ఈ దారి మనసైనది - 20 - అచ్చంగా తెలుగు
ఈ దారి మనసైనది - 20

అంగులూరి అంజనీదేవి

(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన్విత. మన్విత, అనురాగ్ లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. అనురాగ్ తల్లి ప్రియబాంధవి మన్విత పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపిస్తూ ఉంటుంది. జాతరకు వెళ్తారు, దీక్షిత, మన్విత, అనురాగ్, మిత్రులు. దీక్షితతో అనురాగ్ సన్నిహితంగా ఉండడాన్ని భరించలేకపోతుంది మన్విత. పల్స్ ప్రోగ్రాం టూర్ కి ఢిల్లీ, ఆగ్రా వెళ్తారు అందరూ. తాజ్ మహల్ చూస్తూ ఉంటారు.)   

ఏదో పని విూద దినేష్ వచ్చి అనురాగ్నితీసికెళ్లాడు.

అతనలా వెళ్లగానే అక్కడో క్షణం కూడా నిలబడాలనిపించకవచ్చేస్తుంటే....

“ఏంటి !మన్వితా ! అప్పడే వస్తున్నావ్ ? ఏదో చెప్పేదానిలా పరిగెత్తుకుంటూ అనురాగ్ దగ్గరికివెళ్లావుగా! ఇంతకీ ఏం చెప్పాలని వెళ్లావ్?" అంటూ ఉడికించింది సౌమ్య

“ఏం లేదు" అంది మన్విత అసహనాన్ని దాచుకుంటూ పొడిగా,

“ఏదోవుంది చెప్పి తీరాలి. నేను ఒప్పకోను. నువ్వేదో చెప్పాలనే వెళ్లావు." అంది పట్టుదలగా, నీ మనసు నాకు తెలుసు అన్నట్లుగా,

“అవును చెప్పాలనే వెళ్ళాను." అంది

ఉత్సుకత పెరిగింది సౌమ్యలో....

"భారత్కు  ఒక జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని, జాతీయ పక్షిని, జాతీయ జంతువును, జాతీయ పుష్పాన్నిగుర్తించినట్లే "భగవద్గీతను కూడా జాతీయ ధర్మశ్రాస్త్రంగా గుర్తించాలని అనుకుంటున్నారట. అది చెప్పాలని వెళ్ళాను. ఈ లోపల దినేష్ వచ్చి అనురాగ్నితీసికెళ్లాడు." అంటున్నమన్విత కళ్లలోని చెమరింపు... సౌమ్య హృదయాన్ని పిండింది.

*****

ఆగ్రా నుండి ఢిల్లీకి చేరుకున్నారు.

ఆ రాత్రికి హోటల్లో ప్రెష్ అప్ అయిన తర్వాత.

"ఎయిమ్స్" అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి బయలుదేరారు.

అక్కడికి చేరుకోగానే ఆర్గనైజర్స్ ఐడింటిటి కార్డ్ ఇచ్చారు. ఆల్ ఇండియాలో ఎన్ని మెడికల్ కాలేజీలు వున్నాయో, ఆ కాలేజీల సూడెంట్స్ంతా వచ్చారు.

...వాళ్లంతా ఎయిమ్స్ ఆడిటోరియంలో జరుగుతున్నపోగ్రాంకివెళ్ళారు. ఆడిటోరియంలోకి ప్రవేశించగానే - - - -అమ్మాయిలకు, అబ్బాయిలకు భుజాలు, చేతులు, వీపు మీద టాటూ (Tatto) మార్చ్ వేస్తున్నారు. అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ కొత్తగా అన్పించింది.

అక్కడ పద్మశ్రీ డా.ప్రకాశ్ కొఠారిగారి శిష్యులు ఒక టాపిక్ ఇచ్చి ఓన్లీప్యూచర్ టెన్స్ లో ఎవరు ఎంత సేపు మాట్లాడతారో తోటి పాటిస్పెంట్స్అబ్దక్షన్చెప్పనంత వరకు మాట్లాడాలి. అలా పది టాపిక్స్ యిచ్చి వాటి మీద వివిధ రకాలైన సంభాషణలు జరిగి అక్కడ బాగా ఎంజాయ్ చేశారు

రాత్రి ఎనిమిది కావడంతో డిన్నర్ ముగించుకొని గ్రౌండ్స్ కి బయలుదేరారు.

అక్కడ బాస్కెట్ బాల్, గేమ్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ తర్వాతమొదలవ్వటోయే ప్యాషన్ షో గురించి చర్చించుకుంటుండగానే...పదకొండు గంటలకి ఫ్యాషన్ షో స్టార్డ్అయింది.

ఫ్యాషన్ షోలో ఫస్ట్ బ్లెజర్స్ రౌండ్ తర్వాత సినిమా రౌండ్ . అలా ఒక్కో వెరైటీతో ప్యాషన్ షో కంటిన్యూ అవుతుంటే వాళ్లంతా ఎంజాయ్ చేస్తు నిలబడి చూస్తున్నారు.

ఆప్పటికిరాత్రిపన్నెండు అయింది.

డిస్కో స్టార్డ్అవబోతుందని ఆర్గనైజర్స్ అనౌన్స్ చేశారు. అక్కడబాగా ఎంజాయ్ చేశారు. ప్రొటక్షన్ కోసం ఆర్గనైజర్స్డిస్కో లో తిరుగుతున్నారు.

ఈ దారి మనసైనది - 20
అంగులూరి అంజనీదేవి
(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన్విత. మన్విత, అనురాగ్ లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. అనురాగ్ తల్లి ప్రియబాంధవి మన్విత పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపిస్తూ ఉంటుంది. జాతరకు వెళ్తారు, దీక్షిత, మన్విత, అనురాగ్, మిత్రులు. దీక్షితతో అనురాగ్ సన్నిహితంగా ఉండడాన్ని భరించలేకపోతుంది మన్విత. పల్స్ ప్రోగ్రాం టూర్ కి ఢిల్లీ, ఆగ్రా వెళ్తారు అందరూ. తాజ్ మహల్ చూస్తూ ఉంటారు.)   
అప్పటికి చాలా అలసిపోయి వుండడంతో హోటల్కి చేరుకున్నారు.

అబ్బాయిలకి, అమ్మాయిలకి సపరేట్ రూమ్స్ యిచ్చారు.

అనురాగ్ రూమ్ కి , దీక్షిత రూమ్ ఎదురుగా వుండడంతో ఆ రాత్రంతా మన్వితకి నిద్ర పట్టలేదు.

ఉదయాన్నేటిఫిన్ తిని షాపింగ్ కి వెళ్లారు.

రాత్రికి హోటల్కి వచ్చారు. మళ్లీ వాళ్ల పల్స్ పోగ్రాంకిబయలుదేరవలసిందిగాఆర్గనైజర్స్ ఇన్ఫాం చేశారు.

ఆ రాత్రికి కూడా అవే పోగ్రామ్స్ కంటిన్యూ అయ్యాయి.

ఒక పది మంది విద్యార్థులు ఉదయం ఏడు గంటల వరకు డిస్కోలోనే వుండటంతో సిమ్లాకు బయలుదేరటం ఆలస్యం అయింది.

ఉదయం ఎనిమిది గంటలకి సిమ్లాకి బయలుదేరారు.
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages