రాష్ట్రపతి అధికారిక నివాసము ఢిల్లీ లోని "రాష్ట్రపతి భవన్ " - అచ్చంగా తెలుగు

రాష్ట్రపతి అధికారిక నివాసము ఢిల్లీ లోని "రాష్ట్రపతి భవన్ "

Share This
రాష్ట్రపతి అధికారిక నివాసము ఢిల్లీలోని  "రాష్ట్రపతి భవన్ "
అంబడిపూడి శ్యామసుందర రావు  



భారత దేశములోని పెద్ద నివాస యోగ్యమైన నివాస గృహము రాష్ట్రపతి భవన్ అలాగే ఈ రాష్ట్రపతి భవనము  ప్రపంచములోని రెండవ పెద్ద నివాస గృహము ఈ భవనము భారత రాష్ట్రపతి యొక్క అధికారిక భవనము ఇది ఢిల్లీ లోని రాజ్ పథ్ కు పశ్చిమ దిక్కున ఉంటుంది  ఈ భవనంలోనివాసము ఉన్న మొదటి భారతీయుడు శ్రీమాన్ చక్రవర్తుల రాజగోపాలా చారి అంటే మొదటి భారతీయ వైస్రాయి ఈ భవనాన్ని బ్రిటిష్ వారు వారి ప్రతినిధి వైస్రాయి నివాసము కోసము కట్టించారు ఆ పరంపరలో రాజగోపాలాచారిగారికి వైస్రాయి హోదా వల్ల అక్కడ నివాసము ఉండే అదృష్టము పట్టింది. స్వాతంత్రము తరువాత భారత ప్రభుత్వము ఆ భవనాన్ని దేశములోని అత్యున్నత పదవి అధిష్టించిన రాష్ట్రపతికి నివాస గృహముగా కేటాయించారు ఆ విధముగా మొట్టమొదటి రాష్ట్రపతి అయినా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ భవనంలో నివాసము ఉండేవారు.
రాష్ట్రపతి భవనము 321ఎకరాల స్థలములో విస్తరించి ఉంది. ఈ భవనము నాలుగు అంతస్తులతో ,340 గదులతో ఉంటుంది.ఈ భవన నిర్మాణము పూర్తి అవటానికి 17 సంవత్సరాలు (1912 నుండి 1929) పట్టింది. ఈ భవన నిర్మాణములో సుమారు 29000 వేల  మంది పనివాళ్ళు పాలు పంచుకున్నారు ఈ భవన నిర్మాణానికి 700 మిలియన్ల ఇటుకలు మూడు మిలియన్ల ఘనపు అడుగుల రాయి కొద్దీ పాటి ఉక్కును ఉపయోగించారు ఈ అబ్దుతమైన భవన నిర్మాణ రూప కర్త (ఆర్కిటెక్ట్) ఎడ్విన్ లుటీఎన్స్ ఈ భవనము లోని సమావేశ మందిరములో  104 మంది అతిధులు ఒకే సారి కూర్చునే అవకాశము ఉంది.
ప్రతి శనివారం ఉదయము పది గంటలకు రక్షక భటులు కవాతు చేస్తూ వారి డ్యూటీలు మారుతారు ఈ డ్యూటీలు మారే కవాతు అరగంట సేపు సాగుతుంది.
