ఏ దేవుడూ నన్నడగలేదు - అచ్చంగా తెలుగు

ఏ దేవుడూ నన్నడగలేదు

Share This
 "ఏదేవుడూ నన్నడగలేదు"
నాగ్రాజ్

కొద్దిరోజులుగా
నామనసు నాలో లేదు
శిలువనెక్కిన ఏసు చెంతకి చేరి
ప్రశ్నల అశృవులు రాల్చి వెనుదిరిగింది.
తిరిగివస్తుందేమోనని
ఎదురుచూసా.... రాలేదు.

మందిరం లో రాముడి పాద ధూళిని
తాకి ప్రణమిల్లింది.
ఇంకా నా దరికి రాలేదు.

మసీదులో చేరి
ప్రార్థన చేసింది.

ఇప్పుడు నన్ను వెతుక్కుంటూ
వచ్చి నాలో లీనమైంది.

ప్రశ్నల శరపరంపరలతో!
నేనే గొప్ప నామతమాచరించమని
ఏదేవుడు నన్నడగలేదు.

మరి నిన్నెందుకడిగారు వాళ్ళు
ఈ ప్రశ్నతో ప్రశ్నార్థకం  కూడ
మిగలని శూన్యమై నేను!
***

No comments:

Post a Comment

Pages