ముమ్మాటికీ... - అచ్చంగా తెలుగు
ముమ్మాటికీ..
-ప్రతాప వెంకట సుబ్బారాయుడు


నేను
మనసుకు ఎలాంటి తర్ఫీదునిచ్చానంటే
అది గతంలోని మంచినే స్పృశిస్తుంది కాని
చెడు తలుపు తట్టదు
అపకారం చేసిన మనిషి ఎదురైనా
మనసు లోపల్లోపల పొరలకు నెట్టేసిన భూతం
మొలకెత్తదు
కొత్త మనిషి కనిపిస్తే
ఓ చిరునవ్వు..నాలుగు చల్లటి మాటలు..
హృదయం నిండా మంచి పూల సుగంధమే!
మనం మనసుని మచ్చిక చేసుకుంటే
అది మంచి దారి చూపిస్తుంది
లేదంటే పతనానికి చేరుస్తుంది
మన జీవిత స్వర్గ నరకాలకి
మరెవ్వరో..మరేదో కారణం కాదు
ముమ్మాటికీ మనసే కారణం

***

No comments:

Post a Comment

Pages