తుంగభద్ర...సుచరిత్ర! - అచ్చంగా తెలుగు

తుంగభద్ర...సుచరిత్ర!

Share This
తుంగభద్ర..సుచరిత్ర..!'
 -సుజాత.పి.వి.ఎల్. 
సైనిక్ పురి, సికిందరాబాద్.పన్నెండేళ్ళకొకసారి
ఏడాదికో నదిని స్పర్శిస్తూ..
పుష్కర రూపేణా..
పుణ్యచరితులను చేయ..
పుట్టింటి సారె
పెట్టించుకొనేందుకు..
వడివడిగా..బిరబిరతో
ఉప్పొంగు ఉత్సాహముతో
మనలను పునీతులను చేయగా వచ్చింది..తుంగభద్రానది..!
శివకేశవుల ప్రీతి మాసం..కార్తికంలో..
శివనారాయణుల స్వరూపమైన తుంగ, భద్ర ఇరువురి కలయిక..నదీ స్నానం
అరుదైన పుణ్యఫలం..
అత్యంత ప్రత్యేకం..!
శ్రీరామ జీవధార సరయు మాత    ఒడిలో ముత్యమై..తరగల మెరుస్తూ..నురగల నాట్యంతో సిరి సంపదలనొసగ విరిబోణిలా వచ్చింది తుంగభద్రానది..!
యతి రాఘవేంద్ర తీర్థులు వెలసిన సన్నిధిలో..
విజయనగర సామ్రాజ్యం కొలువుదీరిన పవిత్రజలనిధి..
అమృత సిరిఝరి..!
కళలకు రాణి..శిలలకు ప్రాణి..
తుంగభద్రా పుష్కరిణి..
పూర్వ జన్మ సంచిత పాపహరణం..పుష్కర స్నానం..!
సుజలం..సుఫలం తుంగభద్రా జల తీర్థం..!
సేవించిన, దర్శించిన సర్వ శుభప్రదం..!!
****

No comments:

Post a Comment

Pages