అక్కినేని అద్భుత అభినయం... దేవదాసు - అచ్చంగా తెలుగు

అక్కినేని అద్భుత అభినయం... దేవదాసు

Share This
అక్కినేని అద్భుత అభినయం... దేవదాసు
సేకరణ : మూర్తి ఎన్ జీడిగుంట



దేవదాసు’ చిత్రం అంటే ముందుగా చక్రపాణి గురించి చెప్పుకోవాలి. దర్శకుడు పి.పుల్లయ్య చిత్రం ధర్మపత్ని’ (1941)కి సంభాషణల రచయితగా చక్రపాణి తెనాలి నుంచి మద్రాసు వచ్చారు. ఆయన రాసిన సంభాషణలు నచ్చడంతో వాహినీ వారు తమ స్వర్గసీమ’ (1943) చిత్రానికి చక్రపాణి చేత రచన చేయించడంతదనంతర కాలంలో తమ సంస్థకు భాగస్వామిని చెయ్యడం కూడా జరిగింది.
మదనపల్లి శానిటోరియంలో చికిత్స పొందుతుండగా ఒక బెంగాలి బాబుతో సాంగత్యం పెరిగి వారి భాషను నేర్చుకొన్న చక్రపాణిప్రముఖ బెంగాలీ రచయిత శరత్‌చంద్ర ఛటర్జీ సాహిత్యాన్ని సరళమైన చక్కని తెలుగు భాషలోకి అనువదించడం మొదలెట్టారు. వాహినీ వారికి బి.ఎన్‌.ప్రెస్‌ ఉండటంతోతన పుస్తకాల ముద్రణ అందులో చేయించడం, ‘చందమామ’ (1947) పత్రికకు సంపాదకత్వం వహించడంతో శరత్‌ నవలలు తెలుగు తెరకు ఎక్కించే ప్రయత్నాలు జరిగాయి. 1948లో శరత్‌ నవల నిష్కృతి’ ఆధారంగా తెలుగులో మనదేశం’ చిత్రం నిర్మితమైంది. దేవదాసును తెలుగులోకి అనువదించి ఉండకపోతే.. ఆ సినిమా తెలుగు ప్రేక్షకులని అలరించి ఉండేదే కాదేమోవిశ్వజనీనత మూర్తీభవించే ఆవేదన నింపిన ఒక సజీవ పాత్ర దేవదాసు. అక్కినేని నాగేశ్వరరావు నటజీవితాన్ని మలుపుతిప్పిన అపురూప పాత్రల్లో దేవదాసు ఒకటి. జూన్‌ 26, 1953న విడుదలైన దేవదాసు’ చిత్రం 400 రోజులు పైగా ఆడి వజ్రోత్సవం జరుపుకొంది. ఈ చిత్రం ఇప్పుడు 67 సంవత్సరాలు పూర్తి చేసుకొంది. ఆ సినిమా అజరామరం..నిత్య నూతనం.

