ఘన తెలంగాణ..మన తెలంగాణ - అచ్చంగా తెలుగు

ఘన తెలంగాణ..మన తెలంగాణ

Share This
'ఘన తెలంగాణ..మన తెలంగాణ..!'
-సుజాత.పి.వి.ఎల్.



పది జిల్లాల ప్రజలు
పట్టినారు బ్రహ్మ రథం
కోటిన్నర జనులు
పట్టిరి తెలంగాణ పథం
కోటి గొంతుకలు
ఒక్కటై నినదిస్తూ
ఏకమైన చేతులు
బిగిసిన పిడికిళ్లు
వెలిగింది తెలంగాణ దీపం
అమరవీరుల త్యాగ ఫలం
ఉద్యమాల ఫలితం
తెలంగాణ సాధనం
తరతరాల చరిత గల తెలంగాణను
పొగడడం ఎవరి తరం..
సర్వ మత సామరస్య నిలయం..
తెలుగులో తొలి రామాయణ కర్త బుద్దారెడ్డి బోన

సహజ కవి బమ్మెర పోతన
వీర నారీమణి రుద్రమ
కొమురం భీమన్న లాంటి 

మహా మహులను గన్ననేల ఇది
రామాయణ మహాభారత..
చారిత్రక ఆనవాళ్ళున్న చారిత్రక ప్రదేశమిది..
మహాత్ముల తపః సంపత్తి వారసత్వం
కాకతీయ కళా తోరణం
చార్మినారు తెలంగాణ రాష్ట్ర చిహ్నం
తంగెడు పూలు, బతుకమ్మ , 

బోనాల పండుగ మా తెలంగాణ సొంతం..
అడవి తల్లి అందాల ఆదిలాబాద్
చదువుల తల్లి నిర్మల్ బాసర
నల్ల బంగారు ఖిల్లా మంచిర్యాల
బంగరుగని..సింగరేణి..
ఇన్ని ఉండ మాకేమి కొరత
మెతుకు సీమగ పేరున్న మెదక్ జిల్ల..
మరో తిరుపతి యాదాద్రి
రామయ్య కొలువైన భద్రాది..
గలగలపారే గోదారి ఇవే కదా మా కీర్తికిరీటాలు
కాళోజీ, దాశరధి, జయశంకరులు మొదలు
గద్దర్, గోరేటిలు ఈ చెట్టు చిగురు కోయిలలే
కలివిడి తనానికి ప్రతీక..
భారతావనికి తలమానికం..
తెలంగాణ
ఇక్కడి గడ్డపై పుట్టి గిట్టడం పూర్వజన్మ సుకృతం
అందుకే ఏదేశమేగినా, ఏ పీఠమెక్కినా..
ఘనంగా చాటతాను.. తెలంగాణ చరితను
*****



No comments:

Post a Comment

Pages