దళిత బహుజన భూమిపుత్రిక ఝల్కారీబాయి - అచ్చంగా తెలుగు

దళిత బహుజన భూమిపుత్రిక ఝల్కారీబాయి

Share This

 దళిత బహుజన భూమిపుత్రిక ఝల్కారీబాయి

అంబడిపూడి శ్యామసుందర రావు 
చరిత్రలో బ్రిటిష్ వారితో స్వాతంత్త్వము కోసము పోరాడిన వీరంగనలు ఎంతమందో ఉన్నారు కానీ దురదృష్టవశాత్తు చాలా మంది చరిత్రపుటల్లో కలిసిపోయారు కొద్దిమందికే గుర్తింపు వచ్చింది ఝాన్సీ లక్ష్మి బాయి పేరు వినని భారతీయులు ఉండరు ప్రధమ స్వాతంత్ర సంగ్రామముగా పేరు గాంచిన 1857 సిపాయిల తిరుగు బాటు సందర్భముగా జరిగిన ఝాన్సీ యుద్ధము ఝాన్సీ లక్ష్మి బాయికి మంచి పేరు ప్తఖ్యాతులు తెచ్చిపెట్టింది. కానీ ఆ యుద్దములో ఝాన్సీ లక్ష్మి భాయి కి కుడిభుజముగా, లక్ష్మీభాయికి ప్రతిరూపముగా కీలక పోషించిన ఝల్కారి భాయి పేరును చాలా మంది మరచిపోయినారు మన చరిత్ర పాఠాల్లో ఆ పేరు గురించి చాలా తక్కువ ప్రస్తావన ఉంటుంది కానీ నేటికీ బుందేల్ ఖండ్ ప్రాంత ప్రజలు జానపద బాణీల్లో పాడుకొనే పాటల్లో లక్ష్మి భాయి సరసన ఝల్కారి బాయిని పాటల రూపములో గుర్తుచేసుకుంటూ  ఉంటారు. 

ఝాన్సీ సమీపములో భోజ్ లా గ్రామమంలో నిరుపేద వ్యవసాయ కూలి కుటుంబానికి చెందిన, కోరి కులానికి చెందిన సదోవర్ సింగ్ జమునా దేవి దంపతులకు 1830 నవంబర్ 22న ఝల్కారి బాబు జన్మించింది చిన్నప్పుడు అంటే 8 ఏళ్ల వయస్సులో ఈ అమ్మాయి పశువులను మేపేందుకు అడవి లోకి వెళ్లి వెంట తెచ్చుకున్న రొట్టెల మూటతో చెట్టు నీడన కూర్చుంది ఆ సమయములో ఒక చిరుత పులి ఆవు మీదకు దాడి చేసింది ఆవు అరుపులు విన్న ఝల్కారి తన చేతిలో ఉన్న కర్రను కత్తిలా తిప్పుతూ చిరుత పైకి దాడి చేసింది. చిరుత అవును వదలి ఆ అమ్మాయి మీదకు దాడిచేసింది కానీ ఆ అమ్మాయి చిరుత పంజా దెబ్బలను తెలివిగా తప్పించు కుంటూ కర్రతో చిరుత తలపై కొట్టటం మొదలు పెట్టింది ఈ అరుపులు విని మిగిలిన పశువుల కాపర్లు వచ్చి ఈ దృశ్యాన్నిచూసి నిస్చేస్టులై చూస్తున్నారు. చిరుత వెనకుకు నాలుగు అడుగులు వేసి ఝల్కారి మీదకు దూకాలని ప్రయత్నించింది కానీ ఝల్కారి చాలా చాక చక్యంగా ధైర్యముగా తన వెంట తెచ్చుకున్న కోస వాడిగా ఉన్నకర్రను పైకి నుంచి దూకుతున్న చిరుత మేడలో గుచ్చుకునేటట్లు పట్టుకోవటంతో ఆ కర్ర చిరుత మేడలో గుచ్చుకుని చిరుత చచ్చిపోయింది ఈ దృశ్యాన్ని చూసిన మిగిలిన పశువుల కాపర్లు పరుగెత్తుకుంటూ ఊళ్లోకి వెళ్లి ఝల్కారి వీర గాధను చెప్పారు ఊళ్ళో వాళ్ళు వచ్చి చచ్చిన చిరుతను చూసేదాకా నమ్మలేదు ఆ తరువాత ఝల్కారి వీర గాధ ఆ ప్రాంతమంతా మారు మోగిపోయింది. 

