ఆశ చావకపాయె..! - అచ్చంగా తెలుగు
'ఆశ చావకపాయె..!'
-సుజాత.పి.వి.ఎల్.గల్లీలలో పోరగాళ్ళ
ఆటలు బందాయె..
అమ్మలక్కలు ఒక్కదిక్కు చేరి
ముచ్చట్లాడకపాయె..
వారాంతపు సంతలు, జాతర్లు, 
లగ్గాలు..అస్సలే లేకపాయె..

నగరాల నుంచి సొంతూళ్లకు
పల్లె జనాలు పట్నాలకు 
వచ్చుడు పోవుడు ఏనాడో బందాయె..
ఆవారా లెక్క దినాం మొత్తం తిరుగే 
యువత బేజారయితిరాయె..
సుట్టాల్ రాకపాయే..

ఏడికాడికి సంబంధాలన్నీ తెగిపాయె..
గీ సిన్న వైరస్ తో ఇంత పరెషానాయే..!
గిప్పుడు..పొట్టకింత బువ్వ లేకున్నా,.
సేతులు మస్తుసార్లు కడుగుడాయె..
ప్రతొక్కడి అరసేతిలో..
చరవాణి  వార్తలాయె..

కోవిడ్ మరణాల సంఖ్య వింటుంటే 
గుండె బేజారయితున్నదాయె..
గింతంతుంది గాఁ..పురుగు..
ఎంత మందిని మింగినా.. ఇంకా
దాని ఆకలి తీరకపాయె..
ఏం సెయ్యాలో తెల్వకపాయె..
బతకాలనే ఆశ చావకపాయె..!!
****

No comments:

Post a Comment

Pages