అక్షర జల్లులు - అచ్చంగా తెలుగు

అక్షర జల్లులు..!

 -పి.వి.ఎల్.సుజాత నింగి నుండి జాలువారిన

అమృతపు చినుకులు..వాన జల్లులు..

ఆల్చిప్పలో ముత్యమై మెరుస్తుందో..

వరి మొక్కగా గాలికి అల్లాడుతుందో..

సెలయేటి లోన జీవబిందువవుతుందో..

మబ్బు కరిగిన నీరు ప్రకృతిని స్నానింపచేసి

మనందరినీ పరవశింపజేస్తుంది..

ఆ నీటిబిందువులే 

గుండ్రని అక్షర జల్లులై..

కవి హృదయాన్ని

స్పందింప చేస్తున్నాయి..!!

****


No comments:

Post a Comment

Pages