పరిశోధనా జీవిత ప్రతిబింబం - ఎగిసే కెరటం - అచ్చంగా తెలుగు

పరిశోధనా జీవిత ప్రతిబింబం - ఎగిసే కెరటం

Share This

 పరిశోధనా జీవిత ప్రతిబింబం - ఎగిసే కెరటం పరిశోధనా రంగంలో ఉన్న ఇబ్బందులు ఏమిటో తెలిపే చక్కని పుస్తకం ఈ మధ్యనే వచ్చింది. రచయిత్రి డా. శ్రీసత్య  గౌతమి గారు ఈ పుస్తకం ద్వారా పలువురి మన్ననలు పొందుతున్నారు. ఈ పుస్తకం మీద అనేకమంది వ్యక్తపరచిన అభిప్రాయాలను చూద్దాము.

 

తిన్ననూరి యమ్మీ :

ఎగిసే కెరటం.. చక్కని శీర్షిక.  ప్రతినాయిక లాంటి లక్షణాలున్న కథానాయిక.. సింథియా మనస్తత్వ విశ్లేషణ... అద్భుతంగా ఆవిష్కరించారు శ్రీసత్య గౌతమి గారు. 


సింథియా మనస్తత్వాన్ని వివరించిన తీరు అతి వేగం గా చదివించింది...ఆపకుండా. 


కేవలం ఎదగాలి,అని కాకుండా అందనంత ఎత్తులు అందుకోవాలనే తాపత్రయం లో కనీసపు నైతికత నుమరిచి ప్రవర్తించిన తీరు,  తన అనుమానం, కౌశిక్ కి వలపన్నాలనుకోవడం, చటర్జీ కి తనపైన విపరీతమైన నమ్మకం పెంచుకునేలా చేసుకోవడం..అందరి పైన నిఘా ఉంచడం అవన్నీ చదువుతుంటే.. ఇంతటి తెలివితేటల్ని పని నేర్చుకుని వృత్తిపరంగా ఎదిగితే ఎంత గౌరవం దక్కేది అనిపిస్తుంది. 


రాకేష్ ని పెళ్లి చేసుకున్నాక వ్యవహరించిన తీరు సింథియా ని పూర్తిగా  ఆవిష్కరించింది...!


ఎంతో ఎత్తుకి ఎలాగైనా ఎదగాలని చేసిన ప్రయత్నం లో అత్యంత హేయం గా శిక్షింపబడి...బిశ్వా ఉసురు తనకి తగిలిందని అప్పుడు పశ్చాత్తాపం చెందినా... ప్రయోజనం?రాకేష్ చూపులోని అమ్మ ప్రేమ క్షమించేలా  చేస్తుందా!?


తొమ్మిది సంవత్సరాల తర్వాత తన పరిస్థితి ఏమిటనేది పాఠకుల ఊహకే వదిలేశారు. 


ముఖ్యంగా ఉద్యోగాల్లో ఎలా ఒకరి ని క్రిందికి లాగి పైకి వెళ్లాలనుకుంటున్నారనే విషయాల్ని చాలా క్లియర్ గా వివరించారు. 


మంచి  పుస్తకాన్ని చదివిన అనుభూతి...అందుకే వెంటనే పంచుకుంటున్నా...!


అభినందనలు సత్య గౌతమి గారూ💐💐👍


బులుసు ప్రసాద్: 

Yes,  this is not only a book, it's a Life.  A sweet  warning in the story. Really worth reading.


సంచిక పత్రికలో వచ్చిన రివ్యూ:

https://sanchika.com/egise-keratam-book-review/

No comments:

Post a Comment

Pages