అమ్మా! - అచ్చంగా తెలుగు
అమ్మా!
 భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.అమ్మా!
వడలిన నీతనువు వెనుక సడలని నీమనోనిశ్చయం
నాకుఅర్ధమవుతూనే ఉంది.
వెడలిన నీ గతవైభవం వెనుక విడువని నీమనోనిర్మలం 
నాకు అనుభవమౌతూనేఉంది.
కడలిని పోలిన నీ హృదయంవెనుక 
కొలతలకందని నీ కరుణారసం
నాతో ఆస్వాదితమౌతూనే ఉంది.
తరగని నీకలతల వెనుక చెరగనినీఆత్మవిశ్వాసం 
అభివ్యక్తమౌతూనే ఉంది.
మాటలాడలేని ఈఅశక్తతలోకూడా 
నీమనసు మూగగా మాకైచేసేప్రార్ధన
వినబడుతూనే ఉంది.
కానీ,ఇన్నాళ్ళుగా మాకోసమే జీవించి,
మౌనంగానే దీవించిన నువ్విప్పుడిలా
చివరిరోజుల్లో అనుభవిస్తున్నఈ నరకయాతన మాత్రం 
నా మనసును చిందరవందర చేస్తోంది.
 ***

No comments:

Post a Comment

Pages