ఆవాల ఔషధీయ ఉపయోగాలు - అచ్చంగా తెలుగు
ఆవాల ఔషధీయ ఉపయోగాలు
అంబడిపూడి శ్యామసుందర రావు


ఆవాలు వంట ఇంటి దినుసుగానే కాకుండా ఆరోగ్యపరంగా దానికి ఉండే ఔషధీయ లక్షణాల వల్ల ఒక ఔషధీయ మొక్కగా ప్రసిద్ధి చెందింది. ఎన్నో ఏళ్లుగా ఆవాలను వంటయింటి దినుసుగాను, ఔషధీయ మొక్కగాను ప్రాచీన ఆయుర్వేద వైద్యములో ప్రస్తావించబడింది. ఆవాలు శరీరములో రక్తప్రసరణను ప్రేరేపిస్థాయి వేగముగా ప్రసరాణ అయేటట్లు చేస్తాయి. చాలా రకాల చిన్న పెద్ద జబ్బులకు అవాలు ఔషదంగా పనిచేస్తుందని శాస్త్రీయముగా రుజువు చేయబడింది.
వైద్య పరమైన ఉపయోగాలు కాకుండా సౌందర్య పోషణలో కూడా ఆవాలు ఉపయోగపడతాయి. ఉదాహరణకు పొడిచర్మాన్ని ట్రీట్ చేయటానికి దుర్గంధాన్ని తగ్గించటానికి, జుట్టును మృదువుగా ఉంచటానికి లాంటి అనేక ఉపయోగాలు ఆవాల వల్ల ఉన్నాయి అవేమిటో కొన్నింటిని తెలుసుకుందాము.
1. మీ పెరట్లో పెరిగే కలుపు మొక్కలను నివారించటానికి:-శాస్త్రవేత్తలు చెప్పినదానిని బట్టి తెల్ల ఆవాల నుండి వచ్చే స్రావాలు కలుపు లేదా పిచ్చిమొక్కల పెరుగుదలను అరికడతాయి. కాబట్టి పెరట్లో పూలమొక్కలను పెంచేటప్పుడు ఆ మొక్కల మధ్య ఒక గుప్పెడు ఆవాలను చల్లితే ఆమొక్కలు కలుపు మొక్కల
పెరుగుదలను అరికడతాయి. కొద్దిగా పెరిగిన వాటిని చేతితో తీసి వేయవచ్చు. ఆవాల మొక్కలను పెంచేటప్పుడు ఇతర మొక్కలకు ఈ మొక్కల వలన ఏమైనా హాని జరుగుతుందో ఏమో అని తెలుసుకొని పెంచాలి.

2. జ్వరము ఫ్లూ వంటి రోగాలనివారణకు :- ఆవాలను నీటిలో నానా బెట్టి సన్నటి
సెగమీద మరిగించాలి. ఆ కషాయానికి ఒక చెంచా ఆవాలు కలిపి మళ్ళా సన్న సెగమీద
ఒక 5 నిముషాల పాటు ఉంచి చల్లారినాక త్రాగితే జ్వరము ఫ్లూ వంటి రోగాలు
నయము అవుతాయి.

3. చెడు వాసనలను తొలగించటానికి: చాలా రకాల పదార్ధాలను ఆకర్షణీయమైన సీసాలో ప్యాక్ చేసి ఉంచుతారు. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే నిల్వచేసిన పదార్ధాల నుండి వచ్చే వాసనను తొలగించటం, అటువంటప్పుడు ఖాళీ అయిన, వాసనగా ఉండే సీసాలో  కొన్ని ఆవాలు వేడి నీరు కలిపి సీసాలో పోసి బాగా షేక్ చేసి ఆ నీటిని బయట పారబోస్తే ఆ వాసన పోతుంది.
4. వీపు నొప్పి తగ్గించటానికి: వీపు నొప్పి మన కదలికలను ఇబ్బందికరముగా చేస్తుంది. అటువంటప్పుడు వేడి ఆవాల స్నానము బాగా
ఉపయోగిస్తుంది. ఈ స్నానము  వీపు నొప్పికి మాత్రము కాకుండా బెణుకులకు, కండరాల నొప్పికి కూడా పనికి వస్తుంది. స్నానాల తొట్టిని  వేడి నీటితో నింపి 220 గ్రాముల ఆవాలను కలిపి బాగా కలియబెట్టి ఆ స్నానాల తొట్టిలో సుమారు 20 నిముషాల పాటు శరీరాన్ని ఉండనిస్తే వీపు నొప్పి లాంటి ఇతర
నొప్పులు తగ్గుతాయి. 

5. అలసిన పాదాలకు : బాగా ఎక్కువగా నడచినా లేదా శ్రమ పడ్డ కాళ్ళు వాయటము
లేదా నొప్పిగాఉండటం జరుగుతుంది. ఉపశమనము పొందటానికి రెండు చెంచాల ఆవాలను వెడల్పుగా ఉన్నపాత్ర లోని వేడి నీటిలో కలిపి నొప్పిగాఉండే పాదాలను ఒక
అరగంట ఉంచితే ఫలితము కనిపిస్తుంది అంటే నొప్పి లేదా వాపులు తగ్గుతాయి.

6 మోకాళ్ళ నొప్పులకు: కొంతమంది దీర్ఘకాలిక మోకాళ్ళ నొప్పులతో లేదా కొంతమంది ఏదైనా శారీరక శ్రమ చేసినప్పుడు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంటారు. అటువంటివారు ఆలివ్ ఆయిల్, ఆవనూనె ల మిశ్రమాన్ని నొప్పి ఉన్నచోట అంటే మోకాలి
జాయింట్ వద్ద మర్దన చేస్తూ ఉంటే ఉపశమనము కలుగుతుంది.

7. కండరాల నొప్పులకు : క్రీడాకారులు పెద్దవారికి తరచుగా కండరాల నొప్పులు
వస్తుంటాయి. దీనికి నీళ్ల తొట్టిలో కొన్నీ ఆవాలు,ఎప్సము (మెగ్నీషియం
సెల్ఫీట్) సాల్ట్ ను కలిపి ఆనీటిలో కొంచము సేపు ఉంటె నొప్పులు తగ్గుతాయి. ఆవాల ఔషధీయ  లక్షణాలను ఎప్సమ్ సాల్ట్ వృద్ధి చేస్తుంది.

8. గొంతు వాపుకు :- గొంతు నొప్పి లేదా వాపును తగ్గించటానికి ఆవాలు సహజ
పరిష్కారము. దీనికి ఆవాలను నిమ్మరసాన్ని ఒక చెమ్చాఉప్పును, ఒక చెమ్చాతేనేను  ఒక అరగ్లాసు నీళ్లలో కలిపి నీటిని మరిగించి, ఈ ద్రావణాన్ని చల్లారనిచ్చి ఒక పది నిముషాల పాటు పుక్కిలించాలి. అలాచేస్తే రెండు మూడు
రోజులలో మంచి ఫలితము కనిపిస్తుంది. ఏ రోజుకు ఆ రోజు ఈ ద్రావణాన్ని
తయారుచేసి వాడుకోవాలి.

9. చాతి బిగుసుకున్నప్పుడు: శరీరములో శ్లేష్మము పేరుకుపోయినప్పుడు ఆవాలు
బాగా పనిచేస్తాయి. 1:3 నిష్పత్తిలో ఆవాలను పిండిని కలిపి నీళ్లను కలిపి తయారైన పేస్ట్ ను ఒక గుద్దలో చుట్టి ఛాతి పై ఒక 20 నిముషాల పాటు ఉంచాలి. లేదా ఈ పేస్ట్ ను ఛాతిలో ఉండే ఎముకల గూడు ప్రాంతములో ఉంచాలి కొద్దిసేపటికి బిగుసుకున్నచాతి ఫ్రీ అయి ఉపశమనము కలుగుతుంది. సైనస్ వల్ల ఊపిరి
ఆడక బాధపడుతుంటే ఈ పేస్ట్ ను నుదిటిపై అప్లై చేయాలి. కొన్ని సందర్బలలో ఆవాలు చర్మముపై  ఎలర్జీ ని కలుగజేయవచ్చుకాబట్టి అటువంటి విషయన్ని గమనిస్తే ఈ రకము ట్రీట్మెంట్ను ఆపివేయాలి.

10. ఆవాలను కాస్మొటిక్ మాస్క్ గా వాడవచ్చు: ఆహారములోను లేదా ఔషధము గాను, మాత్రమే కాకుండా ఆవాలను చర్మసంరక్షణకు కూడా వాడవచ్చు. ఆవాలను నూరి పేస్ట్ లాగ చేసి ముఖానికి మాస్క్ లాగ వాడవచ్చు. ఈ పేస్ట్ ను ముఖంపై పలుచగా అప్లైచేసి, కొద్దీ నిముషాలు ఉంచి చల్లని నీటి తో కడిగేయాలి. అప్పుడు చర్మము మృదువుగాను ప్రకాశవంతముగాను ఉంటుంది. ఈ విషయములో కూడా ఆవాల వల్ల ఎలర్జీ
వస్తుందేమో గమనించి వాడాలి.

****

No comments:

Post a Comment

Pages