సుబ్బుమామయ్య కబుర్లు! - అచ్చంగా తెలుగు
సుబ్బుమామయ్య కబుర్లు!
అనుభూతి


అనుభూతిని ఆంగ్లంలో ఫీల్ అంటారర్రా! 
మీరు చక్కగా చదివి, పరీక్షలు మంచిగా రాసి, ఫస్ట్ ర్యాంకులో పాసై అందరి అభినందనలు పొందుతున్నారనుకోండి, అప్పుడు మీ మనసులో చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. అదే గుడ్ ఫీల్ అంటే.
చాలామంది పిల్లలు తమ బాల్యాన్ని స్కూలుకెళ్లడం, పాఠం వినడం, క్లాసువర్క్ చేయడం, ఇంటికి రావడం, హోంవర్క్ చేయడం కాసేపు ఆడుకోవడంలతో యాంత్రికంగా Mechanical) గడిపేస్తారు. అలా చేస్తే జీవితం బోర్ కొడుతుందర్రా. ఏది చేసినా ఆ పనిలో లీనమవ్వాలి.
ఉదాహరణకి- చెట్లను పెంచాలనుకున్నామనుకోండి, మంచి విత్తనం తెచ్చి, నేలను గుళ్లగా చేసి నాటి నీళ్లుపోయాలి. మొలకెత్తాక పశువులు తినకుండా దడి కట్టాలి. రోజూ శ్రద్ధగా పరిశీలించాలి. ఒకవేళ మనం వేసింది పాదైతే, అది పాకడానికి అనువుగా తాడు కట్టడం, పందిరివేయడంగాని చేయాలి. రాలిన ఆకుల్ని చెత్తడబ్బాలో వేయాలి. అప్పుడు కొంతకాలానికి దానికి కాయలుకాస్తే మనకు కలిగేది మథురానుభూతి.
చదవడం కూడా అంతేనర్రా, క్లాసు వర్క్ లు, హోం వర్క్ లు ఏదో అలా చేసి పాడెయ్యకుండా, ఓపిగ్గా, శ్రద్ధగా చేస్తే పరీక్షల్లో ఎక్కువగా శ్రమించక్కర్ల. పరీక్షలు సునాయసంగా గట్టెక్కిపోతారు. సంవత్సరమంతా ప్రశాంతంగా చక్కగా చదివి, చక్కటి మార్కులు సంపాదిస్తే ఎంత మంచి అనుభూతి కలుగుతుందో మీకు మీరే గ్రహించండి.
ఉంటానర్రా!
మీ సుబ్బు మామయ్య.

No comments:

Post a Comment

Pages