హమారా జవాన్..! - అచ్చంగా తెలుగు
'హమారా జవాన్..!'
-సుజాత. పి.వి.ఎల్.సైనిక్ పురి,
 సికిందరాబాద్.


పత్ర హరిత దుస్తుల్లో
స్వేచ్ఛా శ్వాసకు కారకులైన
జవానులు మీరు..

దేశ ఎల్లల్లో మీ పహారా
మాకు రక్షణ కవచం..
మీరు అక్కడ కంటి మీద 
కునుకులేకుండా కాపలాకాస్తుంటే..
మేము  ఇక్కడ కంటి నిండా 
హాయిగా నిద్దుర పోతున్నాం..

శత్రు తూటాలకు ఎదురొడ్డిన మీ గుండె
లయబద్ధమైన మా గుండె చప్పుడుకు కారణం..

మేము లేక పోయినా మీరుంటారు..
కానీ, మీరు లేకపోతే ...
మేము ఒక్క క్షణం కూడా ఊపిరి తీసుకోలేము..

మీరు మా స్వాతంత్ర్య పరిరక్షకులు..!
కుతంత్ర దేశాల ఆగడాలను 
అడ్డగించే మానవ కంచెలు..!

మా ఊపిరిలో కొంత మీకు ధార పోస్తాం..
మా కోసం తిరిగొస్తామంటే..
మా భావనలు పుష్ప గుచ్ఛాలు చేసి అందిస్తున్నాం..
మళ్ళీ ఈ గడ్డపైనే జన్మించాలని..
హమారా జవాన్..హమేషా బల్వాన్.!!

******

No comments:

Post a Comment

Pages