ప్రశ్న - అచ్చంగా తెలుగు
 ప్రశ్న 
ప్రతాప వెంకట సుబ్బారాయుడు



నేను ప్రశ్నిస్తున్నా
ఓపిగ్గా విని..అర్థం చేసుకుని..
సమాధానం చెప్పే తీరికెవ్వరికీ లేదు
అదేంటో చిత్రంగా..అందరూ ప్రశ్నల రూపంలో సాగి పోతున్నారుగాని
సమాధానాల కోసం ఎదురు చూడడం లేదు
విద్యార్జనకు ఆయువుపట్టుగా నిలుస్తున్నాయి తప్ప
ప్రశ్న..జవాబులు, మార్కుల ప్రాతిపదికన జరిగే
ఏది జరిగినా రాజీ పడి బతుకుతున్నారు తప్ప
సంఘంలో ప్రశ్నించడం ఓ అత్యావశ్యకం అనుకోవడం లేదు
అడగడం మర్చిపోయారు
ఉనికి, ఉద్యమాలకి మూలం..
ప్రశ్నార్థకంగా నిలిచిపోతే..సమాధులపై చిహ్నాలుగా మిగిలిపోతాం
మార్పుకు కారణం ప్రశ్నన్నది మర్చిపోతే ఎలా?
సమాధానాలు రాబడితేనే..
సమాజంలో నిత్య చైతన్యస్ఫూర్తికి నిఖార్సైన నమూనాలమవుతాం!

 ***

No comments:

Post a Comment

Pages