ఈ దారి మనసైనది - 26 - అచ్చంగా తెలుగు
ఈ దారి మనసైనది - 26
అంగులూరి అంజనీదేవి 

(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన్విత. మన్విత, అనురాగ్ లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. అనురాగ్ తల్లి ప్రియబాంధవి మన్విత పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపిస్తూ ఉంటుంది.  జాతరకు వెళ్తారు, దీక్షిత, మన్విత, అనురాగ్, మిత్రులు. దీక్షితతో అనురాగ్ సన్నిహితంగా ఉండడాన్ని భరించలేకపోతుంది మన్విత. పల్స్ ప్రోగ్రాం టూర్ కి ఢిల్లీ, ఆగ్రా టూర్ వెళ్లి, ముగించుకుని తిరిగి వస్తారు. మెడికల్ కాలేజీ ఎక్సిబిషన్ కి వచ్చిన అనురాగ్ తల్లిదండ్రులకు అంతా తిప్పి చూపిస్తుంది దీక్షిత.)

ఆపరేషన్ చేసిన తర్వాత బి.పి. పల్స్ రేటు, రెస్పిరేటరి రేటు స్క్రీన్ మీద టి.వి.లో ఎలా కన్పిస్తుందో చూపించి జనరల్ ఎనస్టిసియా మరియు సి.పి. ఆర్ ఎలా చేస్తారో వివరించి....
మెడిసిన్ డిపార్ట్మెంటికితీసికెళ్లింది. మెడిసిన్ డిపార్ట్మెంట్లో...వివిధ వ్యాధులలో దేహములో వున్న భాగాలలో వచ్చే వివిధ మార్పులను (ఊపిరితిత్తుల క్యాన్సర్, అమిటిక్ లివర్, లివర్ సిర్రోనిస్, గుండె జబ్బులు, బి.పి) గురించి వివరించి....
సర్జరీ డిపార్ట్మెంట్లోకి తీసికెళ్లింది.
అక్కడ ....స్క్రీన్మీదకన్పిస్తున్న ఆపరేషన్ విధానము చూపించింది.
తర్వాత అక్కడ నుండి బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటికి తీసికెళ్లింది.
అక్కడ.... విటమిన్స్ కార్బొహైడ్రేట్స్, ప్రాటీన్స్, కొవ్వులు, ఏ విధంగా దేహానికి ఉపయోగపడతాయో అవి ఎక్కువయినా, తక్కువయినాఎలాంటి వ్యాధులొస్తాయో వివరించి.....
అదే విధంగా మూత్ర పరీక్ష ఎలా చేస్తారో, రక్త పరీక్ష ఎలా చేస్తారో తెలియజేసి....
శరీర ధర్మ శాస్త్ర విభాగమునకు తీసుకెళ్లింది.
 అక్కడ. శరీరములో వున్న వివిధ భాగాలు ఏ విధంగా పని చేస్తాయో, కొన్ని కారణాలవల్ల అవి పనిచెయ్యటం ఆగిపోతే ఎలా వుంటుందో సెల్ అనేది ఏ విధంగా ఫాం అవుతుందో వివరించి....
ఎస్.పి.ఎమ్ (క్రమ్యూనిటి మెడిసిన్స్) డిపార్ట్మెంట్లోకి తీసుకెళ్లింది.లోపలికితీసుకెళ్ళగానే PREVENTION IS BETTER THAN CURE అన్నస్లోగన్ కన్పించింది. అక్కడ.... పిల్లలకు టీకాలు సరైన సమయంలో వేయించడం,భారతదేశంలో వచ్చే వివిధ రకాలైన వ్యాధులు...  వాటిని ఎలా నయం చేస్తారో వాటి నివారణ చర్యల గురించి వివరించి...
