‘పుల్క’రింత - అచ్చంగా తెలుగు
‘పుల్క’రింత
(హాస్య కవిత)

డా. మూర్తి జొన్నలగెడ్డ
సౌత్ పోర్ట్, యునైటెడ్ కింగ్డమ్మీ ఆరోగ్యమె నా మహద్భాగ్యమని
నేయి నూనెలు, వెన్న పూసయూ పూసుకొనక
నిండు కొలిమిలో నీవు దుమికి
ఇటు కాలిన యటు, అటు కాలిన నిటు
మహాత్ముని వోలె రెండు పార్శ్వముల 
నెదురు చూపెడి యో వీర పుల్కా!
పుల్కరించును జనుల యొడలు నీ వీర గాధను
విన్న యంతనె! నీ కష్టమెన్నడు మరపు రాదు
అందుకే మరి మారు అడిగెద తిన్న వెంటనే!

***

No comments:

Post a Comment

Pages