శ్రీధరమాధురి - 89 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి - 89

Share This

 శ్రీధరమాధురి - 89 

(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)


వృక్ష భైరవ, వృక్ష భవాని:

ఇది చాలా అరుదైన స్వరూపం. చాయ అధర్వణవేదంలో 264 ప్రధాన భైరవుడి స్వరూపాలను తెలిపారు. వాటిలో 16 స్వరూపాలు అరుదైనవి. వాటిలో కూడా 8 స్వరూపాలను అత్యంత అరుదైనవిగా చెప్తారు.

8 స్వరూపాలు. వారి దేవేరులు ఎవరంటే...

1.     ఆకాశ భైరవ - తార

2.     మార్తాండ భైరవ - రాజమాతంగి

3.     మృత్యుంజయ భైరవ - కపాలిని

4.     వృక్ష భైరవ - భవాని

5.     ఉన్మత్త భైరవ - జ్వాలినీ

6.     అసితాంగ భైరవ - హంసిని

7.     ఉజీవన భైరవ - ఉజీవిని

8.     విజయ భైరవ - జయ

దైవానుగ్రహం చేత నేను వృక్ష భైరవ, భవానికి చెందిన కొన్ని అంశాలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను.

అత్యంత అరుదైన స్వరూపాల్లో వీరు నాలుగవ వారు. 

వీరిని ఎక్కువగా అడవులు, అరణ్యాల వంటి సహజమైన వాతవరణంలోనే కనుగొనవచ్చు.

వారు ప్రాచీనమైన వారని నమ్మబడుతుంది. వారు భూమికి దిగువన వేలాది సంవత్సరాలు నివసిస్తారు. సమయం వచ్చినప్పుడు వారు భూమి నుంచి మొక్కలుగా/చెట్లుగా వెలికి వచ్చితమను అంతా చూసేందుకు, ఆరాధించేందుకు, పూజించేందుకు, తాము రానే వచ్చామని, ప్రపంచానికి తమగురించి వెల్లడి చేస్తారు.

వారు భూమికి చాలా లోతున ఉంటారు కాబట్టి, బహుశా కోట్ల కోట్ల మైళ్ళ లోతున ఉంటారు కాబట్టి, వారికి దిగువన ఉన్న ఏడు పాతాళ లోకాలపై పూర్తి నియంత్రణ ఉంటుంది. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకాలు వారి అధీనంలో ఉంటాయి.

మానవుల పితృదేవతలంతా వారి అధీనంలో ఉంటారు. పితృ లోకాలు ఆయా వ్యక్తిగత కుటుంబాలకు చెందిన ఆత్మల సమిష్టి కర్మఫలాలను బట్టి ఈ పాతాళ లోకాల్లో వాలతాయి.

వృక్ష భైరవుడిని ఆయన దేవేరి అయిన భవానితో సహా పూజించి, ప్రసన్నం చేసుకుంటే, కర్తలు తమ కుటుంబాల్లో గతించిన ఆత్మలకు చేయవలసిన కర్మలు చెయ్యకపోవడం వల్ల లేక ధర్మాలను ఆచరించకపోవడం వల్ల, మానవుల పై ఉన్న చెడు ప్రభావాలను వారు తొలగిస్తారు. విశ్వాసంతో ఎవరైనా వృక్ష భైరవ, భవానిలను అంకితభావంతో ప్రార్థిస్తే, కుటుంబాల్లో పితరులకు సంబంధించిన ఇబ్బందులు పరిష్కరించబడతాయి లేక శమింప చేయబడతాయి.

ఎవరైనా తమ పితరులకు చేయవలసిన కర్మలను( పితృకార్యాలను) చెయ్యలేకపోతే వారు వృక్ష భైరవ, భవానిలను ప్రార్ధించవచ్చు. అటువంటి ప్రార్థనలు దైవం యొక్క, వారి పితరుల యొక్క ఆశీస్సులను అందజేస్తాయి.

ఈ రూపం లో ఉన్న దైవం 7 పాతాళ లోకాలకు అధినాయకుడు కనుక, ఆయిన క్షుద్ర విద్యల వల్ల, విచ్ క్రాఫ్ట్ ( తూర్పు వైపున కొన్న వామాచార ప్రయోగాల వల్ల వచ్చే చెడు పరిణామాలు, పశ్చిమం వైపున వూడూ, చెడు క్షుద్రవిద్యలు, వశీకరణం) వంటి వాటి వల్ల  బాధపడే ప్రజలను కాపాడగలరు.

 

ఈ లౌకిక జగతిలో ఉద్యోగం దొరకడం దగ్గరనుంచి వివాహం జరగడం, పిల్లలు పుట్టడం, ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం, ఇటువంటి వాటన్నింటికీ పితరుల దీవెనలు తప్పనిసరి. ఈ వృక్ష భైరవ, భవానిలను ప్రార్థించడం ద్వారా ఇవన్నీ నెరవేరుతాయి. విశ్వాసం, భక్తి, అంకితభావం అనేవి ఇవన్నీ నెరవేరడానికి కీలకమైనవి. 

దైవం యొక్క దీవెనల వల్ల శ్రీ సాయి అమృత నారాయణ ఆలయ ఆవరణ మనాకిన్ సబోత్, వర్జీనియా, 23103 వృక్ష భైరవ భవానీలు రెండు అందమైన చెట్లుగా అవతరించారు.

దైవానుగ్రహం వల్ల మేము దైవానికి స్వాగత వేడుకలు, పవిత్రీకరణ వేడుకలను అక్టోబర్ నవంబర్ 2016 లో చేయాలని ఆశిస్తున్నాము.

ఇందులో అందరూ పాల్గొనేందుకు ఆహ్వానితులే.

ఓం క్షం వృక్ష భైరవాయ నమః.

అంతా దైవానుగ్రహం.

***


No comments:

Post a Comment

Pages