కడుపు, మనసు నింపిన లంచ్‌... - అచ్చంగా తెలుగు

కడుపు, మనసు నింపిన లంచ్‌...

Share This
కడుపు, మనసు నింపిన లంచ్‌...
నయీకషిశ్


చెరిష్‌ ఫౌండేషన్‌ అనాథ పిల్లలు, మీడియ సభ్యులకు లాడ్జ్‌ కీస్‌ సభ్యుల స్పెషల్‌ లంచ్‌...

విశాలమైన భవంతి... పెద్ద డైనింగ్‌హాలు.. చక్కగా సర్దిన ఆహార పదార్థాలు... ఆనందం, ఆహ్లాదంతో నిండిన వాతావరణం... ఆదివారం మధ్యాహ్నం ఇంతకన్నా ఎవరైనా కోరుకునేదేముంది..  చెరిష్‌ ఫౌండేషన్‌ అనాథ పిల్లలు, మీడియా మిత్రులు, లాడ్జి కీస్‌ సంస్థ సభ్యులంతా ఒకే టేబుల్‌ పై కలిసి భోజనం చేశారు.
ఆనందంతో పాటు సంతృప్తిని కలిగించే క్షణాలను మిగిల్చింది లాడ్జ్‌ కీస్‌ మెంబర్స్‌ ఏర్పాటు చేసిన లంచ్‌ కార్యక్రమం.

లాడ్జ్‌ కీస్‌ నెం.297 ఫ్రీమేనసరీ 25 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు లాడ్జ్‌ కీస్‌ వర్‌షిప్‌ఫుల్‌ మాస్టర్‌ జీ. అశోక్‌ కుమార్‌. "బీ ద రీజన్‌ సమ్‌వన్‌ స్మైల్‌.." ఒకరి చిరునవ్వుకి కారణమవ్వు.. అనేది  సిల్వర్‌ జూబ్లీ థీంగా ఎంచుకుని అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని లాడ్జ్‌ కీస్‌ 297 సెక్రటరీ డి.రాంచంద్రం తెలిపారు.

లాడ్జ్‌ కీస్‌కి చెందిన 300 ఏళ్ల నాటి ఘోషామహల్‌ బారదరీ మేసానిక్‌ భవంతిలో ఈ కార్యక్రమం ఆనందోత్సహాల మధ్య జరిగింది. ఈ కార్యక్రమంలో లాడ్జ్‌ కీస్‌కి చేందిన 30 కుటుంబాల వారు మీడియాకు చెందిన 15 మంది, చెరిష్‌ ఫౌండేషన్‌కు చెందిన 40మంది బాలబాలికలు పాల్గొన్నారు. లాడ్జ్‌ కీస్‌కి చెందిన అశోక్‌ కుమార్, సావిత్రి, వీరభద్రుడు, సునీత, వైభవ్, రామచంద్రం, కల్పన, రాకేశ్, పురుషోత్తం కౌశిక్, పికే సెహగల్, రమణ గుడిపాటి, రమేశ్‌ పాయ్, శ్రీనివాస్‌ గుండా, యశ్‌ తివారి, కిరణ్‌ కుమార్‌ మెతుకు, నాగరాజ్‌ బండమీది, అరుణ్‌ మెహ్తా, అజు అబ్దల్‌ కరీం, రమేశ్‌ కుమార్, మధుసూదన్‌ బొజ్జ. కె.హరి ప్రసాద్, లక్ష్మి నారాయణ, విజయ్‌ కె బీర్వల్, పీఎస్‌ రమేశ్, కె.వినోద్, ఎంవీవీ శేషు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

లాడ్జ్‌ 25 ఏళ్లు జర్నీ సందర్భంగా మంచిని ప్రోత్సహించకుండా మంచివారం కాలేం. మనుష్యులని మరింత మంచి మనుష్యులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేసే సంస్థ ప్రీమేసన్రీ. ఈ సంస్థ జంటనగరాల్లో రెండు వందల ఏళ్లుగా పనిచేస్తుండగా, వీటిలో అనేక శాఖలున్నాయి. అందులో లాడ్జ్‌ కీస్‌ 297 నవంబర్‌ 5, 1994 న ప్రారంభమైంది.
25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల6న గ్రాండ్‌ ఫంక్షన్‌ నిర్వహిస్తున్నామని సభ్యులు తెలిపారు. ఇందులో దక్షిణాది గ్రాండ్‌ మాస్టర్‌ అబ్రహం మార్కోస్‌ ముఖ్య అతిధిగా పాల్గొంటారని,  25 పాఠశాలల విద్యార్థులతో' బీ ద రీజన్‌ సమ్‌వన్‌ స్మైల్‌' కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు.



కోచింగ్‌ కోసం ఎదురు చూస్తున్న చెరిశ్‌ సంస్థ విద్యార్థులు...
చెంగిచెర్లకు చెందిన చెరిశ్‌ ఫౌండేషన్‌కు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఎంతో ఆనందంగా పాల్గొన్నారు. తమ పాటలతో, మాటలతో అందరినీ ఆకట్టుకున్నారు. 15 ఏళ్లుగా ఆశ్రమంలో ఉంటూ తాము అనుకున్న విద్య, ఉద్యోగం వైపు లక్ష్యంతో సాగిపోతున్న విద్యార్థులు తమ అశయాలను ఈ కార్యక్రమంలో పంచుకున్నారు. వీరిలో శైలజ, సుధ, రాధ, సుశీల, ఎస్తర్, లిలీ పుష్పా, మమత,ఇప్పటికే డిగ్రీ పూర్తి చేసుకుని టీచర్, ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు.

ఇప్పుడైతే డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగాలు చేసుకుంటూ పీజీలు చదువుతున్నామని. ఉన్నత ఉద్యోగాలు సాధించడానికి కావలసిన కోచింగ్‌ కోసం తాము ఎదురు చూస్తున్నామని, కోచింగ్‌ అందిస్తే ఐఏస్, కంపెనీ సెక్రటరీ, ఐఆర్‌ఎస్‌కి ప్రిపేర్‌ కావాలనే ఆశయంతో ఉన్నాం అని వారు మీడియాకు తెలియచేశారు.
***

No comments:

Post a Comment

Pages