వానా..‌. వానా... - అచ్చంగా తెలుగు
వానా..వానా..
-పి.వి.సుబ్బారాయుడు

వానచినుకుల ఆగమనానికి మురిసిన కళ్ల నుంచి చూపుల అభినందన గ్రీటింగ్ కార్డ్ లు వెల్లువెత్తుతున్నాయి. అక్కడక్కడ నీళ్లు నిలిచి ఏర్పడిన బుజ్జి తటాకాల్లో పసి హృదయాల్లో ఆనంద తరంగాలు
ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.
తిరుగాడుతున్న కాగితప్పడవలను చూసి లోలోపల శరీరాన్ని ఆప్యాయంగా
స్పృశిస్తున్న వాన చుక్కలకు
తన్మయులవుతున్నారు.
నడిరోడ్డున ప్రవహిస్తున్న
మురికినీళ్ల కాల్వలను
పైకి విసుక్కుంటూ దాటుతున్నా కొమ్మలు, రెమ్మలూపుతూ వృక్షాలు
ధన్యవాదాలు తెలుపుతున్నాయి.
తమకు తలంటి, దాహార్తిని తీర్చడానికి
ఆకాశాన్నుంచి జాలువారుతున్న నీళ్ళ ధారలకు
వర్ష రుతుశోభ ధరిత్రికి జీవం పోస్తుంది! ఇంద్రధనుసుతో అలంకరించి అందాన్నలముతుంది!! ***

No comments:

Post a Comment

Pages