంటాను." అంటూ హర సిద్దు జబ్బ తట్టాడు"

రథం బయలుదేరింది.

అందులో కొంతమంది రాజభటులకి సిద్ధుడు అంటే కోపం ,ఆ కోపం ఇక తీర్చుకునే అవకాశం ఉండదు ఎందుకంటే అతను రాజు గారి యొక్క ఆదరణ పొందాడు కాబట్టి..

హర సిద్ధుడు "తాను కుంభన్న గుడిలో జరిగింది ఏది తన తల్లికి గానీ తన ఊరిలో ఎవరికీ చెప్పలేదు.. పౌర్ణమి తర్వాత ఆ రాజ్యంలో  రాజు గారు ఏదో గొప్ప పదవిలో పోతున్నారని" మాత్రం తాను కనిపెట్టాడు.. తన విచక్షణతో ధర్మయ్య బాబాయ్ లాలింపు తో.. ఏదిఏమైనా పౌర్ణమి లోపు మీ ఊరి రాజు గారు అప్పచెప్పే కార్యాలు నెరవేర్చ వలసిందిగా కంకణం కట్టుకున్నాడు.. హర సిద్ధుడు హనుమంతుని వలె ఎంతో వేగంగా పని చేస్తాడు పని చేయిస్తాడు.. సరైన పని దొరకకే మిగిలి ఉంది, తాను ఎంత సమర్ధుడు అనేది  కుంభ స్వామి గుడి దగ్గర చూశాం కదా..

తన ఘనత తెలిసిన వారు.. తను ఏమి చేశాడో కళ్ళతో చూసిన వారు ఎవరు ఈ రాజ్యం లో లేరు.. అందుకనే హార సిద్దు పట్టుదలగా.. ఇక్కడ కూడా పనులు చక్క బెట్టుకు ని.. మంచి పేరు తెచ్చుకుందామని నిర్ణయించుకున్నాడు.

అంతపురం లోకి రాజదర్బార్ లోకి ప్రవేశించాడు హరసిద్దుడు.

హర సిద్దు "నమస్కారం మహారాజా ఆలస్యమైతే క్షమించండి"అని వినయంగా చెప్పాడు.

అయ్యన్న "ఆలస్యం ఏమిలేదు హర సిద్దా ! మీ కోసమే ఎదురు చూస్తున్నాము.. ధ్యానంలో సమాధి వలె.. కళాకారుల మనసు కూడా అప్పుడప్పుడు సమాధిలోకి వెళ్తూ ఉంటుంది.. అదే భావ సమాధి.. ఆ భావం లో నుంచి రస స్పందన పడుతుంది. అప్పుడు నాట్య కార్లు నాట్య భంగిమను. శిల్పులు కొత్త విగ్రహములను.. రచయితలు కొత్త రచనలను, కవులు కొత్త కవితలను.. సృష్టిస్తారు.. అది సాక్షాత్తు ఆ పరమేశ్వరుని పూజ గా భావిస్తాము మేము..

హర సిద్దు "భలేగా చెప్పారు మహారాజా, నేను ఎన్నో సంవత్సరాలుగా నా స్థితి చెప్పటం చేతకాక ఎలా చెప్పాలో అర్థం కాక చూస్తూ ఉండేవాడిని, కానీ  ఈ రోజు మీరు చెప్పిన.. ఈ గొప్ప అలంకారాన్ని ఎన్నో గొప్ప అర్థాలు వెతుక్కుంటూ ఉండేవాళ్ళకి సరిసమానంగా.. ప్రస్ఫుటం అయ్యే విధంగా చెప్పారు శభాష్."

మహారాజులు శభాష్ అనడం తో .. సభికులలో అందరూ ఆశ్చర్యపోయారు..

"చనువిస్తే చంక ఎక్కాలి విడు తల ఎక్కే విధంగా ఉన్నాడు"అని అనుకుంటున్నారు..

మహారాజు గారు మీరు నన్ను ఎందుకు పిలిచారు.. నేను తమ కోసం ఏం చేయాలి.. అని వినయంగా అడిగాడు హర సిద్దు..

