బలిపీఠం - అచ్చంగా తెలుగు
కవితశీర్షిక
"బలిపీఠం"
నాగ్రాజ్...

ముందువరుసలో
గొర్రెల్ని కంట్రోల్ చేస్తున్నాడు
కాపరి!
గొర్రెదాటు
ముందు గొర్రె ఏ దారైతే
మందదీ అదే!
కాపరి నేర్పరితనం
గొర్రెలు గడ్డి,ఆకులు
తినడం మనేసాయి
విలువగలకాగితాలు
మధువులో ముంచుకుతింటున్నాయి!
అసలే గొర్రెలు
మత్తులో మునిగాయి
కాపరి విరాట్ స్వరూపుడై
గోచరిస్తున్నాడు!
గొర్రెలన్నీ తీర్మాణంచేసి
మందకు రాజుగా కాపరిని
ప్రటించాయి!
మీరుచెప్పిందే వేదం
మీరుచూపిందే మార్గం
చట్టం చేసుకున్నాయి!
బలిసినగొర్రెనొకదాన్ని పిలిచి
ఇప్పటినుండి ఇతనే 
నీ పోషకుడు 
స్వర్గానికి తీసుకెళ్తాడు పో..!!
అన్నాడు!
ఆజ్ఞదేవా!
అంటూ గొర్రె కసాయి వెంట
నడిచింది.
కాపరి సంచిలో డబ్బులు
నింపుకోవడం మందలో
బక్కచిక్కిన గొర్రె చూసింది
నిస్సహాయంగా...!!

***

No comments:

Post a Comment

Pages