ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటి - వార్షికోత్సవ వేడుకలు - అచ్చంగా తెలుగు

ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటి - వార్షికోత్సవ వేడుకలు

Share This

ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటి  -   వార్షికోత్సవ వేడుకలు
ఓరుగంటి సుబ్రహ్మణ్యం ముంబాయిలో గత ఏడున్నర దశాబ్ధాలుగా విద్య,  సాంస్కృతి , సామాజిక రంగాలలో సేవలందిస్తున్న  ఏకైక తెలుగు సంస్థ - ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటి. 2019 వార్షికోత్సవల సందర్భంగా  ది. 23.11.2019 చెంబూర్ ఫైనార్ట్స్ ప్రాంగణంలో సంగీత విభావరి కార్యక్రమం నిర్వహించారు. హైద్రాబాద్ నుంచి వచ్చిన గాయనీ  గాయకులు  - శ్రీకృష్ణ, రమ్య బెహర, రఘురాం, భోగరాజు మోహన శ్రుతి - తమ శ్రావ్యమైన గాత్రంతో పలు సినీ పాటలు   ఆలపించి ప్రేక్షకులను అలరించారు.  
1943లో తొమ్మిదిమంది విద్యార్థులతో పాఠశాల  ప్రారంభించి అంచెలంచెలుగా  ఎదుగుతూ ఈనాటికి 4000లకు  పైగా విద్యార్థులకు  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మారుతున్న కాలానికి అనుగుణంగా మెరుగైన విద్యను అందిస్తున్నామని   సంస్థ అధ్యక్షులు సభికులకు తెలిపారు.
కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిధి రాజగోపల్ దేవర, ..ఎస్. మహారాష్ట్ర  ప్రభుత్వ  కార్యదర్శి, సంస్థ చేస్తున్న  సేవలను కొనియాడుతూ కార్యవర్గాన్ని అభినందించారు. హిందీ చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక ముద్రవేసుకున్న  హాస్య నటుడు  జానీలీవర్ గౌరవ అతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ  తానుకూడా  పాఠశాలలోనే చదువుకున్నానని గుర్తుచేసుకున్నరు. జానీలీవర్ తనదైన శైలిలో హాస్యగుళికలను వెదజల్లి ఆహుతులను కవ్వించి నవ్వించారు.  
సంస్థ కార్యవర్గం విచ్చేసిన అతిథులకు  కళాకారులకు శాలువా పుష్పగుచ్చంతో సన్మానించారు. వందన సమర్పణతో వార్షిక వేడుకలు ముగిశాయి.           
         
  ***

No comments:

Post a Comment

Pages