తత్త్వం
భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.
సాకారంలో నిరాకారం ఎదగటం, 
నిరాకారంలో సాకారం ఒదగటం,
 తత్వంలోతప్ప వేరేదానిలో అసాధ్యం. 
సాకారానికి సాగిలపడి మొక్కటం,
నిరాకారానికి నమ్రతతో తలవంచటం,
 తత్త్వంలోనే చూస్తాం.
మానవత్వం దైవత్వంగా మారటానికి,
 తత్వమే అసలైన నేస్తం. 
సహనం కొంచెం ఎక్కువ అవటం వల్ల,
సహజంగా కొందరికి చులకన అవుతూ వస్తోంది.
వేదాంతం అంటే తనకు ఉన్న మక్కువవల్ల,
అలా ప్రవర్తించాల్సి వస్తోంది.
తనది వికసించిన హృదయం కనుక, 
అన్నిటినీ భరించాల్సి వస్తోంది.
సవ్యమైన సాధనలను బోధిస్తూ,
సత్యమైన శోధనలను సమర్ధిస్తూ,
విరక్తికి,వైరాగ్యానికీ బేధాన్ని వివరిస్తూ,
ఆత్మకి,పరమాత్మకి ఉన్న సారుప్యాన్ని నిరూపిస్తూ,
నిన్ను గమ్యానికి సురక్షితంగా చేరుస్తూ,
అడుగడుగునా నీకెదురయ్యే సందేహాలను తీరుస్తూ,
ఆదిలో నీ దిక్సూచిగా మారి,మధ్యలో నీ గమనంగా చేరి,
చివరిలో తానే నీ గమ్యమై నిన్ను కోరి,
నిన్ను కడతేర్చే ఈ అధ్బుత విధానం
ఒక్క తత్త్వంలోనే ఉంది.         
***
 

 


 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment