శివం -68 - అచ్చంగా తెలుగు

శివం -68

-రాజ కార్తీక్  




(కుంభన్న అంటే ఎవరో కాదు నేనే అని తెలుసుకున్న హరసిద్ధుడు.. తీవ్ర తన్మయత్వం లోకి వెళ్ళాడు తర్వాతి కథ)

ధర్మయ్య "బాబు నా మాట విన పడుతుందా?"

 హర సిద్ధుని కంటి వెంట నీరు.. ఆనంద తాండవం ఆడే గంగలాగ ఉబికి వస్తోంది...

అసలు తనకి ఏం అర్థం కావట్లేదు తనతో ఇంత కాలం ఉంది,  తప్పులు వెతికింది ఆ తప్పులు సరి చేసింది, తనతో ఆడింది, పాడింది, నవ్వింది, నడిపించింది ఓదార్చింది, స్వాంతన చేకూర్చింది, అభయం ఇచ్చింది, వరాలు ఇచ్చింది, సాక్షాత్తు నేనే అని తెలుసుకొని ఎన్ని జన్మల పుణ్యం, నాకోసం సాక్షాత్తు  వచ్చాడా? నిజంగా నా తల్లిదండ్రులు, పెంచిన వారు ధన్యులు కదా,.. అనుకున్నాడు.

ధర్మయ్య"బాబు, నువ్వు ఎంత అదృష్టవంతుడివి అయ్యా నీకన్నా ధన్యుడు ఎవరు? నీ కన్నా ఉత్తముడు ఎవరు? ఏమి నీ జన్మ! నీ తల్లిదండ్రులు నీతో తిరిగిన వారు ఎంత పుణ్యం కలిగి ఉంటారు. లేకపోతే ఈ రోజుల్లో సాక్షాత్తు పరమేశ్వరుడే ఇలా వస్తాడా? నీకు  చెప్పడానికి మాటలు రావట్లేదు ఆ పరమేశ్వరుడు తో ఉన్న నిన్ను అణువణువు ఆలింగనం చేసుకొని మేము ధన్యులము అవ్వాలి."

అలా వాళ్ళందరూ హర సిద్ధు ను ఆలింగనం చేసుకొని మురిసిపోతున్నారు..

హర సిద్ధ మాత్రం మనసులో ..

"అయ్యో, నేనెంత తప్పు చేశాను, సాక్షాత్తు శివుడే నా కోసం వస్తే ఆయన్ని అనుమనించాను..అందరూ అనుకున్నట్లు నేను అజ్ఞానిని కాబట్టే నా పక్కన ఉన్న నేను గుర్తు పట్టలేకపోయాను. నా లాంటి మూడుడికి కి ఎంతో ప్రశాంతత కల్పించినా ఆయన్ను గుర్తు పట్టలేక పోయాను,నా ప్రతి మాటకు .సమానం గా సమాధానం చెప్పి నన్ను స్వాంతన చేకూర్చే విధంగా ఉన్న .అయ్య అందరూ నన్ను ఆసహయం గా చూస్తున్న ..నాకు బాసట గా నిలువటుకు వచ్చిన దేవుడవు నీవా అని ప్రశ్నంచు లేక పోయాను.."

ఆ గుంపులో అందరూ హర సిద్ధుని ఒక దైవం వలె చూస్తున్నారు... సాక్ష్యాత్తు నేనే వచ్చాను అంటే హరసిద్దుడు ఎంత గొప్ప వాడు అని అనుకుంటున్నారు. 

ఎప్పుడూ నిరాదరణ తప్ప ఏమి తెలియని హర సిద్దుకి వారు తనని రాజు వలె చూస్తూ ఉంటే, చిన్నప్పుడు తన నాయనమ్మ..చెప్పిన మాట గుర్తుకు వచ్చింది.

"ఒరేయ్ హర సిద్ధ నువ్వు రాజు అవుతావని ఇందాక ఒక సాధువు చెప్పాడు రా...ఆయన మాట చల్లగా ఉండి నువ్వు  నిజంగా రాజువి అవ్వరా" అంటూ చిన్న శిల్పాలు చెక్కుతున్న హర సిద్దు కి చెప్పింది. తన శిల్పకళను చూసి, తన నాయనమ్మ ఒక కోరిక కోరుకోబోయింది."

ఇంతలో ధర్మయ్య హర సిద్ధుని తట్టి "బాబు ఏమి ఆలోచిస్తున్నావు... ఎందుకు మౌనంగా ఉన్నావ్? చెప్పు అయ్య" అన్నాడు.

హర సిద్దు మనసులో .."రాజు అయ్యే మాట దేవుడెరుగు, ఇప్పటి వరకు తనకి అందరూ శత్రువులే... కానీ తను ఎవరికి హని చేయలేదు... ఎవరి దగ్గర తప్పుగా ప్రవర్తించలేదు. తనకి లౌక్యం, తెలివి లేదుగా! యదార్థ వాది లోక విరోధి..కదా!"

ధర్మయ్య చెప్పినాయన "అసలు ఎలా వచ్చాడు ఈ పరమ శివుడు నీ దగ్గరికి?" అని అడిగాడు.

హర సిద్ధుడు తన పరిచయవృత్తాంతాన్ని వాళ్లకి వినిపించి...

ఇక్కడికి కొన్ని క్రోసుల అవతల ఉండే  రాజ్యంలో నేను నివసిస్తున్నాను.. నేను ఒక శిల్పిని, బతుకుతరువు కోసం శిల్పాలు చెక్కుకుంటూ గడిపే వాడను...." అంటూ నా గురించి ఏమి చెప్పలేదు.

తన దైన శైలిలో వాళ్ళు అనుకుంటున్నది నిజమా అబద్దమా అని తేల్చడానికి, అయ్యా మరొకసారి పరీక్షించుకోండి నా దగ్గరికి వచ్చిన ఆయన పేరు" కుంభ అయ్య"

జీవితంలో ఎంతో మంది చేతిలో ఎదురు దెబ్బలు తిన్నాను మనమందరం నిర్ధారించుకోవాలి.

కుంభ అయ్య అనగానే ..

ధర్మయ్య"అయ్యా నీకు కనపడుతున్న ఆలయంలో ఉన్న దేవుడి పేరు కుంభయ్య.. నీతో వచ్చిన అని పేరు కూడా అదే, ఈ ఆలయ చరిత్ర కి నువ్వు చెప్పిన పేరు కి, బొజ్జ లింగానికి సరిగ్గా సరిపోయింది నాయన..సందేహం వద్దు." అన్నాడు.

అందరూ "హర హర మహాదేవ " అని అన్నారు.

హర సిద్దు "ఏమిటి మీ ఆలయ చరిత్ర" అని అడిగాడు.

ధర్మయ్య"  పద ఆ ఆలయంలోకి వెళ్దాం" అంటూ ఇందాక హర సిద్దు నమస్కరించి చూసిన ఆలయంలోకి వెళ్ళారు . ధర్మయ్య మాత్రం కొంతమందిని  హరసిద్ధు తెచ్చిన బొజ్జ లింగాన్ని వెళ్లి తీసుకు రావాల్సిందిగా పురమాయించారు.. వాళ్ళు ఆ పని మీద వెళ్ళారు ..

ధర్మయ్య, అక్కడ గుంపు, చెప్తున్నారు... 

"చూడు నాయనా హర సిద్దు!.. కొంతమందికి పేర్లు ఎందుకు పెడతారు ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు అలాగా నీకు పెట్టిన పేరు కి పూర్తి సార్ధకత చేకూర్చేవు...నిన్ను చూస్తే మాకు అసూయగా ఉంది..

ఇక్కడి ఆలయ చరిత్ర చెబుతాను విను...

60 ఏండ్లు కి పూర్వం ఈ ప్రాంతం లో కరువు ఉండేది ..ఎప్పుడు మా మంచి గురించి ఆలోచించే మా రాజు గారు కాశీ పట్నం నుండి ఎంతో మందిని తెప్పించి, వారితో మా రాజ్యానికి అంతా మంచి చేకూరి, బీడు భూములను సాగు చేసి పాడి పంటలు, పశువులను సమృద్దిగా ఉండాలని యజ్ఞం తలబెట్టారు . అప్పుడు పండితులు అందరూ చర్చించి ఇక్కడ ఒక శివాలయం కట్టాలి అని నిర్ణయం చేశారు. ఆలయంలో ప్రతిష్ఠ చేయటానికి ఎన్నో శివ లింగాలు చెక్కినా  అవి ఏదో విధంగా చెదిరి పోయాయి. ఎందుకు ఇలా జరుగుతూ ఉందో ఎవరికి అర్దం కాలేదు. ఇప్పుడు నీకు కనిపిస్తున్న గుడి అంతా కట్టారు. గర్భగుడిలో లో శివ లింగం మాత్రం ఏమి చేసినా కుదరటం లేదు ...

అప్పుడు ఈ రాజ్యం చాలా పెద్దది ..

రాజు గారి కుటుంబం, పండితులు .అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. అప్పుడు  పసివాడిగా నేను ఉన్నాను. ఇప్పటి రాజు గారు ఉన్నారు.

ఎలాగైనా గుడిలో లో శివ లింగాన్ని ప్రతిష్ఠ చేయాలి అని అందరి ఉద్దేశం. సంకల్పం మనది కాదుగా, ఆ శివయ్య కు కూడా ఉండాలి అదే దైవ సంకల్పం...మనం మనసులో కోరుకోగా ఆయన్ని వేడుకోగా, ఆయన మనకి సంకల్ప శక్తి ప్రసిదిస్తాడు.."

అవును నిజమే మీ న్యాయమయిన ఏ సంకల్పం అయినా నా దీవెన కచ్చితంగా ఉంటుంది ..

హర సిద్దు చాలా ఆసక్తిగా వింటున్నాడు...

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages