శక్తి - అచ్చంగా తెలుగు
శక్తి 
పావని యనమండ్ర 



కనురెప్పల సవ్వడి వినపడుతోందా 
గుండె చప్పుడు కనుగొనగలవా 
మౌనం వీడు మిత్రమా !

గొంతెత్తి నీ గళాన్ని నలుగురికి వినిపించు 
నీవు ఆడపిల్లవని నిన్ను చూసి అడిగిందా 
కాలానికి నువ్వు ఎదురు తిరుగలేవు అనుకున్నావా 
శిరస్సు వంచి నిన్ను వెనుక నడమన్నదా?

అమ్మ పేరులో ఎంత పేరు ఉన్నదో 
అమ్మాయి గుండెలో నీకు అది కనపడలేదా ?
బయటికి వస్తే జాగ్రత్త అని హెచ్చరించిందా ?
లేక నువ్వే మారిపోతావని భయపడిందా ?

"నీకు జాగ్రత్త అని చెప్పే " మీ అమ్మ 
ఎవరికి తలదించకమ్మ అని చెప్పాడా మరి నాన్న!
ఏది నిజం ? తల్లి చెప్పేమాట నిజామా ?
తండ్రి చూపించిన నీతి నిజామా ?

కలలు కన్న ఓ హృదయం 
ఎగిరి , అలిసి, సొలసి చివరికి ఎక్కడికి నీ పయనం ?
భయం అనే పంజరం వీడి 
ఒక్కసారి నీ మాటను నలుగురి ఎదుట పెట్టి 
నిలబడి అలికిడిచేసే  నీ కాలి అందెల సవ్వడి కి 
ఝడిసి , ఎలుగెత్తి చాటమ్మ !

"నువ్వు లేనిదే ఈ పృథ్వి లేదు 
నువ్వు లేనిదే ఈ జననమరణాలు లేవు 
సృష్టి స్థితి లయలు లేవు 
కనుకొన్నావా నీవెవరని 


నీ కను సైగే ఒక దిశ 
నీ చిరునవ్వే ఒక ఆశ 
నీ ఆగ్రహం ఒక వినాశనం 
నీ నిర్ణయమే ఒక శాసనం 
నీ పుట్టుకే పుడమికి అందం!
నీ కంటతడి భూమికి ప్రళయం 
శాసించు !శాంతించు !శ్రమించు!


ఇదే నీ పోరాటం !!!!!!
ముందుకే గాని వెనకడుగు వేయకు
నీకు నీవే ఒక గెలుపు
నీ పుట్టుకే ఒక పిలుపు
నీ వెంటఉన్న నీ వెనకున్న
నిన్ను నడిపించేది నేనే

అమ్మా, అక్కా, చెల్లా, నేస్తమా, నీ నీడలా
ఎవరేమైనా నేను ఒక అస్త్రం
ప్రేమ తో పలకరించు
జాలి దయతలచకు
ఇదే నా తుది హెచ్చరిక
తస్మాత్ జాగ్రత్త !!!!!!!!!!!!!!!!!!!!!

***

No comments:

Post a Comment

Pages