దేవశయని దశి - తొలి ఏకాదశి - అచ్చంగా తెలుగు

దేవశయని దశి - తొలి ఏకాదశి

Share This
'దేవశయని దశి..తొలి ఏకాదశి!'
-సుజాత.పి.వి.ఎల్.,
సైనిక్ పురి, సికిందరాబాద్.

విశ్వవ్యాప్త చైతన్య మూర్తి
విష్ణుతత్త్వ సాత్విక స్వరూప దివ్యశక్తి..
కాలాత్మక బహురూపి శ్రీహరి
క్షీరసాగర శేషతల్ప యోగనిద్ర శయనేకదశుడై..
సమస్త జగాన్ని అంతర్వీక్షణ చేసే..
జగద్రక్షణ జ్ఞానేంద్రియ ప్రాశస్త్య సుదినం..
ఉపవాస వ్రతాలు..
చాతుర్మాస దీక్షలు..
భక్తి, జ్ఞాన సముదాయ సాక్షీభూతం....
తపస్సంపన్న మోక్షదాయకం..
జాగరణ నియమాల సమాహార సంకేతం
ఆధ్యాత్మిక చింతనా సమ్మిళిత పర్వదినం..
కోటి గోవుల దాన ఫలితం..
జన్మజన్మల పాప హరణం..
హరినామ స్మరణం..
దేవశయని దశి..తొలి ఏకాదశి
పుణ్యకాల ప్రారంభ వైశిష్ట్యం..
హృదయారవింద వికసితం!
****

No comments:

Post a Comment

Pages