యాన్ అన్ రివీల్డ్ ట్విస్ట్ - అచ్చంగా తెలుగు

యాన్ అన్ రివీల్డ్ ట్విస్ట్

Share This
యాన్ అన్ రివీల్డ్ ట్విస్ట్ 
  -ప్రతాప వెంకట సుబ్బారాయుడు


 
    ఇంటి బయట నుంచున్న సూరజ్ ముందు కేబ్ ఆగింది. కారు అద్దానికి ఉన్న తను ఇంటర్వ్యూకు అటెండవబోయే వేవ్ డాట్ సంస్థ స్టిక్కర్ చూసి అది తనకోసమే పంపించిందని గ్రహించి డోర్ తీసుకుని ఎక్కాడు. కారు ఒక కిలోమీటరు ట్రావెల్ చేశాక ఒకమ్మాయి ముందు ఆగింది. పుస్తకాల్లో చదివిన పోలికలతో కంపేర్ చేసుకుని 'షి ఈజ్ యాన్ అప్సరస' అనుకున్నాడు మనసులో. అంతేకాదు వెనక అంతందం తనతో పాటు కూర్చుని ఇంటర్వ్యూకు అటెండవడం తన లక్కని కూడా అనుకున్నాడు.
'అయామ్ సూరజ్' అన్నాడు నవ్వుతూ.
'మి మేఘనా' అని 'మనిద్దరిలో జాబ్ కు ఎవరు సెలక్ట్ అవుతారో కదా' అంది.
'లెట్స్ హోప్ పాజిటివ్..ఇద్దరం అవుతాం' అన్నాడు.
'మీది పాజిటివ్ యాటిట్యూడ్ అన్నమాట. అన్నట్టు మీ చేతిలో ఫైల్ లాంటిదేం లేదేంటి? మీరు ఇంటర్వూకేనా?'
'యా, ఇదిగో ఇదే నా డేటాబేస్ ప్రపంచం. గూగుల్ డ్రైవ్ లో అన్నీ ఉన్నాయి'
'నైస్, నేను చూడండి చచ్చినట్టు ఇలా ఫైల్లో అన్నీ మోసుకొస్తాను. ఒకసారి ఫైల్ పోయి, మళ్ళీ దొరికేసరికి తల ప్రాణం తోక్కొంచిందనుకోండి'
'ఈజిట్, మీకు తోకుందా?'
'మీకు సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఉందన్నమాట. కాని నేనలా మాట్లాడలేనండి. అది ఇన్ బిల్ట్ నేచర్ అయివుండాలనుకుంటా.. ఫైవ్ హండ్రెడ్ ఛేంజ్ ఉందా, వెళ్ళేప్పుడు వీళ్ళు తీసుకెళుతున్నారుగాని వచ్చేప్పుడు మనమే ఆటోలోనో, బస్సులోనో రావాలిగా'
'నేను మనీ కేరీ చేయనండి. ఫోన్ పే, గూగుల్ పే, పేటియం, డెబిట్, క్రెడిట్ కార్డ్ లతో నడిపించేస్తాను. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో నేను ముందుంటా. ఇంకా చేత్తో డబ్బివ్వడాలు, చిల్లరకోసం తిరగడాలు నాన్సెన్స్. సారీ, మిమ్మల్ని కాదు. ఇవాళ వెళ్ళేప్పుడు మీకు ఎక్కడ ఇబ్బంది ఎదురైనా, నాకు కాల్ చేయండి. నా నెంబరు 939398.... నేను మనీ ట్రాన్స్ ఫర్ చేస్తాను. అది మీ పరిచయానికి నేనిచ్చే కాంప్లిమెంటరీ గిఫ్ట్'
'మీరు భలే మాట్లాడతారండి. మీకు సాటి మనుషుల పట్ల కన్సర్న్ కూడా ఉంది'
'ఉండాలండి మనలను జంతువులుగా కాకుండా మనుషులుగా భగవంతుడు పుట్టించింది అందుకే'
'ఇన్ని విషయాల్లో శ్రద్ధ ఉన్న మీరు టెక్నికల్ గా కూడా స్ట్రాంగనుకుంటా'
'యా, మొదట్లో ఉత్సాహంగా ప్రారంభమయ్యే మన కరీర్ గ్రాఫ్ తర్వాత సాట్యురేషన్ లెవెల్ లో స్టేబుల్ అవడానికి కారణం మనం అప్ గ్రేడ్ కాకపోవడమే. మనలో కూడా వెర్షన్స్ ఉండాలండి'
'నాకైతే యూ ట్యూబ్ లో ప్రోగ్రామ్స్ చూడ్డంలో ఉన్న ఇంట్రస్ట్ కోడింగ్ మీద ఉండదండి. జాబ్ ఈజ్ ఫర్ మనీ సేక్ అనుకునే దాన్ని, ఇప్పుడర్థమైంది నాకు జాబ్ రావడం కల్ల అని'
'డోంట్ బి పెస్సిమిస్టిక్..'
'అన్నట్టు నా ఫ్రెండ్ ఒక కోడ్ పంపింది. అందులో ఏదో బగ్ ఉందట. కుడ్ యు చెక్?'
'ఏది చూపించండి?' అతననగానే అతని మెయిల్ ఐ డి అడిగి ఫార్వార్డ్ చేసింది.
