పండగ వచ్చింది - అచ్చంగా తెలుగు

                                     పండగ వచ్చింది                                                                 

సత్యవతి పొదిల 


"అన్నా!ఐదు వందలు చిల్లర ఉంటే ఇవ్వు. మంచి బేరం వచ్చింది.చిల్లర లేకపోతే  కొనరు బోణీగదా ఏం చేద్దాం ."


  "ఇంద ఏంటి ఈయాళా మీ ఆయన రాలేదా బజారుకి?     ఒంట్లో సులువుగా లేదన్నా అందుకని రాలేదు.  నేనే తిప్పలుబడాల.   అప్పలస్వామికి లక్ష్మికిపదేళ్ల రంగడు నాలుగేళ్ళ కాసులువాళ్ళ సంసారం.ఎప్పుడో అప్పలస్వామి నాన ఇశాఖపట్నం నుంచొచ్చి ఈటౌనులో స్తిరపడ్డారు. 


 లక్ష్మీ సంసారం  గుట్టుగ గుత్తంగా చేసుకుంటుంది. అప్పలసామి బాగా కష్టపడి మూటలు మోసేవాడు. తనేమో చేలల్లో కలుపులు కోతల కెళ్ళేదిలక్ష్మి.కాలఒడ్డన రెండు రేకులేసుకుని కాలం గడుపుతున్నారు.


ఈమధ్య అప్పడికి జొరం,నీరసం పట్టుకుంది. "ఏంజబ్బు ఆకలిజబ్బు అంటది లక్ష్మి "."పోవే నీమాటలు నూవ్వూ మనకేటె రెండుపూట్లా జరుగుతుందిగదా బిడ్డలగురించే గదా అంటాడు" అప్పడు బరువు పనులు చెయ్యలేక ఓరిక్షా కొని ఏసేవాడు  ఇలా గాదులెమ్మని ఆరిక్షానే నాలుగురోడ్ల సర్వీసు రోడ్డులో ఓవారన పెట్టుకొని గొడుగు కింద కూర్చుంటుంది లక్ష్మీ.


ఆ రోడ్ల లోపెద్దపెద్ద ఆఫీసులున్నయి. తరచుగ రోడ్డు మూస్తారు. ఇంటరవ్యూలని, పరీక్షలని జరుగుతుంటయి. గబగబ ఓబెంచి రెండు స్టూళ్ళు లాగి బేరం మొదలెడతారు,పిల్లలూ సాయంపడతారు.ఏవో సీసాల్లో బిస్కట్లు ,బీడీసిగిరెట్లు, టీ చేసుకొచ్చి ఫ్లాస్కలో వుంచుతుంది.కార్లల్లో వచ్చినాళ్ళు బాటసారులు పనిపాట్లు చేసుకొనేవారు అంతా జెరతారు.బేరంబానే సాగుద్ది.


    ప్రక్కపక్కల చిన్నచితక యాపారాలు అంతా ఓబెంచీ ఓ స్టూలు ఓగొడుగు పెట్టుకొని కూరగాయలు, పండ్లు, పూలమ్ముకుంటారు. అంతా కలివిడిగా ఏడైన ఎచ్చైన కాసుకుంటారు.కష్టం సుఖంలో ఆదుకుంటారు.


సూర్యుడిది కొబ్బరికాయల కొట్టు, బోండాలు బానే సేలవుతయి. అపార్టమెంటుల్లో జనం సీసాలతో కొబ్బరినీళ్ళు పట్టుకెళ్తారు. అనుసూయ వంటలకెళ్తది. ఇద్దరు ఆడబిడ్డలు. బడికెళ్తారు. రెండు గదులు డాబాఇల్లుంది. బాగానే జరుగుతుంది.  


   అప్పడు  ఏదో చిన్నచితక పనులకెళ్తాడు.కష్టం చేసి డబ్బు సంపాదించాలనుకుంటాడు  కానీ ఇప్పుడు అంతగ చేయలేక పోతున్నాడు.


       "ఇట్టాగాదులే గాని చవకలో కొట్టుగది ఇప్పిస్తా అద్దెకి వ్యాపారం పెట్టుకొండీ అమ్మాయి"సూరీడు.


      "ఉట్టి కెక్క లేనమ్మ సొరగాని కెక్కిందని మనకేడ కుదరుద్దిలే అన్నా"లక్ష్మి.


      బిడ్డల గురించి ఆలోచించాలి గదా అని అప్పడే ధైర్యంజేసి రిక్షా అమ్మేసి లక్ష్శికి అమ్మగారుబెట్టిన గొలుసు అమ్మేసి మొదలెట్టాడు.