నిర్మాణ సాహసం
దేవదాసు నవలను శరత్‌ తన 16వ ఏట రచించారు. ఈ నవలను మొదట 1890 ప్రాంతంలో శిశువు’ అనే లిఖిత పత్రిక ప్రచురించింది. ఈ నవలలో చెడుని ఆకర్షణీయంగా మలిచి పొరపాటు చేసినట్లు శరత్‌ భావించడంతో దాని ప్రచురణకు ఆయన అంగీకరించలేదు. అందుకే ఈ నవల రాత ప్రతిని తన మిత్రుడు సౌరేంద్ర దగ్గర భద్రపరిస్తేఅతడు శరత్‌ ఇతర రచనలతోపాటు దేవదాసు నవలకు కూడా పుస్తకరూపమిచ్చాడు. ఈ నవలను చక్రపాణి సరళమైన తెలుగు భాషలోకి అనువదించి తన ఆంధ్రజ్యోతి’ పత్రికలో ధారావాహికంగా ప్రచురించారు. 1928లో దేవదాసు నవల బెంగాలీ మూకీ చిత్రంగా వచ్చింది. అదే నవలను 1935లో న్యూ థియేటర్స్‌ వారు పి.సి.బారువా దర్శకత్వంలో బెంగాలీహిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మించారు. దాంతో దేవదాసు’ చిత్రం దేశమంతటా తెలిసింది. బెంగాలీ చిత్రంలో బారువా నటిస్తేహిందీలో కె.ఎల్‌.సైగల్‌ దేవదాసుగా నటించారు.
1949 చివరన నిర్మాత డి.ఎల్‌.నారాయణ వినోద పిక్చర్స్‌ స్థాపించి సముద్రాలవేదాంతం రాఘవయ్యసుబ్బారామన్‌లను భాగస్వాములుగా చేర్చుకొని అక్కినేనిఅంజలీదేవిలతో వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో స్త్రీ సాహసం’ (1951) అనే జానపద చిత్రాన్ని తీసి విజయం సాధించారు. మలి ప్రయత్నంగా దేవదాసు నవలను చిత్రంగా తియ్యాలని సంకల్పించి 07-11-1951న రేవతి స్టూడియోలో డి.ఎల్‌. నారాయణ ప్రారంభ పూజ కూడా నిర్వహించారు. నిర్మాత కార్యక్రమాలు మొదలయ్యాయి. ఒకటి రెండు మినహా అన్ని పాటల రికార్డింగ్‌ జరిగింది. సముద్రాల స్క్రిప్టు సిద్ధం చేశారు. షూటింగ్‌ ప్రారంభ దశలోనే సంగీత దర్శకులు సుబ్బురామన్‌ 27-06-1952లో హఠాన్మరణంతో చిత్ర నిర్మాణం ఆగిపోయింది. దాంతో చిత్రసీమలో కలకలం రేగింది. శరత్‌ సృష్టించిన దేవదాసు పాత్రకు జానపద పాత్రలు వేసే అక్కినేని పనికిరారనినృత్య దర్శకుడిగా ఉన్న వేదాంతం రాఘవయ్య ఇటువంటి చిత్రానికి దర్శకత్వం వహించడం దుస్సాహసమే అవుతుందని విమర్శలు వెల్లువెత్తాయి. సుబ్బురామన్‌ మరణం అశుభ సూచకంగా ప్రచారమైంది. ఈ విమర్శలు నిర్మాతల్లో పట్టుదలని పెంచడం కాకుండా దేవదాసు చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించడానికి ఉపయోగపడ్డాయి.

అంకిత భావం
ఎట్టకేలకు దేవదాసు’ చిత్ర నిర్మాణం ప్రారంభమైంది. మద్దిపట్ల సూరితో బెంగాలీ మూలంలోని దేవదాసు పాత్ర స్వభావం ఎలా ఉన్నదో చర్చించారు. మల్లాది రామకృష్ణ శాస్త్రిసలహాలుసూచనలు పాటించారు. చిత్ర కథనాన్ని ఒక పవిత్ర యుజ్ఞంగా భావించి అద్భుతమైన చిత్రానువాదానికి సముద్రాల శ్రీకారం చుట్టారు. డి.ఎల్‌.కి అక్కినేని నటన మీద ఎంతో నమ్మకం.
విమర్శలకు జడవలేదు. పార్వతి పాత్రకు భానుమతిని తీసుకోవాలనుకున్నారు. ఆమెకి చెందిన భరణీ స్టూడియోలో డి.ఎల్‌ గతంలో ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పనిచేసి ఉండటంఆయన తీసే సినిమాలో నటించడం అవమానంగా భావించి భానుమతి ఆ పాత్రను తిరస్కరించింది. తరువాత షావుకారు జానకిని తీసుకుంటే కాల్‌షీట్లు కుదరక ఆమె తప్పుకుంది. చివరకి తమ శాంతి’ చిత్రంలో ఓ పాత్రలో నటించిన సావిత్రిని పార్వతి పాత్ర వరించింది. సావిత్రికి ఈ పాత్ర ఒక చాలెంజ్‌గా మారడంతో చక్రపాణి నవలని అనేకసార్లు చదివి పాత్ర స్వభావాన్ని ఆకళింపు చేసుకొని నటనకు సిద్ధమైంది. తిరువాన్కూర్‌ సోదరీమణులలో పెద్దదైన లలితకి చంద్రముఖి పాత్రపేకేటి శివరాంకి భగవాన్‌ పాత్రయస్‌.వి.రంగారావుకి దేవదాసు తండ్రి పాత్రసి.యస్‌.ఆర్‌కి ముసలి జమీందార్‌ భుజంగరావు పాత్రదొరస్వామికి పార్వతి తండ్రి నీలకంఠం పాత్రఆరణి సత్యనారాయణకి దేవదాసు నౌకరు ధర్మన్న పాత్రసురభి కమలాభాయికి నీలకంఠం తల్లి పాత్ర దక్కాయి.
ఈ చిత్ర కథావస్తువు సాధారణమైనదే! ఒక పేదింటి చిన్ననాటి నేస్తాన్నిపొరుగింటి జమిందారు కొడుకు ప్రేమిస్తాడు. ఆస్తి అంతస్తుకి ప్రాధాన్యమిచ్చే జమిందారు వారి పెళ్లికి అంగీకరించడు. జమీందారీ కుటుంబ కట్టుబాట్ల వల్ల తండ్రి మాటకు ఎదురు చెప్పలేని దేవదాసు ఇల్లు విడిచి వెళ్లిపార్వతిని మరువలేక తాగుడికి బానిసై మానసిక వ్యధకు గురవుతాడు. తండ్రి పట్టుదల వలన పార్వతి ఒక ముసలి జమిందారుకి భార్య అవుతుంది. భగ్న ప్రేమికుడైన దేవదాసు మనసుకు శాంతి కరువై పార్వతికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి అతి కష్టం మీద వారి ఊరుచేరుకొని ఆమె బంగళా సమీపంలోనే మాట పడిపోయిన స్థితిలో మరణిస్తాడు. విషయం తెలుసుకున్న పార్వతి దేవదాసుని చూసేందుకు వస్తూ మూసిన తులపును ఢీకొని తను కూడా మరణిస్తుంది. ఈ చిత్రం చివర ప్రేక్షకులకి నేపథ్యంలో దర్శకుడు విన్నపాన్ని జోడించారు. ‘‘దేవదాసు లాంటి దిక్కులేని చావు పగవారికైనా వద్దు. మరణించే సమయాన కరుణామయమైన ఒక కరస్పర్శ నుదట సోకాలి. కనికరించి తన కోసం కన్నీరునించే ఒక ముఖమైనా తాను చూడాలి. అంతకంటే పెద్ద కోరిక అనవసరం. ఎప్పుడైనా దేవదాసు వంటి భగ్న జీవులు మీకు కనిపిస్తే వారిని ఏవగించకండి.. కనికరించండి’’ ఈ విన్నపంతో చిత్రం ముగుస్తుంది.

చిత్ర విశేషాలు
సముద్రాల సంభాషణల్లో సాధారణంగా నిడివి ఎక్కువగా ఉంటుంది. కానీ దేవదాసు’ చిత్ర సంభాషణలు కఠిన పదాలు లేకుండా వ్యవహారిక భాషలోనే నడుస్తాయి. అంచేత దేవదాసు కథ తెలుగునాటే జరిగిందన్న అనుభూతి ప్రేక్షకులకు కలిగింది. దేవదాసు’ సంభాషణలు సంస్కారానికి అద్దం పడతాయి. తాగిన మైకంలో ఉన్న దేవదాసుని నౌకరు ధర్మన్నచంద్రముఖి సాయంతో తీసుకొచ్చిన తరువాత నిద్రలోకి జారుకుంటాడు. ఉదయం కాఫీ ఇచ్చిన చంద్రముఖితో మొదటిసారి సుదీర్ఘంగా దేవదాసు మాట్లాడతాడు. ‘‘నీ పేరు చిన్నది చేసి అమ్మీ అని పిలుస్తాను’’ అంటాడు.
‘‘రాత్రి నాకు పరిచర్యలు చెయ్యడం గుర్తించాను. ఈ పట్నంలో నువ్వు తప్ప నాకీ సేవ ఎవరు చేస్తారా అనుకున్నాను. ఇంత భక్తి శ్రద్ధలతో నన్ను సేవించడానికి నేను నీకు ఎవరిని అమ్మీ’’ అంటాడు. ‘‘ఇహానికీ పరానికీ మీరే నా దేముడు’’ అంటుంది చంద్రముఖి. ‘‘పార్వతినేను ప్రేమించుకున్నాం. దాని వల్ల ఎన్నో కష్టాలు అనుభవించాం. నన్ను నమ్ముకుంటే నువ్వూ బాధలు పడతావు సుమా’’ అంటూ హెచ్చరిస్తాడు. ‘‘ఆ బాధలే నాకు ఆనందం’’ అని చంద్రముఖి అంటే ‘‘ఈ విషయంలో నువ్వుపార్వతి ఒక్కటే! కానీ ఆమెను అందరూ పూజిస్తారు. నిన్ను ఏవగిస్తారుపాప పుణ్యాలు విచారించే భగవంతుడు నీకు ఏమి శిక్ష విధిస్తాడో తెలియదు గానీమళ్లీ జన్మలో మనిద్దరం కలుసుకోవడం అంటూ జరిగితే నిన్ను విడిచిపెట్టి ఉండను’’ అంటాడు. ముఖ్యంగా పతాక సన్నివేశంలో డాక్టర్‌ చంద్రముఖితో దేవదాసు అట్టే రోజులు బతకడనిఅయిన వారిని రప్పించడంగానీలేదా వారున్న చోటికి వెంటనే పంపమని చెబుతాడు. దేవదాసు చంద్రముఖితో ‘‘డాక్టర్‌ ఏమన్నాడ’’ని ప్రశ్నిస్తాడు. ‘‘గాలి మార్పు కావాలి. మీ ఊరికి పదండి. నేనూ తోడుగా వస్తాను’’ అంటుంది చంద్రముఖి. దేవదాసు చంద్రముఖిని అనునయిస్తాడు. ‘‘వద్దమ్మీఅది మనిద్దరికీ పరువు కాదు. నన్ను చూసి లోకం నవ్వుతుంది. నిన్ను హీనంగా చూస్తుంది. ఆ మాట వింటే పార్వతి కుళ్లిపోతుంది’’ అని డబ్బు చేతుల్లో పెడతాడు. ‘‘మానవ దేహాలు స్థిరం కావమ్మీ. చివరకు ఎటూ కాకుండా పోతావేమో! ఉంచుకో’’ అని వేదాంతం చెబుతాడు. దేవదాసు సంస్కారవంతుడని ఈ సంఘటనలు రుజువు చేస్తాయి. పార్వతి తన ఊరికి ప్రయాణం కడుతుంది. దేవదాసుని తనతో తీసుకువెళ్లాలని. మనసు వికటించిన దేవదాసు పట్నం బయలుదేరుతాడు. పార్వతి ప్రయాణించే మేనాదేవదాసు జట్కా పక్కపక్క నుంచి వెళ్తాయి. విధివిలాసం అంటే...అనుకోనిది జరగడం అంటే ఎలా ఉంటుందో ఈ సన్నివేశంలో దర్శకుడు చూపిస్తాడు.

దేవదాసు’ చిత్రంలో పాటలన్నీ ఆణిముత్యాలే!
ఈ పాటల్ని హృదయంతో విని ఆకళింపు చేసుకుంటేనే ఆ విలువలు మనకి తెలుస్తాయి. సుబ్బురామన్‌ స్వరపరచిన అన్ని పాటలూ ఎంతో మార్దవంగా ఉంటాయి. ఆయన మరణాంతరం ఈ చిత్రానికి టి.కె.రామమూర్తి సహకారంతో సుబ్బురామన్‌ సహాయకుడు ఎం.ఎస్‌.విశ్వనాథ్‌న్‌ నేపథ్య సంగీతాన్ని అందించి చిత్రాన్ని పూర్తి చెయ్యడమే కాకుండా ‘‘జగమే మాయ’’, ‘‘అందం చూడావయ్యా’’ పాటల్ని తనే స్వరపరచారు. బి.ఎస్‌.రంగా ఛాయాగ్రహణ పనితనం ఈ చిత్రానికి హైలైట్‌. మేకప్‌మేన్‌ మంగయ్య అక్కినేనిని తీర్చిదిద్దిన విధానం ప్రశంసనీయం. చేతుల మీద నరాలు బొమికలు చిక్కినట్టు కనిపించేందుకు చేతి వేళ్ల సందుల్లో కూడా మేకప్‌ అద్దేవారు. ఈ చిత్రాన్ని తమిళంలో కూడా తీశారు. మధురైలో ఈ చిత్రం 65 వారాలు ఆడి రికార్డు సృష్టించింది.

ముందే చూసి ఉంటే...
దేవదాసు నవలని హిందీలో దిలీప్‌ కుమార్,  సుచిత్రాసేన్‌లతో 1955లో బిమల్‌ రాయ్‌ నిర్మించారు. దిలీప్‌ కుమార్‌ మాట్లాడుతూ..‘‘అక్కినేని నటించిన తెలుగు దేవదాసు’ చిత్రాన్ని ముందే నేను చూసివుంటే హిందీ చిత్రంలో నటించి వుండేవాడిని కాదు’’ అన్న వాక్యమొక్కటి చాలు తెలుగు దేవదాసు’ ప్రశస్తిని తెలుపడానికి. 1974లో నటుడు కృష్ణ దేవదాసు’ చిత్రాన్ని రంగులలో తీశారు. కానీ ఆశించిన విజయాన్ని ఆ చిత్రం అందుకోలేదు. ఒక క్లాస్‌ సినిమా మాస్‌ స్థాయిని కూడా ఛేదించి 18 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకోవడం ఒక అద్బుతమే!

***


No comments:

Post a Comment

Pages