అతను కోడ్ ని అర్థం చేసుకుని, వితిన్ నో టైం డి బగ్ చేశాడు.
'ఓహ్, మీరు ఇంటెలెక్చువల్ అండి' అంది ప్రశంసిస్తూ.
'అదేముందండి టెక్నికల్ సబ్జెక్ట్స్ లో జాబ్ చేయడం ముఖ్యం కాదండి, క్రిటికాలిటీని కిల్ చేయడంలోనే థ్రిల్ ఉంటుంది'
'మీరింతకు ముందు టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందుంటానన్నారు కదా, సోషల్ మీడియాలో మీ పార్టీసిపేషన్ ఎలా ఉంటుంది?'
'మనలను షైన్ చేసే టెక్నాలజీ ఓకే కానీ కాప్చర్ చేసే టెక్నాలజీకి దూరం. మా ఫ్యామిలి వాట్సప్ గ్రూప్ ఉంది, సెలెక్ట్ అయి జాబ్ వస్తే టీం గ్రూప్ అంతే. నో అదర్ గ్రూప్స్ టు వేస్ట్ టైం'
'మేము ఆడవాళ్ళం ఎక్స్ ట్రా టైం ఆఫీసులో ఉండాలంటే ఆలోచిస్తాం. మీ మగమహారాజులకు ఎంత టైమైనా ఓకేనే కదా, అదీ మీకు ప్లస్సే?'
'అవును జాబ్ అంటే బాధ్యత. ప్రాజెక్ట్.. టైం డిమాండ్ చేస్తే ఇవ్వాలి. అఫ్ కోర్స్ అందులో మన శాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా'
'ఇన్ని హైపర్ క్వాలిటీస్ ఉన్న మీకు కాక జాబ్ నాకెలా వస్తుందండి? అయామ్ మేఘన వన్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ అండ్ డాటరాఫ్ మల్లికార్జున్, సి ఎం డి ఆఫ్ వేవ్ డాట్. అదిగో అదే మన సంస్థ. అపాయింట్మెంట్ లెటర్ మీకు జస్ట్ ఇప్పుడే మెయిల్ చేశాం. మీ కంఫర్టెబుల్ డే నాడు జాయినవండి. డ్రైవర్ బ్యాక్ పోనీ..సార్ ని ఇంటి దగ్గర దింపేయాలి'
'ఇదన్యాయం అండి. ఇంటర్వ్యూ కోసం కో యాస్పిరెంట్గా జాయినై, నాకు తెలియకుండా నన్ను ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేయడం. ఏదేమైనా ఐడియా ఇన్నోవేటివ్ గా ఉంది. థాంక్సండి'
'ఉండండి మా డాడ్ కు చెబుదురు గాని. బికాజ్ ఆర్గనైజేషన్ బిలాంగ్స్ టు హిమ్' అని ఫ్రంట్ సీట్ బ్యాక్ న ఉన్న ట్యాబ్ ఆన్ చేసింది.
"హాయ్ సూరజ్, కంగ్రాట్స్. మీ గురించి పూర్తిగా తెలుసుకుని మిమ్మల్ని మా అమ్మాయి ఫిజికల్ గా కూడా ఇంటర్వ్యూ చేశాక, మీరు ప్రాజెక్ట్ లీడ్ పొజిషన్ కు అబ్సొల్యూట్లి సూటబుల్ అని అర్థమైంది. నౌ యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ వేవ్ డాట్ ఫ్యామిలీ' అన్నాడు స్క్రీన్ మీంచి వానీష్ అవుతూ.
అప్సరస తనతో జస్ట్ కొంతసేపు ట్రావెల్ చేయబోతోందని పొంగిపోతే, ఏకంగా ఏంజిలై జాబే ఇచ్చింది..తన మైండ్ డ్రైవ్  లో ఇదో మెమొరబుల్ ఫైల్ అనుకుని  'థాంక్సండి' అన్నాడు.
'నో ఫార్మాలిటీస్..ప్లీజ్..వర్క్ అండ్ ప్రూవ్ యువర్ టాలెంట్'
కారు సూరజ్, వుడ్ బి ప్రాజెక్ట్ లీడ్ ఆఫ్ వేవ్ డాట్ ముందు ఆగింది. 
సంతోషంతో తేలికైన హృదయాన్ని దింపి కారు తేరులా మేఘనతో కదిలి వెళ్ళిపోయింది.
సూరజ్ ఊహక్కూడా అందనిదేమిటంటే, 'హేండ్ సమ్, జంటిల్ మెన్, ఇంటలెక్చువల్, టెక్నికల్లీ స్ట్రాంగ్, ఇతరుల పట్ల కన్సర్న్, గ్రేట్ యాటిట్యూడ్ ఉన్న సూరజ్ కు మేఘనను ఎందుకివ్వకూడద'ని మల్లికార్జున్ గారు ఆలోచిస్తున్నారని.

***

No comments:

Post a Comment

Pages