ఈ రాష్ట్రపతి భవనము లోని మరో ప్రత్యేక ఆకర్షణ 15 ఎకరాలలో విస్తరించిన "మొఘల్ గార్డెన్స్" ఈగార్డెన్స్ ను ఉద్యనోత్సవ సమయములో .అంటే ప్రతి సంవత్సరము ఫిబ్రవరి మార్చ్ మధ్య కాలములో  ప్రజలను సందర్శనార్ధము అనుమతిస్తారు. ఈ గార్డెన్స్ లో 159 రకాల గులాబీ మొక్కలు,70 రకాల సీజనల్ పూల మొక్కలు, 60 రకాల భోగన్  విల్లై పూల మొక్కలు, 50 రకాల పండ్ల చెట్లు  ఉన్నాయి దర్బార్ హాల్ లో 4-5 శతాబ్దాల కాలమునాటి గౌతమ బుద్దిని శిలాప్రతిమ ఉంది  ఇండియా గెట్ వద్ద గల అయిదవ కింగ్ జార్జ్ విగ్రహము ఎంత ఎత్తు అయితే ఉందొ అంటే ఎత్తులో ఈ శిలా ప్రతిమను ఏర్పాటు చేశారు సుమారు 640 కేజీల బరువు ఉన్న ఐదవ జార్జి వెండి సింహాసనమును రాష్ట్రపతి భవనము లోని బహుమతుల మ్యూజియం లో ఉంచారు .ఈ మ్యూజియం ను 2014 జులైలో అప్పటి రాష్ట్రపతి ప్రణాబ్ ముఖర్జీ ప్రారంభోత్సవం చేశారు   ఈ మ్యూజియం లో రాష్ట్రపతి విదేశ పర్యటనలలో ఇతర దేశాధ్యక్షులు బహుమతిగా ఇచ్చిన కానుకలు ఉంటాయి ఎందుకంటే అవి వ్యక్తి గత బహుమతులు కావు  దేశాధ్యక్షుని హోదాలో తీసుకున్నవి రాష్ట్రపతి భవనంలో ఉన్న హాల్స్ లో దర్బార్ హాల్ అశోక హాల్ చాలా ప్రాధాన్యత కలిగినవి ఏ ఫంక్షన్స్ జరిగిన ఈ హాల్స్ లోనే జరుగుతాయి. దర్బార్ హాల్ మెయిన్ బిల్డింగ్ లో నేరుగా డబుల్ డోమ్ క్రింద ఉంటుంది అంటే స్వాతంత్రానికి ముందు ఇది సింహాసనము ఉండే హాల్ అన్నమాట.అప్పట్లో  ఈ హాల్ లో రెండు సింహాసనాలు ఒకటి వైస్ రాయ్ కి రెండవది వైస్ రాయ్ భార్యకు ప్రస్తుతము ఒకటే సింహాసనము లాంటి కుర్చీ ఉంది. కుర్చీ పైన 2 టన్నుల షాన్ డీలియర్ 33 అడుగుల ఎత్తులో 23 మీటర్ల తాడుతో కట్టబడి ఉంటుంది. ఈ హాల్ లోని ఫ్లోరింగ్ చాకొలేట్ రంగు లో గల ఇటాలియన్ మార్బుల్స్ తో ఉంటుంది.దర్బార్ హాల్ లోని స్తంభాలు జైసాల్మేర్ నుండి తెచ్చిన పసుపు రంగు మార్బుల్స్ తో చేయబడ్డాయి. ఈ స్తంభాల మధ్య ఉండే గీత ఈ హాల్ ను రెండు సమ భాగాలుగా చేస్తుంది. ఈ దర్బార్ హాల్ లో 500 మంది కూర్చునే అవకాశము ఉంది. మొదటి ప్రధాని జవహర్ లాల్ ప్రమాణ శ్వీకారోత్సవము ఈ హాల్ లోనే జరిగింది
రెండవది అశోక హాల్ ఇది దీర్ఘ చతురస్రాకారము(32 x 20) లో ఉంటుంది దీనిని చక్కఫ్లోరింగ్ తో బాల్  రూమ్ గానిర్మించారు ఈ హాల్ లోని సీలింగ్ పర్షియన్ పెయింటింగ్స్ ఈ హాల్ కు రాజసము ఉట్టిపడేటట్లు చేస్తాయి ఈహాల్ గోడలు ఫ్రెస్కో పెయింటింగ్స్ కలిగి ఉంటాయి. రెండు డ్రాయింగ్ రూములు, రెండు భోజనాల గదులు ఒక గ్రంధాలయము దర్బార్ హాల్ నాలుగు మూల ల ఉంటాయి ఇక్కడి డైనింగ్ రూమ్ అతి పెద్ద భోజనాల టేబుల్ ను కలిగి 104 మంది ఏకకాలంలో కూర్చుని భోజనము చేసే అవకాశము ఉంది. ఇవి కాకుండా బిలియర్డ్స్ రూములు,కూర్చునే వసతి కలిగిన రూములు మెట్లు ఉంటాయి.
