సుబ్బుమామయ్య కబుర్లు - అచ్చంగా తెలుగు
సుబ్బుమామయ్య కబుర్లు!


పిల్లలూ, వేసవి సెలవులని బాగా ఎంజాయ్ చేశారా?
వేసవి సెలవుల్లో ఏం చేశారు? ఊళ్లెళ్లారా? అక్కడి వింతలు విశేషాలు చూశారా? డ్రాయింగ్, సింగింగ్, గేమ్స్, ఇన్ స్ట్రుమెంట్స్ ప్లే చేయడంలో క్రాష్ కోర్స్ చేశారా? ఇంకేవన్నా ఆసక్తి కలిగించేవి చేశారా?
కొత్త విషయాలేమన్నా తెలిసాయా? అయితే మీ ఫ్రెండ్స్ తో పంచుకోండి. కారణం అందరూ అన్నీ చేయలేరు. మనం చేసినవి మరొకరికి ఆసక్తిని కలిగించొచ్చు. అలాగే వాళ్లు చేసింది మీకూ స్ఫూర్తినివ్వొచ్చు. 
ఉదాహరణకి మీరు నది ఉండే మీ అమ్మమ్మ ఇంటికి వెళ్లారనుకోండి. నదులు ఎలా ఉంటాయి, వాటి ప్రవాహం ఎలా ఉంటుంది. పడవళ్లాంటి ఎన్ని రకాల ప్రయాణ సాధనాలు ఆ నీళ్లలో ప్రయాణం చేస్తాయి. ఆ నీళ్లతో స్నానం, పూజా కార్యాక్రమాల్లాంటి ఎన్ని రకాల పనులు చేస్తారు. చేపలు ఎలా పడతారు. తామరల్లాంటి ఎన్ని పువ్వులను ఆ నదుల్లో చూడొచ్చు ఇలాంటివి మీరు చెబుతూంటే, సిటీల్లో నల్లాల్లోంచి వచ్చే నీళ్లు తప్ప ఎరగని వాళ్లు మీరు చెప్పేవి ఆసక్తిగా వింటారు. అలాగే మీ ఫ్రెండ్స్ ఏ హిమాలయాల్లోనో, రాజస్థాన్ ఎడారి ప్రాంతాల్లోనో నివశించేవాళ్లయితే వాళ్లు చెప్పేది మీకూ వింతగా అనిపిస్తుంది.
సరే ఇహ అసలు విషయానికి వస్తే స్కూళ్లు తెరచి నెలయింది. ..పోయిన సంవత్సరం, మీరు ఏయే విషయాల్లో వీకో అందులో ఇంప్రూవ్ అవడానికి ప్రయత్నంచండి.
చక్కగా పుస్తకాలకి అట్టలేసుకోండి. మాస్టార్లు చెప్పేది శ్రద్ధగా వినండి. ఎప్పటి పనులు అప్పుడు చేసుకోండి. అన్ని పరీక్షలకి ప్రణాళికా(Plan)బద్ధంగా ప్రిపేర్ అవ్వండి.
పోయిన సంవత్సరం కన్నా మంచి మార్కులు తెచ్చుకోండి. సంస్కారవంతులుగా గుర్తింపు తెచ్చుకోండి. ఎందుకంటే, ఇప్పుడు మీరు కాస్త పెద్దయ్యారు. ఒక క్లాసు దాటి కొత్త తరగతిలోకి వచ్చారు.
ఉంటానర్రా!
మీ సుబ్బు మామయ్య.

No comments:

Post a Comment

Pages