రేడియో ప్రోగ్రామ్ లలోఅత్యంత ప్రజాదరణ పొందిన "బినాకా గీత్ మాల ". - అచ్చంగా తెలుగు

రేడియో ప్రోగ్రామ్ లలోఅత్యంత ప్రజాదరణ పొందిన "బినాకా గీత్ మాల ".

Share This
రేడియో ప్రోగ్రామ్ లలోఅత్యంత ప్రజాదరణ పొందిన  "బినాకా గీత్ మాల"
అంబడిపూడి శ్యామసుందర రావు


సుమారు 40 సంవత్సరములపాటు రేడియోలో అసంఖ్యాక శ్రోతలను అలరించిన రేడియో ప్రోగ్రాం "బినాకా గీత్ మాల "ఈ ప్రోగ్రాం అమీన్ సయాని మృదు మధురమైన స్వరము తో శ్రోతలను రేడియో ముందు కట్టి పడేసేది ఇదంతా టివిలు రాజ్యము ఏలక మునుపు మాట అప్పుడు సామాన్యుడికి ,ముఖ్యముగా మధ్యతరగతి మనిషికి వినోదాన్ని ఇచ్చేది రేడియో మాత్రమే అటువంటి రేడియో రేడియో ప్రోగ్రాములు పూర్తిగా కనుమరుగై అవన్నీ అలనాటి జ్ఞాపకాలుగా మిగిలిపోయినాయి.

అటువంటి రేడియో ప్రోగ్రాములలో 40 ఏళ్లపాటు సాగిన బినాకా గీత్ మాల ఒకటి ఈ ప్రోగ్రామ్ మన దేశములోనే కాకుండా సరిహద్దులు దాటి దక్షిణ ఆసియా మధ్య తూర్పు,తూర్పు ఆసియా దేశాలలో కొంత యూరోప్ లో కూడా ప్రజాదరణ పొందిన ప్రోగ్రామ్.  వారానికి ఒకసారి  అంటే బుధవారం రాత్రి 8 గంటలకు ఇంటిల్లిపాది రేడియో ముందు చేరి రేడియో సిలోన్ ను ట్యూన్ చేసి బినాకా గీత్ మాల ప్రోగ్రాం వినటానికి తయారుగా ఉండేవారు ముందు వచ్చే మ్యూజిక్ ఆ తరువాత వచ్చే పాటలకోసము వారము ఎదురు చూసేవారు అంటే ఆ ప్రోగ్రాం కు ఉన్న ప్రజాదరణ ఏంటో గుర్తించవచ్చు.

ముఖ్యముగా ఆ ప్రోగ్రాం ను ప్రెసెంట్ చేసే స్వరము అమీన్ సయాని ప్రజలను ఆహ్లాదపరిచింది.ఆ స్వరము పలకరింపు ప్రజలను వారి అలసట విసుగుల నుంచి దూరము చేస్తూ ఒక అర గంట ఆనందంలో ముంచెత్తేది.

"జిహా భాయీఓం ఔర్ బెహనో మై అప్కా దోస్త్ అమీన్ సయాని బోల్ రహాహుమ్ ఔర్ ఆప్ సున్ రహ బినాకా గీత్ మాల"(సోదర సోదరి మణులారా మీ మిత్రుడు అమీన్ సయాని ని మాట్లాడుతున్నాను మీరు బినాకా గీత్ మాల ను వింటున్నారు)అన్న పలకరింపుతో ప్రోగ్రాం ప్రారంభమయ్యేది. ఈ ప్రోగ్రాం 30 నిముషాలపాటు రేడియో సిలోన్ నుండి 1952నుండి 1989 వరకు 89 నుండి 94 వరకు అల్ ఇండియా రేడియో వారి వివిధ భారతి ద్వారా ప్రసార
మయేది.

ప్రస్తుతము 87 సంవత్సరాల వయస్సున్న అమీన్ సయాని వ్యక్తిగత వృత్తిపరమైన విశేషాలను తెలుసుకుందాము. ఈయన తండ్రి సేవాభవము కల డాక్టర్ తల్లి గాంధీ సిద్ధాంతాలను ప్రచారము చేసే సామాజిక కార్యకర్త ఈయన 1950 నుండి రేడియో జాకీయింగ్ లో ప్రవేశించాడు.సెయింట్ జేవియర్ కాలేజీలో చదువుతుండగా అమీన్ సయాని అల్ ఇండియా రేడియోలో హిందీ బ్రాడ్ కాస్టర్ గా అప్లై చేశాడు పెద్ద ఆశ్చర్యకరమైన విశేషము ఏమిటి అంటే ఈయన ఆ ఉద్యోగానికి తిరస్కరింప బడ్డాడు. కారణము ఈయన ఉచ్ఛరణలో గుజరాతి ఇంగ్లీష్ భాషల ప్రభావము ఎక్కవగా ఉన్నాదిట. ఈ విషయాన్నీ అమీన్ సయాని స్వయముగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పాడు.

నిరాశ చెందిన అమీన్ సయాని తన అన్న ,గురువు,రేడియో సిలోన్ లో ప్రొడ్యూసర్  అయినా హమీద్ సయానిని ఆశ్రయించాడు అప్పుడు అయన తమ్ముడికి రేడియో సిలోన్ లో హిందీ ప్రోగ్రాంలు  రికార్డింగ్ చేసేటప్పుడు వినమని సలహా ఇచ్చాడు. అదృష్ట వశాత్తు ఆ ప్రోగ్రాముల రికార్డింగ్ సెయింట్ జేవియర్ ఇన్స్టిట్యూట్ లో గల స్టూడియో లో జరిగినాయి. క్రమముగా అమీన్ సయాని బ్రాడ్ కాస్టింగ్ విద్యను క్షుణ్ణముగా నేర్చుకున్నాడు.

అమీన్ ను మొదట సారిగా గుర్తించింది రేడియో సిలోన్ లో ఓవల్టీన్ ఫుల్వారి
ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ అయిన బాల గోవింద్ శ్రీవాత్సవ్ అయన అప్పటికి ఓవల్టీన్ వాణిజ్య ప్రకటనకు గొంతు ఇస్తున్న వ్యక్తి గొంతుతో తృప్తి చెందని శ్రీవాత్సవ్ ప్రేక్షకుల్లో నుంచి ఎవరైనా వచ్చి వాయిస్ ఇవ్వగలరా అని అడగగా అమీన్ చెప్పటానికి ముందుకు వచ్చినప్పుడు స్క్రిప్ట్ ఇచ్చి చదవమన్నారు. అమీన్ బిగ్గరగా చదవటం మొదలు పెట్టేసరికి శ్రీవాత్సవ్ అసౌండ్ కి చెవులు మూసుకొని "ఇదేమి యుద్ధముకాదు"అని అంటాడు. రెండవ సారి ప్రయత్నములో అమీన్, శ్రీవాత్సవ్ ను సంతృప్తి పరచాడు.ఆ విధముగా అమీన్ జైత్ర యాత్ర రేడియో సిలోన్ లో ప్రారంభమయింది. ప్రతి వారము వాణిజ్య ప్రకటనలను చదివే వాడు. 

అప్పుడు మొదట ఆయనకు ఇచ్చిన పారితోషకం చిన్నఓవల్టీన్ డబ్బా అప్పటికే పాశ్చాత్య సంగీతముతో కూడుకున్న పాటల ప్రోగ్రాం "బినాకా హిట్
పెరేడ్ " ను దృష్టిలో పెట్టుకొని అలాగే హిందీ పాటలతో ప్రోగ్రాం తయారుచేయాలని అనుకున్నారు. ఈ ప్రోగ్రాం కు తక్కువ అనుభవము ఉంది.

స్క్రిప్ట్ తయారుచేసుకొని షో ని ప్రెసెంట్ చేయగలిగే వ్యక్తి కోసము వెతకటం ప్రారంభించారు. ఈ ప్రొగ్రమ్ ప్రెసెంట్ చేసే వ్యక్తి మధ్యలో శ్రోతల నుండి వచ్చే ఉత్తరాలను చదివి జవాబు ఇస్తూ పాటల పాపులారిటీని ఆ ఉత్తరాల ఆధారముగా వివరించాలి ఇంతా పనిచేస్తే వారానికి జీతము 25 రూపాయలే . అందుకే నిర్వాహకులు తక్కువ అనుభవము ఉన్నవాడి కోసము వెతకటం ప్రారంభించారు. ఇది ఎక్కువ కాకపోయినా ఇంతకూ మునుపు పారితోషకం ఒక ఓవల్టీన్ దబ్బకన్నా అమీన్ సయాని కి ఎక్కువే. మంచి ఆత్మవిశ్వాసముతో అమీన్ ముందడుగు వేసాడు. ఇంక అప్పటినుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు.
మొదటి షోకు 200 ఉత్తరాలు వచ్చినాయి రెండవ వారము షోకు 9000 ఉత్తరాలు క్రమముగా ఆ ఉత్తరాల సంఖ్య వారానికి 60,000 చేరింది. 2000 సంవత్సరము లో అడ్వర్ టైజింగ్ క్లబ్ వారి అబ్బే అవార్డు  ఈ శతాబ్దపు మోస్ట్ అవుట్ స్టాండింగ్ రేడియో ప్రోగ్రాం గా బినాకా గీత్ మాల కు వచ్చిందంటే ఈ ప్రోగ్రాం కు ఉన్న ప్రజాదరణను ఊహించవచ్చు.ఇది ఆ నాటి అడ్వర్ టైజ్ మెంట్ రంగములో ఒక మెయిలు రాయి.

ఈ ప్రోగ్రాం విషయానికి వస్తే ఈ ప్రోగ్రాం లో ఏడు సమకాలీన పాటలు వేసేవారు
ఆ తరువాత ప్రజాదరణ బట్టి రాంకులు  ఇచ్చి ఆ వరుస క్రమములో వేసేవారు. క్రమముగా శ్రోతల సంఖ్య  పెరగటం  మొదలైయింది అలాగే బినాకా గీత్ మాల సిబాక గీత్ మాల గాను ఆ తరువాత కాల్గెట్ సిబాక గీత్ మాల గాను స్పాన్సరర్లు మారటం వలన రూపాంతరము చెందింది. స్పాన్సరర్లు మారిన అమీన్ సయాని గొంతు మటుకు మారలేదు. ఎందుకంటే లక్షలాది శ్రోతలకు అమీన్ సయాని కేవలము ఒక రేడియో జాకీ మాత్రమే కాదు. ఒక స్నేహితుడు కావలసిన పాటలను వినిపించే నమ్మకస్తుడు వారి ఉత్తరాలలో లోని విషయాలను ఆత్మీయ సంభాషణలుగా చెప్పేవాడు. వారములో ఏ పాట నంబర్ వన్ గా ఉంటుందో అని పందేలు కూడా వేసుకునేవారు.

ప్రతి రాంక్ ను అమీన్ "పైదాన్"అనే వాడు ఇది బినాకా గీత్ మాల శిఖరము ఎక్కటానికి మెట్లు లాంటివి కొన్ని పాటలు ఓక  మెట్టు నుంచి మరో మెట్టుకు ఎక్కుతూ ఉండటం కొన్ని పాటలు క్రిందకు రావటము జరుగుతుండేది. అందువల్ల ప్రతివారం పాటల రాంక్ ల గురించి శ్రోతలలో సస్పెన్స్ నెలకొని ఉండెడిది. బినాకా గీత్ మాలలో నంబర్ ఒన్ పాటగా నిలవటం ఆ సినిమా నిర్మాతలకు సంగీత దర్శకులకు గర్వకారణముగా వుండేది.ఈ ప్రోగ్రాం పాపులారిటీ వల్ల రేడియో సిలోన్ వారు ఈ ప్రోగ్రాం ను అరగంట నుంచి గంట చేశారు ఇళ్లలో కాకుండా పబ్లిక్ ప్లేసులలో ఈ ప్రోగ్రాం వలన ట్రాఫిక్ జామ్ లు ఏర్పడేవి.

ఈ ప్రోగ్రాం వినటానికి ప్రజలు ఆ టైం కు ఎన్ని పనులున్నా అన్ని మానుకొని ఇళ్లకు చేరేవారు ఒక్క భారతదేశములోని కాకండా నాలుగు దశాబ్దాల పాటు పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్,శ్రీ లంక, వంటి ఏషియన్ దేశాలలో కూడా ప్రజాదరణ పొందిన రేడియో ప్రోగ్రాం అంటే బినాకా గీత్ మాలయే ఇంత  పాపులర్ ప్రోగ్రాం అందిస్తున్న బినాకా గురించి తెలుసుకుందాము. 

1951లో ఈ బినాకా పేస్ట్ FMCG బ్రాండ్ తో రెకిట్ బెంక్సెర్ కంపెనీ వారు ప్రవేశ
పెట్టారు 1970 వరకు ఈ పేస్ట్ బాగా పాపులర్ ఆ తరువాత కాల్గెట్, పెప్స్లోడెంట్ వంటి బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చి పాపులర్ అయినాయి బినాకా పేస్ట్ ఇంత పాపులర్ అవటానికి రేడియో ప్రోగ్రాం తో పాటు పేస్ట్ యొక్క నాణ్యత పేస్ట్ తో పాటు వారిచ్చే చిన్న చిన్న బొమ్మలు వాటర్ ప్రూఫ్ స్టిక్కర్లు పిల్లలను బాగా ఆకర్షించేవి. ఈ విధముగా రేడియో ప్రోగ్రాములలో అత్యధిక ప్రజాదరణ పొంది బినాకా పేస్ట్ బ్రషులు మార్కెట్ లో అత్యధిక అమ్ముడయి క్రమముగా తెరమరుగు అయినాయి కానీ ఆనాటి మధుర జ్ఞాపకాలలో బినాకా గీత్ మాల అమీన్ సయాని స్వరము  పాతతరము సంగీత ప్రియుల మదిలో నిలిచిపోయినాయి  ఆ తరువాత రేడియోలలో టీవీలలో అటువంటి ప్రోగ్రాం లు ఎన్నివచ్చిన బినాకా గీత్ మాలకు ఏది సాటి రాలేదు.
***

No comments:

Post a Comment

Pages