జయహో భరతావని - అచ్చంగా తెలుగు
 ||జయహో భరతావని||
పి.వి.యల్.సుజాత 


జయహో భరతావని
జయము! జయము!!
విప్లవ వీరులగన్న
వీరమాత నీవు
పంచశీల బోధించిన
పుణ్య చరిత నీవు
త్రివేణి సంగమ
పవిత్ర ధరిత్రి నీవు
అమరావతి శీల్పేందరల
అందెల నాదానివి నీవు
హంపీ మధుకళల
సొంపు సొగసరివి నీవు
ఓరుగంటి, కలువగంటి
కీర్తి తెలుపు ఖ్యాతివి నీవు
తుంగ భద్ర తరంగాల
పొంగు పాటవి నీవు
సహజీవనము, సమభావనము
తెలిపిన సుగుణశీలివి నీవి
జయహో భారతావని
జయము! జయము!!

 ***

No comments:

Post a Comment

Pages