నిఖార్శయిన మనిషి - అచ్చంగా తెలుగు
నిఖార్శయిన మనిషి
ప్రతాప వెంకట సుబ్బారాయుడుఎత్తైన గమ్యం చేరడానికి మెట్లెక్కడం 
సులువు..కాని లోయల్లోకి జారకుండా
శిఖరాలెక్కేవాడే నిజమైన విజేత

ఎన్నోసార్లు గెలిచిందానికన్నా
అన్నాళ్ల ఆటలోని మెళకువలను 
ఓడించి..ఎత్తిన కొత్త చేయి గొప్పది

అనుభవానికందని
సమస్యలనెదిరించి నిలిచేవాడు
అచ్చమైన ధీరోదాత్తుడు

జన్మించింది..నల్లేరు మీద బండి నడక జీవితం కోసం కాదు
నిత్య సవాల్లను ఎదుర్కోడానికే
అనుకునేవాడు నిఖార్శయిన మనిషి.
***

No comments:

Post a Comment

Pages