జనరంజని వార్షికోత్సవ సంబరాలు - అచ్చంగా తెలుగు

జనరంజని వార్షికోత్సవ సంబరాలు

Share This
జనరంజని వార్షికోత్వవ సంబరాలు
ఓరుగంటి సుబ్రహ్మణ్యం ముంబాయి కేంద్రంగా ఉన్న తెలుగు సాంస్కృతిక  సంస్థ 'జనరంజని' తొలి వార్షికోత్సవ వేడుకలు అంతర్జాల వేదికపై ఈ నెల 19-20 తేదీలలో ఘనంగా జరిగాయి. 

శ్రీశ్రీశ్రీ మలయాళలలితాంబిక తపోవనం పీఠాధిపతి పూజ్యశ్రీ సర్వేశ్వరానందగిరి స్వామిజి జ్యోతిప్రజ్వలనచేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

స్వాగతోపాన్యసంలో సంస్ఠ వ్యవస్ఠాపకులు శ్రీ రుద్రాభట్ల  రాంకుమార్ జనరంజని గతంలో నిర్వహించిన కార్యక్రమాలను గుర్తుచేసారు. శ్రేయోభిలాషులు, సభ్యుల సహకారంతో  రాబోయే  కాలంలో కూడా మంచి కార్యక్రమాలను నిర్వహిస్తామ ని వక్కాణించారు. జివిఎల్ నరసీంహారావు. బుచ్చి  రాంప్రసాద్,  వామరాజు సత్యమూర్తి  తదితర ప్రముఖులు అతిథులుగా పాల్గొని సంస్ఠ పురోగతికి ఆశీస్సులందించారు.    

హాస్యబ్రహ్మ శంకరనరాయణ చలోక్తులు, మంథా వరలక్వ్ష్మి హరికథాగానం, వేముల రంగారావు వేణునాదం, ఈలపాట హాస్య కధనిక న్రుత్య ప్రదర్శనలు శ్రోతలను అలరించాయి.

రాధిక మంగిపూడి, కస్తూరి శివశంకర్, శ్రీలేఖ వారణాసి, దశక చంద్రశేఖర్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.   కంభంపాటి  మాధవరావు వందన సమర్పణతో వార్షికోత్సవ కార్యక్రమాలు     ముగిసాయి.

***

No comments:

Post a Comment

Pages