రాష్ట్రపతి భవనము మధ్య్గల డోమ్ బ్రిటిష్ భారతీయ శిల్పకళలను ప్రతిబింబిస్తుంది ఈ డోమ్ ఖచ్చితముగా మధ్యలో ఉంటుంది,ఈ డోమ్ ఎత్తు బిల్డింగ్ ఎత్తు కన్నా రెండు రేట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ డోమ్ ఎత్తును లార్డ్ హెర్డీన్జ్ ఎత్తును పెంచాడు. బాహ్యముగా ఈ డోమ్ సాంచి లోని బౌద్ధ స్తూపమును పోలి వుంటుంది.
ఇతర విషయాలకు వస్తే రాష్ట్రపతి భవనంలోని వెలుగులు చిమ్మే నీటి ఫౌంటెన్ ఈ భవనంలో మంచి నీటి వసతి ఉంది ఎనిమిది మార్బుల్ సింహపు బొమ్మలు వైస్రాయ్ మెట్లకు సమీపాన ఆరు బేసిన్లలో నీటి ని  చిమ్ముతూ ఉంటాయి సహజ సూర్యకాంతి నేరుగా భవనంలోకి రావటానికి కొంతబాగము పై కప్పు లేకుండాఉంటుంది మొఘల్ గార్డెన్స్ లో రెండు నీటి కాలువలు ఉత్తరము నుంచి దక్షిణానికి ప్రవహిస్తూ ఉంటాయి రెండు కాల్వలు  తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహిస్తూ ఉంటాయి ఈవిధముగా మొఘల్ గార్డెన్స్ఈ కాల్వలతో నాలుగు భాగాలుగా విభజింపబడి ఉంటుంది. ఈ కాలువలు కలిసే చోట ఆరు కలువల ఆకారము లోని ఫౌంటైన్స్ ఉన్నాయి ఈ ఫౌంటైన్స్ నీటిని 12 అడుగుల ఎత్తువరకు చిమ్ముతాయి. ఈ కాలువల మధ్యలో ట్రేలలో ధాన్యము పక్షులకోసము ఉంచుతారు.
ఇంకో ఆకర్షణ టెర్రేస్ గార్డెన్ మరో ఆకర్షణ లాంగ్ గార్డెన్  లేదా పూర్థ గార్డెన్ ఇది మైన్  గార్డెన్ కు పశ్చిమముగాఉంటుంది దీని చుట్టూ 12 అడుగుల గోడ ఉంటుంది ఇదిపూర్తిగా గులాబీ తోట ఈ గోడలు రోజ్ క్రీపర్స్ గ్రేప్ వైన్స్ భోగన్  విల్లా మొక్కలతో కప్పబడి ఉంటాయి ఈ మొఘల్ గార్డెన్స్ లో బోన్సాయి మొక్కల కలెక్షన్ కూడా ఉంది.
ఇప్పటివరకు పదవులలో ఉన్న రాష్ట్రపతులు ఈ గార్డెన్స్ గురించి వ్యక్తి గత శ్రద్ద తీసుకొని వాటి నిర్వహణ విషయములో జాగ్రత్త వహించారు కాబట్టి ఈ గార్డెన్స్ భావితరాల వారు చూసి అందించే అవకాశము ఉంది ఈ విధముగా ప్రపంచములోని కట్టడాలతో ఒకటిగా భారత రాష్ట్రపతి భవన్ నిలిచింది.
***

No comments:

Post a Comment

Pages