'మహిమాన్వితుడు..యేసు!' - అచ్చంగా తెలుగు

'మహిమాన్వితుడు..యేసు!'

Share This
'మహిమాన్వితుడు..యేసు!'
-సుజాత.పి.వి.ఎల్, సైనిక్ పురి, సికిందరాబాద్.




దేహ దేవాలయంలో
దైవ స్వరూపుడు..
ప్రేమ, కరుణ, త్యాగం,
సహనమనే సద్గుణాల మాననీయుడు..
కారు చీకటిలో 
కాంతి రేఖలా..
డిసెంబర్ ఇరువది ఐదు అర్థరాత్రి,
కన్నె మరియ గర్భాన పశువుల పాకలో
 జన్మించిన దైవ కుమారుడు యేసు..
శత్రువును మిత్రుడిగా భావించి..
చేసిన తప్పులను ప్రేమతో మన్నింపమని..
శాంతి సందేశమిచ్చిన కరుణామయుడు..
పాపులను పరిశుద్ధుల్ని చేయుటకై..
ముళ్ళ కిరీటాన్ని ధరించి
శిలువ మోసిన దయామయుడు..
ఆర్తులను ఆదరించి..
అసాధ్యాలను సాధించి..
అద్భుతాలెన్నో సృష్టించిన మహిమాన్వితుడు..
దారి తప్పిన మనుషుల జీవితాల్లో..
వెలుగులు నింపేందుకు..
పర లోకం నుండి ఇల దిగి వచ్చెను..దైవ పుత్రుడు..
యేసుక్రీస్తు బోధనలు సదా ఆచరణీయం..మార్గ దర్శకం!!
*****

No comments:

Post a Comment

Pages