జోక్స్ - అచ్చంగా తెలుగు
జోక్స్!
-ప్రతాప వెంకట సుబ్బారాయుడు


"ఆ సుబ్బారావు కారణ జన్ముడురా?"
"ఎలా చెప్పగలవు?
"వాళ్లావిడ సాధింపుల కోసమే పుట్టాడు"
***
"కృషితో నాస్తి దుర్భిక్షం అన్నమాట తప్పురా?"
"అదేంటి?"
"నేను పేకాటలో ఎంత కృషి చేస్తున్నా, దుర్భిక్షం తప్పడం లేదురా!"
***
"కంపెనీ వాటాదారుల సమావేశానికి మీ ఆవిడొచ్చిందేమిటి?"
"నాలో సగభాగమట అందుకనీ.."
***
"అబ్బాయి వెయ్యిళ్ల పూజారా? అంటే"
"కొరియర్ బాయ్"
***
"ఆయనెప్పుడు మౌనంగా ఉంటాడేమిటి?"
"వాళ్ళావిడ ఉంటే అంతే!"
"ఇప్పుడు ఇక్కడ లేదుగా"
"పర్సులో ఉందిగా"

***

No comments:

Post a Comment

Pages