జీవితం విలువ
                       -ప్రతాప వెంకట
సుబ్బారాయుడు 
అనుభవంతో తల
పండిందంటావు
సమస్యలతో అల్లాడే
మనిషికింత సాయం చెయ్యవు
బాధల్లో ఉన్న
వారికి అభయమవ్వవు
నీ అనుభవాన్ని
యువతకు మార్గంగా పరచవు
నీ పెద్దరికాన్ని
ఆకాశమంత పరచుకున్న వటవృక్షం చేసి 
ఎవరికీ నీడనివ్వవు
పెద్దతనమంటే
కేవలం ముదిమికి చేరువైన కాల గమనం కాదు
అది అందరికీ
ఆసరా కావాలి
బతుకులకు భరోసా
అవ్వాలి
ఇది తెలుసుకోకుంటే
నీ సుదీర్ఘ జీవితం
విలువ శూన్యం!
***
 

 


 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment