గుప్పెడు స్నేహం - అచ్చంగా తెలుగు

గుప్పెడు స్నేహం

Share This
గుప్పెడు స్నేహం
యలమర్తి అనూరాధ


లాన్ లో  కూర్చున్న 'స్నేహ' తెల్లని కాటన్ చీరలో పచ్చని చెట్టుకు పూసిన తెల్ల గులాబీలా ఉంది. పదిరోజులు ఊర్లో లేకపోవటంతో అన్నాళ్ళ నుంచి వచ్చిన ఉత్తరాలను చూసుకుంటోంది.
ప్రియమైన స్నేహా!
పక్క సందులో ఉండి కూడా, రాకుండా . ఉత్తరం రాస్తున్నావేమిటీలా  అని ఆశ్చర్యపోతున్నావా.  నిజమే. జీవితంలో మనం ఎన్నో ఆశ్చర్యాలు ఎదుర్కొంటాం. అందులో నీ పరిచయం ఒక వింత సంఘటనే. అది ఇలా నా ఊహలను, ఆలోచనలను తారుమారు చేస్తుందని, నన్నో ప్రముఖ రచయితగా నిలబెడు తుందని అనుకోలేదు. సహజంగా ఏ పని చేయాలన్నా ఎవరయినా ఏమయినా అనుకుంటారేమో అనుకొనే వాడ్ని, అదీ ఆడవారి విషయంలో మరీనూ! అలాంటి నన్ను  నీ స్నేహంతో, నీ మాటలతో మార్చగలిగావు.
నమాజంలో తప్పులుంటే వాటిని సరిదిద్దాలిగానీ, ఎవరో ఏదో అంటారని, మనం తప్పు చేయనప్పుడు ఎందుకు పడాలి? ఎందుకు మారాలి? అని ప్రశ్నించి నాలో ఆలోచనలను రేపావు . 'నా ఒక్కొక్క ఆలోచన ఒక్కో కథ రూపంలో వెలువడుతుంటే నువ్వు చిన్నపిల్లలా ఆనందించే దానివి. నీలో ఆ స్వచ్ఛతను చూసి , నేను ఎంత అబ్బురపడే వాడినో. 
స్నేహం గూర్చి ఎన్నో నవలలు, కవితలు, కథలు రాసారు కానీ అందులో ఆడ, మగ స్నేహంలో శృంగారాన్ని కలపని రచయితలు ఏ ఒక్కరో. అలాంటి రచనని గిన్నీస్ బుక్ లోకి ఎక్కించాలని నా కనిపిస్తుంది. మనిద్దరినే తీసుకో ఏనాడయినా నీ చేతి వేళ్ళనయనా నేను తాకానా? పొరపాటున తగిలినా అవి మా అమ్మస్వర్శలా ఆప్యాయంగా, మా చెల్లినన్ను తాకినట్లుగా ఉంటుంది. కానీ పిచ్చి పిచ్చి ఆలోచనలు రావే! మరి మన సమాజం ఎందుకు మన స్నేహానికి ఇన్నిఅవరోధాలు కల్పిస్తోంది? నీ చల్లని అప్యాయతతో ఒక మెట్టు పైకి ఎక్కుదామంటే నాలుగు మెట్లు కిందికి దింపే ఏదో సంఘటన. 
నీ పరిచయాన్ని ఒక మధురస్మృతిలా మిగుల్చుకుందామంటే ఎన్నో అవరోధాలు మరెన్నో ఇబ్బందులు. ఇంకెన్నో అడ్డంకులు, అనునిత్యం ఇలాంటివి ఎదుర్కొంటూ మనసు చితికి పోతుంటే - నీతో ప్రశాంతంగా ఎలా మాట్లాడను? నా మనసు చాలా సున్నితంగా ఇప్పటికే అనుభవాల అలల తాడికిడి హృదయపు అంచులుకి చిల్లులు పడి, రక్తం ధారలుగా ప్రహస్తోంది. ఇది ఏ నాడయినా ఖాళీ అయిపోవచ్చు. అనాడు నా మనసులో దాచుకున్న ఈ భావనలు నీకు అందించలేనేమో! అందుకే జీవితంలో ఎక్కడ ఆగిపోతానో, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియని నేను నీకు నా మనసు పుస్తకాన్ని చదువుకోమని ఇస్తున్నా! 
ఆరోజు నా మామూలు జీవితంలో స్నేహపు వెలుగులు విరిసిన రోజు. నేను స్కూలు నుంచి బయటకు వస్తున్నాను. సరిగ్గా రోడ్డు మీదకు వచ్చేటప్పటికి ఒకతను నాకు డేష్ ఇవ్వటం. వెనుక నుంచీ దొంగ, దొంగ అని నువ్వు అరుస్తు ఉందటం ఒకే సారి జరిగాయి. అతని చేతిలో హ్యాండ్ బాగ్, నీ అరుపులు నాలో ఆలోచనలకు తెరవేసి పరుగెట్టి అతని చేతిలో బ్యాగ్ని లాక్కొచ్చి నీ కిచ్చాను. అప్పుడు నీ కళ్ళలో ఎంతో కృతజ్ఞత. నిన్ను చూడగానే నాకు ఎన్నో ఏండ్ల పరిచయమున్నట్లు అనిపించింది, నీ పెదాల మీద చిరునవ్వు ఎదుటి మనిషిని అహింసావాదిగా మార్చగలదేమో అనే నా ఊహకు నాకే నవ్వు వచ్చింది. నీ కళ్ళలో కనిపించే అప్యాయతకు శిలలుకూడా కరుగుతాయేమో, ఆరోజు నీ మాటలు నేనెప్పటికీ మరిచిపోలేను.
" పేరు స్నేహ ఆ  స్కూల్ ఎదురుగుండా ఉన్న ఆ బ్యాంకులో ఈరోజే చేరాను. మరి మీరూ... అంటూప్రశ్నార్థకంగా చూసావు. నన్ను" నా పేరు అభిలాస్. నేను ఈ స్కూలులోనే అకౌంటెంట్ గా చేస్తున్నాను" అని చెప్పాను.
'అరె!" అయితే మనిద్దరం రోజూ కలిసే వెళ్ళవచ్చు. ఇంతకీ మీ ఇల్లెక్కడా?'
“చిట్టినగర్ బస్ స్టాప్ దగ్గర" 
“అరె! మా ఇల్లు కూడా ఆ సందే. కంపెనీ ఉంటే నడిచి వెళ్ళిపోవచ్చు. మీరు రోజూ బస్లో వెళతారా?
లేదు నడిచే అన్నాను.
మనసులో మనల్నిద్దరిని తెలిసినవాళ్ళే వరయినా చూస్తే అని భయం వేస్తోంది, ఆడపిల్ల ఆమె ధైర్యంగా కలిసి వెళదాం అంటే తను ఇలా భీతిల్లటం తెలిస్తే నవ్వుకుంటారేమోనని నన్నుచూస్తే నాకే సిగ్గు వేసింది ఆ క్షణంలో పది నిముషాలలో మీ ఇంటి దగ్గరకు వచ్చేసాం.
‘ఇదే మా ఇల్లు రండి, టీ తీసుకు వెళ్తురు గాని అని ఆహ్వానించావు.
ఇంకోసారి వస్తానని తిరస్కరించబోతే "పరవాలేదు రండి" అన్నావు. మొహమాట పడుతూ మీ ఇంట్లో అడుగు పెట్టాను.
ఆ తరువాతే తెలిసింది. నీకు కూడా నాకు లాగే నా మీద ఆత్మీయత కలిగిందని.
ప్లేన్ క్రాష్ లో  మీ వాళ్ళందరూ చచ్చిపోయారని నువ్వు ఒంటరి దానివని.తెలిసినపుడు నా బాధ వర్ణించలేను. నువ్వు నా కోసమే బ్రతికి ఉన్నావే మో! నిన్ను కూడా మా కుటుంబంలోకి ఆహ్వానించి ఎంతో అప్యాయంగా అవురూపంగా చూసుకోవాలనిపించేది. అది ఎలాగూ తీరని అందమైన కల. కనీసం రోజూ ఒక గంట నీ దగ్గర కూర్చోవాలనిపించేది. నేను రాకపోతే నువ్వు చాలా గొడవ చేసేదానివి. మన పరిచయం రోజునే విషయమంతా, నా భార్య రచనకు వివరించాను. ఆమె కూడా ఏమీ అభ్యంతరం చెప్పలేదు. అనుమానానికి తావివ్వని నా భార్య ఎంతో ఉత్తమురాలు అనుకున్నాను. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న నన్ను నేనే చూసుకొని గర్వపడేవాడ్ని.
కానీ మన వెనుక ఎంత మంది గుసగుసలాడేవారు. మీతోటమాలి రాజయ్య తప్ప అందరూ అన్ని మాటలన్నవారే. ఎందుకంటే నిజం తెలిసిన వాడు కనుక. లాస్లో ఒక గంట కలిసి కూర్చుని మాట్లాడుతున్నందుకు మనల్ని ఎందుకు ఇలా వెంబడిస్తున్నారు? లేని కళంకాన్ని ఎందుకు ఆపాధిస్తున్నారు అని మధనవదుతుంటే “అభీ! నీ భార్య అర్థం చేసుకొంది కదా అది చాలు మనకు. నాడబ్బు చూసి ఎందరో వల పన్నాలని చూసారు. వాళ్ళను తెలివిగా తోసిపారేసాను. నామనసుకు నచ్చే వ్యక్తి తటస్థపడితే పెళ్ళి చేసుకుంటాను. అంతవరకూ నాకు ఏదో వ్యాపకం ఉండాలని జాబ్ చేస్తున్నా తప్ప డబ్బు అవసరం లేదని నీకు తెలియదా! అలా నేను కాదన్న ప్రతి వాడూ ఏదో వాగుతుంటాడు. ఐడోంట్ కేర్ అయినా ఒక ఒక ఆడ మగ కలిస్తే అది తప్ప మరేమీ ఊహించని ఈ లోకంలో జనం గురించి నువ్వు మరచిపో. అమెరికాలో విశృంఖలాన్ని చూసి మనం నవ్వు కుంటాం. అసహ్యించుకుంటాం. కానీ వారిలో లైంగిక అనుభవానికి పెళ్ళికి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వరు. అదొక్కటే తప్ప వాళ్ళ పద్దతులు ఎంతో మంచివి ఒక ఆడ, మగ కలిసి ఒకే ఇంట్లో ఉన్నా, ఒక ఇంట్లో ఉండి ఎవరి బాయ్ ఫ్రెండ్ తో వాళ్ళు తిరిగినా పట్టించుకోరు. పెళ్ళి ఎంత తొంరదగా చేసుకుంటారో, విడాకులూ అలాగే ఈజీగా తీసుకుంటారు. కానీ మన సమాజం భర్త కొట్టినా, తిట్టినా, విడాకులు ఇవ్వటం పాపమని, పతి ధర్మమని ఆ మొగుడు చెడ్డ వారయినా, అతని తోనే ఉండి, అతని చేతిలోనే చచ్చిపొమ్మంటుంది.
తెగించి మొగుడిని వదిలేసిన ఆడదాన్ని బ్రతకనియరు. ప్రతి మగవారూ ఆమెను అనుభవిద్దామనే. ప్రతి ఆడదీ ఆమెలో తప్పు ఎప్పుడు పడదామా అని చూడటమే. కానీ చేయూత నివ్వరు. అలాంటి జనం మధ్య మన స్నేహాన్ని పవిత్రంగా చూడమని మొరపెట్టుకోవటం గోడతో మాట్లాడినట్లే. వదిలెయ్ వాసూ! అనేదానివి.  ఏదయినా నాకే బాధగదా! ఎవరూ పెళ్ళి చేసుకోరు. అలాటి అనుమానపు పక్షిని నేను చేసుకోను. ఎవరో వెధవలు వాగారని నువ్వు మాత్రం రావటం మానకు. నాకు పిచ్చిఎక్కుతుంది. అని అన్నావు మరోసారి.
కానీ ఎవరో నా భార్య మనసు విరిచేసారు. ఒక నెల నుంచి  నరకాన్ని అనుభవిస్తున్నాను. మీ ఇంటికి వెళ్ళవద్దని ఆమె,రాక పోతే ఉండలేనని నువ్వు, నా భార్య సంగతి తెలిస్తే నన్ను మీ ఇంటి దరిదాపులకు కూడా రానివ్వవు. నీ మనసు వెన్ననీ వలన మా సంసారంలో కలతలు, రేగుతున్నాయని తెలిస్తే నీవందించే గుప్పెడు స్నేహానికి కరువయి పోతాను. దాని కంటే ఈ ప్రపంచం నుంచి దూరంగా పారిపోవటం మేలు. ఏ తప్పు చేయని మన నిష్కలంకహృదయాలను బాధపెట్టె  హక్కు, ఈ జనాలకు ఎవరిచ్చారు? ". వీళ్ళంతా ఎప్పుడు మారుతారు. అప్పటి దాకా నేను యుద్ధంలో పోరాడగలనా? ఏనిమిషాన రాలిపోతానో! నువ్వు మీ పెద్దనాన్నగారి అమ్మాయి పెళ్ళికి వెళాపు, నాకెందుకో అదే ఆఖరి చూపు అనిపిస్తోంది. మళ్ళీ జన్మంటూ ఉంటే మనం మంచి స్నేహితులుగా కలకాలం నిలవాలని మన సమాజం హర్షించేలా ఉండాలని ఆశిస్తూ
నీ ప్రియ మిత్రుడు 
అభిలాష్.
"రాజయ్యా! అభి ఎప్పుడు ఇచ్చాడు నీకు ఈ ఉత్తరం?”
"మీ వెళ్ళిన రెండో రోజుమ్మా!" 
వెళ్ళి అభీని పిలుచుకురా! నాకు చూడాలని ఉంది.
"ఇంకెక్కడి అభిలాష్ బాబమ్మా, ఇప్పటికి ఆయన పోయి పదిరోజులయింది." 
"గుండె నొప్పితో పోయారటమ్మా! బోరుమన్నాడు. ఎంత ఆపుకుందామన్నా అపుకోలేని దు:ఖంతో "
"లేదు! నా అభి చచ్చిపోడు. అందరూ కలిసి చంపేసారు. అందరూ కలిసి చంపేసారు " అంటూ అలా పిచ్చిగా ఏడుస్తూనే ఉంది స్నేహ.
***

No comments:

Post a Comment

Pages