     కొన్నాళ్ళు పాలపేకెట్లెయ్యడం,  అన్నిరకాల ఉప్పుపప్పులు కొద్ది కొద్దిగా తెచ్చుకొని మొదలెట్టారు.పిండిరుబ్బేమిషను అట్టట్టా ఒక్కొక్కటి పెట్టారు.


ఓపాతరిక్షా సరుకులు తెచ్చుకొడానికి  కొని ఓకుర్రాణ్ణి పెట్టుకున్నాడు.  కూరగాయల పళ్ళుగూడ పెట్టారు.


     పిల్లల్ని పరీక్ష రాయించి ఉచిత భోజన వసతున్న బడిలో చెర్చారు.


చిన్న పాతిల్లు అమ్మకానికి చౌకలో వచ్చింది కొని బాగుజేసుకున్నారు అందులోజేరారు,ఇంకజూడు వ్యాపారం తారాజువ్వలా ఎగిసింది. నీళ్ళడబ్బాలెయ్యడానికని ఓపాత ఆటోతీసుకొని కుర్రాణ్ణి పెట్టాడు.


   సంక్రాంతి నెలబట్టారు. వదినమ్మని తీసుకొని గుడికెళ్ళివచ్చిందిలక్ష్మి. పిల్లలకి సెలవులు. కళ్ళాపులు ముగ్గులు గొబ్బెమ్మలు  వీధులంతా కళకళ లాడిపోతున్నయి. ముగ్గులపోటీలు,గంగిరెద్దుల మేళాలు, ఊరంతా మోగిపోతున్నయి. చక్కభజనల్లో జేరారు అప్పడు సూరీడు ఇకజూడు ఆటలు పాటలు అంతటా వెల్లివిరిసింది.


     "రార వేణుగోపాబాల రాజితసద్గుణ జయశీల"ఎటుబోయిన మోగిపోతున్నయి.


          రానేవచ్చింది సంక్రాంతి.భోగినాడంతా నలుగుబెట్టుకొని స్నానాలు జేసారు. చేదుతిన్నారు, భోగిమంటలేసుకున్నారు. సాయంత్రం పేరంటం కాసులుకి,సూరీడు పిల్లలకి భోగిపళ్ళు పొయ్యండం.ఆయమ్మ ఈయమ్మ అంతాజేరారు.లక్షీ అమ్మోరిలా కళకళలాడి పోతున్నావే నగనట్రా వేసుకొని అనిమేచ్చుకున్నారు.


   మనదేముంది అంతాసామి దయ.సూరీడన్న ఎంతో సాయంజేశాడు అని చెప్పుకుంది. కోడిపందాలు చూస్తూ పిల్లలుగోలగోలగా ఆటలు.


      అరిసెలు,కారప్పూస,బెల్లంలడ్లు అంతా కలిసి చేసుకుంటారు ఇరుగుపొరుగు.


   పండగనాడు పాయసం,పులారం,గారెలు, పూర్ణాలు అన్ని రెడీ.పూజజేసుకొని దేవుడికి నైవేద్యం ,పెద్దలకి బట్టలుపెట్టుకొని మొక్కుకున్నారు.


   లక్ష్మీ సూరీణ్ణి వదినమ్మని,పిల్లలని భోజనానికి పిల్చింది.వాళ్ళందరికి అన్నినవకాయవంటలతో భోజనంపెట్టి కొత్తబట్టలుపెట్టి కాళ్ళకి మొక్కినప్పుడు వాళ్ళకి కళ్ళుతడిఅయినయి.


 "  అన్నావదినమ్మ మీవల్ల ఒడ్డునబడి మేమింతవాళ్ళమయ్యాం "


   " అదేంటిరా సెల్లెమ్మా మనం మనం ఏదో ఉడతాసాయం అంతేగదా"


  అక్కడున్న చెరువులో తెప్పతిరణాల వేణుగోపాలస్వామిని, పార్వతీ పరమేశ్వరుల్ని మేళతాళాలతో తెప్పమీద ఊరేగిస్తున్నారు. బయట సూరీడువాళ్ళ చక్కభజనలు, ఆడవారి కోలాటాలు అబ్బో ఆనందమంతా అక్కడేవుంది.


   సాయంత్రం పిల్లలు డాబామీద గాలిపటాలు ఎగరేస్తు ఆడు కుంటున్నారు.అంతటా ఆనందం. పెద్దలు పైకెళ్ళారు అస్తమాన సూర్యుణ్ణిచూస్తూ లక్ష్శి "వదినమ్మ నాకో వరంఇవ్వాల ఏట్రా అంటే మా రంగడికి మీసాయిత్రి నిస్తానని మాటివ్వు."


 "అలాగేలేరా వాళ్ళిష్టపడితే".సూరీడు.దూరంగా వేణుగోపాలుని గుడిగంటలు మోగుతున్నయి. శుభంఅంటూ.

***

No comments:

Post a Comment

Pages