ఝల్కారి చిన్నతనంలోనే తల్లిని కోల్పోవటంతో తండ్రి పెంపకంలో పెరిగింది తండ్రి కూడా ఝల్కారికి గుర్రపు స్వారీ కత్తి సాము నేర్పించాడు. ఆ నోటా ఈ నోటా ఝల్కారి ధైర్య సాహసాలు పోరాట పటిమ విన్న ఝాన్సీ లక్ష్మి బాయి ఆమెను కోటకు ఆహ్వానించి సైన్యములోని మహిళా విభాగమైన దుర్గావాహినికి నాయకురాలిగా నియమించింది ఆ విధముగా ఝాన్సీ లక్ష్మి భాయి సైన్యములో చేరి.  సైన్యములోని ఆయుధ విభాగములో పనిచేస్తున్న పూరణ్  సింగ్ ను వివాహము చేసుకుంది. 

సిపాయిల తిరుగుబాటు సందర్భముగా బ్రిటిష్ సేనలతో జరిగిన యుద్దములో కీలక పాత్ర వహించి చరిత్రలో చిరస్థాయిగా పేరు సంపాదించుకుంది. 1858 ఏప్రిల్ 3న బ్రిటిష్ జనరల్ హగ్ రోజ్ నాయకత్వములో బ్రిటిష్ సేనలు ఝాన్సీ రాజ్యాన్ని చుట్టుముట్టాయి. ఆ యుద్దములో లక్ష్మి బాయ్ ని సురక్షితముగా తప్పించి కల్పి ప్రాంతములో పోరాడుతున్న తిరుగుబాటు నాయకులను కలుసు  కోవటానికి ఝల్కారి బాయ్,  ఝాన్సీ లక్ష్మి బాయ్  వేషములో బ్రిటిష్ సేనల ముందు తానె లక్ష్మి బాయ్ లాగ ప్రత్యక్షమై వారితో యుద్ధము చేస్తూ ముప్పు తిప్పలు పెట్టింది. బ్రిటిష్ సేనలు కూడా ఝల్కారి బాయ్ ని ఝాన్సీ లక్ష్మి బాయ్ అని భావించి బందీగా పట్టుకొని ఝాన్సీ లక్ష్మి బాయ్ నే  బందీ గా పట్టుకున్నామని భావించారు నిజము తెలుసుకున్న బ్రిటిష్ అధికారులు ఆమె ధైర్యసాహసాలకు  తెలివికి తెగువకు ఆశ్చర్య పోయారు.లక్ష్మీబాయి జాడ కోసము ఝల్కారి బాయ్ ని హింసించారు కానీ వారికి ఏమి సమాచారం ఇవ్వలేదు తరువాతి కాలములో బ్రిటిష్ వారు ఝల్కారి బాయ్ ని చంపారా? లేదా విడిచిపెట్టారు?అన్న వివరాలు తెలియదు

ఝల్కారి బాయ్ సాహసముతో స్ఫూర్తి పొందిన దళిత బహుజన రాజకీయ పార్టీ కార్యకర్తలు నేటికీ క్షేత్ర స్థాయిలో ఝల్కారిబాయ్  జీవితాన్ని పోరాట ఘట్టాలను కధలు కధలుగా ఊరురా ప్రచారము చేస్తున్నారు ఇప్పటికి బుందెలఖండ్ ప్రజలు ఝాన్సీ లక్ష్మి బాయ్ తో సమానముగా ఝల్కారి బాయ్ ని గౌరవిస్తారు.భారత ప్రభుత్వము ఆమె జ్ఞాపకార్థముగా ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది.


***

No comments:

Post a Comment

Pages