మహారాజు "హర సిద్ధ, నేను ఆ శివాలయాన్ని.. బాగు చేద్దామని అటువైపుగా వెళ్తుంటే అనుకున్నాను చాలాసార్లు.. కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది.. అటు ఇటు వచ్చేసరికి.. కొన్ని గంటల వ్యవధిలో, ఆ దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు జీవకళ ఉట్టిపడే  విధంగా చేశావు, ఎప్పటి నుంచో నా మనసులో మెదులుతున్న ఒక విషయానికి సరైన రూపకర్త నీవే నని భావించి నిన్ను ఉన్నపళంగా పంపించాను. అది నేను కచ్చితంగా చేయగలనని విశ్వసిస్తున్నాను."

హర సిద్దు "తప్పక చేస్తాను మహారాజా! నాకు చేత అయితే  దానికన్నా ఇంకా ఎక్కువగా చేస్తాను, మన రాజ్యానికి నేను ఏ రకంగా సేవ చేయగలను దయచేసి నాకు సెలవు ఇవ్వండి.. ఈ పౌర్ణమి లోపు పూర్తి చేస్తాను "అని ధీమాగా సమాధానం చెప్పాడు.

అయ్యన్న "సంతోషం హార సిద్దా ! నీవు ఈ రాజ్యము మహాదేవుడికి అంకితమైన విధంగా. మా ముత్తాతల నుంచి వచ్చే ఈ కోరిక మేర.. మా తరతరాలు పునీతం అయ్యే విధముగా.. ఈ రాజ్య చిహ్నాన్ని ఆ మందిరం చుట్టుపక్కల చెక్కుతూ.. గర్భగుడిలో కూడా చెక్కుతూ.. లక్ష సంవత్సరాల తర్వాత అయినా సరే కనపడే విధంగా. శాసనాలు వేసి.. మనుష్య జాతి ఉన్నంత కాలము.. ఆ దేవాలయము నిలిచిపోయే విధంగా.. ఒక దేవాలయాన్ని నిర్మించాలి, ఇదే మీ ముందు మేము పెట్టిన ప్రతిపాదన"

హార సిద్దు "ఒక శిల్పికి ఈ పని కాక మరొక పని ఏమి చెబుతారు అని ఆలోచించే దీనికి వచ్చేటప్పుడే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాను మహారాజా."

అయ్యన్న "ఏమిటి మీ ప్రణాళిక.."

సిద్ధు"మహారాజా నూతన ఆలయం కట్టడం కన్నా కూడా ఉన్న ఆలయాన్ని తిరిగి బాగు చేయడం అనేది చాలా గొప్ప విషయం.. సుదీర్ఘమైన దేవాలయాలు ఏమీ లేని తర్వాత మాత్రమే కొత్త దేవాలయాలు కట్టవలసిందిగా నాయొక్క ప్రతిపాదన మీరు దేవాలయమే కట్టబెట్టారని నేను వచ్చాను కావున మన ఊరి చివర్లో ఉన్న ఒక పాత కోట లాంటి ప్రకారం మన దగ్గర ఉన్నద మీరు గమనించగలగారా"

మహారాజు "ఉన్నది దాన్ని సుందరీ కరిస్తే ఒక గొప్ప వంతు అవుతుంది"

హర సిద్దు "ఆ సుందరీకరణ నేను చేసి మీరు కోరిన విధంగా అది భవంతి కాదు, అది మరొక గొప్ప ఆలయమని.. మీరు కోరిన విధంగా మీ వంశస్థులకె  అంకితం అన విధంగా దాన్ని పౌర్ణమికి ఏర్పాటు చేస్తాను. వందిమాగధులను మందీ మార్బలం ని నాకు అప్ప చెప్పండి"అని ధీమాగా చెప్పాడు.

అయ్యన్న కూడా.. ఖజానా మీద భారం పడకుండా, హర సిద్దు చెప్పిన ఆలోచనకి ఎంతో మెచ్చుకున్నాడు.

అయ్యన్న ఆలోచనల్లో ఉండగానే "రాజ చిహ్నం ను దేవాలయంలో ఎటువైపు చూసినా వచ్చే విధంగా ప్రతి గోడకి అమర్చి చెక్కు తాను."

హరసిద్దు శ్రద్ధ, విశ్వాసం చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు మహారాజుతో  సహా..

భక్తులారా మీరు కూడా ఎప్పుడు ఆత్మవిశ్వాసం గా ఉండి, మీ ప్రయత్నం మీరు చేసి, భారం నా పైన వేయండి..

హర సిద్ధుడు ఎదుర్కోబోయే మరొక పరీక్ష ఏమిటో చూద్దాం.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages