తరుణీ..నీకో వందనం!! - అచ్చంగా తెలుగు

తరుణీ..నీకో వందనం!!

Share This
తరుణీ..నీకో వందనం!!
 -సుజాత.పి.వి.ఎల్.


ఆకాశమంత
ఆత్మ గౌరవానికి
నిలువెత్తు రూపం..
విధి నిర్వహణలో
అవనిని మించిన
సామర్థ్యం..
కదన రంగంలో
ఖడ్గ తురంగ తీక్షణం
సమస్త లోక నీరాజన
జయ సంకేతనం..
కుంకుమ శోభిత
కుసుమ కాంచనం..
అశేష , విశేష జన
సంస్కార ఆధార పూజితం..
భువన భాండనమున
అఖండ కీర్తి కేతనం..
త్యాగా రుణ బాంధవీ
తరుణీ..నీకో వందనం..!!
***

No comments:

Post a Comment

Pages