FORENSI C MEDICINE (న్యాయ వ్యాధి శాస్త్రం) డిపార్ట్మెంట్కితీసుకెళ్లింది. అక్కడ.... అన్నిరకాలైన విషపూరిత పాములు, విషపదార్ధాలు, బుల్లెట్ మార్క్స్  గొడ్డలితో కొట్టినప్పుడు పగిలిపోయిన పుర్రె, చనిపోయిన చిన్న చిన్నబేబిస్, చంపటానికి ఉపయోగించే ఆయుదాలు, ఉరి వేసుకోటానికి ఉపయోగించే అన్ని రకాల తాళ్లు చూపించి ...
మాట్లాడే పుర్రె దగ్గరికి తీసుకొచ్చి కాసేపు పుర్రెతో ఫన్నీగా మాట్లాడి...
సీనాప్ క్రైమ్ రూంలోకి తీసికెళ్లింది.
అక్కడ .... ఒక శవాన్ని చూపించి గౌతమి ఎక్స్ ప్రెస్  కాలిపోయిన విధానము, అందులో కాలిపోయిన వాళ్ల ఎముకలు మిగిలిపోయిన విధానము, పూడ్చిపెట్టిన తర్వాత బయటకు తీసిన డెడ్ బాడీస్ ఎలా వుంటాయో చూపించి...
బాంబ్ స్క్యాట్స్ వున్న రూంకితీసికెళ్లింది.
అక్కడ .... పోలీస్ జాగిలాలు బాంబ్  ని ఎలా డిటెక్ట్చేస్తాయి, వాసన ఎలా పసిగడతాయి. అన్ని రకాల బాంబులు, వాటిని డిస్ఫోజల్ చేసే విధానము, అఫిషియల్స్ కార్ల క్రింద పెట్టే బాంబులు వాటిని ఎలా డిటెక్ట్ చేసి డిస్ఫోజల్చేస్తారోఅక్కడవున్న బాంబ్ స్వాట్స్ వివరించగానే దీక్షిత వాళ్లను తీసుకొని ఫార్మా కాలేజి డిపార్ట్ మెంట్ కి వెళ్లింది
అక్కడ ... డ్రగ్స్ (టాబ్లెట్స్) అవి పనిచేసే విధానము, వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి వివరించి....
మైక్రోబయోలజీ డిపార్ట్మెంటికి తీసికెళ్లింది అక్కడ... మల పరీక్ష రక్త పరీక్ష,తెమడ (ఉమ్మ) పరీక్ష అదే విధంగా మలేరియా రాకుండా మురికి నీటిలో పెంచే గంబూషియా  చేపలు చూపించి వాటి గురించి చెప్పి , మలేరియా నివారణ చర్యల గురించి వివరించి ....
పెధాలజిడిపార్ట్ మెంట్ దగ్గరికితీసికెళ్లింది...పెథాలజీలో.... ధైరాయిడ్గ్లాండ్లో వచ్చే వివిధ వ్యాధులు...ఊపిరితిత్తుల్లో వచ్చే వివిధవ్యాధులు, గుండెలో వచ్చే వివిధ వ్యాధులు . ఈ విధంగా బాడీలో వున్న వివిధ ఆర్గాన్స్ కి  వచ్చే వ్యాధులు, వాటిలో వచ్చే మార్పులు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించి....
చివరగా సామాజిక సృహ .. మూఢనమ్మకాలను నమ్మవదుఅంటూ ఏర్పాటు చేసిన ఓ చిన్న సన్నివేశాన్ని చూసి క్రిందకివస్తుంటే అనురాగ్ కలిశాడు.
అతను మామూలుగా లేడు. ఏదోగా వున్నాడు. మామూలుగా వుండటానికి ప్రయత్నిస్తూ
" ఓ.కె. మమ్మీ! అంతా చూశారా ? దీక్షిత బాగా ఎక్స్ప్లెయిన్ చేసిందా ? " అడిగాడు.
" చక్కగా చేసింది అనురాగ్ ! మా కాలేజీలో పిల్లలు ఈ మధ్యన రోజు ఈ ఎగ్జిబిషన్ గురించి చెప్పకుంటుంటే ఏమో అనుకున్నాను. ఇంత గొప్పగా వుంటుందనుకోలేదు. వీలుంటేమీ లాంటి విద్యార్థులేకాక మా లాంటి వాళ్లు కూడా చూడదగినది. చూసి తెలుసుకోదగినది ఈ ఎగ్జిబిషన్" అంది ప్రియబాంధవి.
***

No comments:

Post a Comment

Pages