వీణా పుస్తక ధారిణి - అచ్చంగా తెలుగు

వీణా పుస్తక ధారిణి

Share This
'వీణా పుస్తక ధారిణి..!''
-సుజాత.పి.వి.ఎల్.
అజ్ఞాన తిమిరాంధకారాన్ని తొలగించి
విజ్ఞాన కాంతి పుంజాన్ని ప్రసాదించే ధవళ వస్త్ర ధారిణి..
సమస్త సృష్టిని 
నిత్యచైతన్య శక్తితో నడిపించే శుద్ధ సాత్విక రూపిణి..

వ్యాస మహర్షి ప్రతిష్ఠిత
షోడశ భుజయంత్ర నిలయ నివాసిని..
అష్ట తీర్థ సరోవర పరివేష్టిత పాపహరిణి..

అక్షర సుమాలతో
నిత్యం పూజలందుకొను..
హరిద్వర్ణ అలంకార పర బ్రహ్మ స్వరూపిణి..
ప్రశాంత, చిత్త జ్ఞాన సుధ ప్రదాయిని..

ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి సర్వ విద్యాశక్తులనొసగే
వీణా పుస్తక ధారిణి..
అనంత దృక్కులకగుపించు తేజోమయ వాణి..
పారమార్థిక, లౌకిక ,ప్రతిభ, ధారణ, జ్ఞాన సంపదలిచ్చు
సృష్టి స్థితి లయకార అంశణి..

చైత్ర శుద్ధ పంచమిన
షోడశోపచార శ్రీవాణీ రూపేణ
విశిష్ట పూజలందుకునే
శరదిందు సమాకారిణి..
శ్వేతాంశ సప్తవర్ణ శోభిణి..
సృష్టికర్త హృదయ నివాస చంద్రవదని...
సామాంపాతు సరస్వతీ..భగవతీ
నమోస్తుతే!!!
*****

No comments:

Post a Comment

Pages